దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో గోధుమలు, భాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు గతంలోనే నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, అప్పటికే గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొవిడ్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే.
గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా వెల్లడించారు. గోధుమలు, చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం గానీ, అలాంటి ప్రణాళిక కూడా తమ వద్ద లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..
2022 మే నుంచి భారత్ గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2023 జులై నుంచి బాస్మతియేతర బియ్యం, 2023 అక్టోబరు నుంచి చక్కెర ఎగుమతులపైనా నియంత్రణలు విధించింది. ఆహార భద్రతా అవసరాలు ఉన్న ఇండోనేషియా, సెనెగల్, గాంబియా తదితర మిత్ర దేశాలకు మాత్రం భారత్ బియ్యం పంపిస్తోందని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment