Rice Export Business
-
బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత..?
బాస్మతీయేతర బియ్యంపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు మంత్రుల బృందం సమావేశం కానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. డిమాండ్-సరఫరా, ధరల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చర్చలు జరుగుతాయని ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘బస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్ ఉంది. మంత్రుల బృందంతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగ విధానాలు, రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లో ధరలు..వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సహేతుక నిర్ణయం వెల్లడిస్తాం. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి భారతీయ ఎగుమతి విధానాలపై వ్యాపారులకు సరైన అవగాహన ఉంది. దేశంలో ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 56 బిలియన్ డాలర్లు(రూ.4.6 లక్షల కోట్లు)కు చేరుకుంది. భారత్ ఎగుమతి చేస్తున్న కొన్ని ఉత్పత్తుల్లో సమస్యలున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) పనిచేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్లు, 100 విమానాలుదేశీయంగా సరఫరాను పెంచడానికి జులై 20, 2023 నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. దాంతో స్థానికంగా బియ్యం పండిస్తున్న రైతులకు సరైన ధరలు లభించడం లేదనే వాదనలున్నాయి. రైతులు, వ్యాపారులు బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు. దాంతో ప్రభుత్వం మంత్రుల బృందంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఉప్పుడు బియ్యం(పార్బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు. -
ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?
ప్రభుత్వం ఉప్పుడు బియ్యం(పార్బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని యోచిస్తోంది. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది తమకు భారంగా మారుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దాంతో బియ్యం ఎగుమతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 2023 ఆగస్టు నుంచి 20 శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది ఎగుమతిదారులకు భారంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ సుంకాన్ని తగ్గించాలని లేదా దాని స్థానంలో ప్రత్యేక వెసులుబాటు ఉండాలనే డిమాండ్ ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం ఎగుమతుల సమస్యలను పరిష్కరించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తీసుకున్న ప్రాథమిక నిర్ణయం ప్రకారం ఉప్పుడు బియ్యం ఎగుమతిపై టన్నుకు 100 అమెరికన్ డాలర్లు(రూ.8,300) వసూలు చేస్తారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి..దేశీయంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేసింది. దాంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. దేశీయంగా వీటి నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది. -
గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై మంత్రి కీలక వ్యాఖ్యలు
దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో గోధుమలు, భాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు గతంలోనే నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, అప్పటికే గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొవిడ్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా వెల్లడించారు. గోధుమలు, చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం గానీ, అలాంటి ప్రణాళిక కూడా తమ వద్ద లేదని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే.. 2022 మే నుంచి భారత్ గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2023 జులై నుంచి బాస్మతియేతర బియ్యం, 2023 అక్టోబరు నుంచి చక్కెర ఎగుమతులపైనా నియంత్రణలు విధించింది. ఆహార భద్రతా అవసరాలు ఉన్న ఇండోనేషియా, సెనెగల్, గాంబియా తదితర మిత్ర దేశాలకు మాత్రం భారత్ బియ్యం పంపిస్తోందని మంత్రి చెప్పారు. -
నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్ ఏంటో తెలిస్తే..!
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఇపుడు మరో కీలకమైన అడుగువేయనుందని తెలుస్తోంది. ఈ ఎగుమతుల బ్యాన్ లిస్ట్‌లో నెక్ట్స్ చక్కెర ఉండవచ్చనే అంచనాలు ఆందోళన రేకెత్తిస్తోంది. బియ్యం ఎగుమతి నిషేధం ఆహార భద్రత, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళనకు స్పష్టమైన సంకేతమిదని ట్రాపికల్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఈ జాబితాలో చక్కెర , ఇథనాల్ ఉండవచ్చని సంస్థ హెడ్ హెన్రిక్ అకమైన్ అన్నారు. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు) ఇప్పటికే ప్రతికూల వాతావరణం, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని, ఈనేపథ్యంలో చక్కెర విషయంలో ఇలాంటి నిషేధాలనే అమలు చేయనుంది అనేది ఆందోళన కలిగిస్తోందని అకమైన్ అన్నారు. దేశీయ ధరలను నియంత్రించేందుకు బియ్యం ఎగుమతులను నిషేధించిన తర్వాత, మరో ముఖ్యమైన ఆహారం వస్తువు చక్కెరపై ఆంక్షలుండవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ సరఫరాలు కఠినతరం కావడంతో దక్షిణాసియా దేశం నుండి చక్కెర ఎగుమతులపై ప్రపంచం ఎక్కువగా ఆధారపడుతోంది. భారతదేశంలోని వ్యవసాయ బెల్ట్లలో అసమాన వర్షపాతం చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందనే ఆందోళనను రేకెత్తించింది. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే సీజన్లో వరుసగా రెండో సంవత్సరం పడిపోనుందని అంచనా. ఇది దేశం ఎగుమతి సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు. దేశీయ సరఫరాలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, కొన్ని బియ్యం రకాల విదేశీ అమ్మకాలను పరిమితం చేసిన సంగతి తెలిసిందే. (అయ్యయ్యో.. దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది) మరోవైపు మహారాష్ట్ర , కర్నాటకలోని ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలలో చెరకు పొలాలు జూన్‌లో తగిన వర్షాలు పడలేదు. ఇది పంట ఒత్తిడికి దారితీసిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య జున్‌జున్‌వాలా తెలిపారు. 2023-24లో చక్కెర ఉత్పత్తి ఏడాది క్రితం నుండి 31.7 మిలియన్ టన్నులకు 3.4శాతం తగ్గుతుందని గ్రూప్ అంచనా వేసింది. అయినప్పటికీ, దేశీయ డిమాండ్‌ను సరఫరా చేయగలదని జున్‌జున్‌వాలా చెప్పారు. ఇదిలా ఉండగా, జీవ ఇంధనం కోసం భారత్ మరింత చక్కెరను వినియోగించేందుకు సిద్ధమైంది. ఇథనాల్‌ను తయారు చేయడానికి 4.5 మిలియన్ టన్నులను మళ్లించడాన్నిఅసోసియేషన్ గుర్తించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.8శాతం ఎక్కువ. భారతదేశం ఇంతకు ముందు చక్కెర ఎగుమతులను పరిమితం చేసింది. 2022-23 సీజన్లో, ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు పరిమితం చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం 11 మిలియన్ టన్నుల నుండి తగ్గింది. తదుపరి సీజన్లో, అకామైన్ అండ్ లిమాతో సహా విశ్లేషకులు 2 మిలియన్ నుండి 3 మిలియన్ టన్నులు మాత్రమే అనుమతించబడతారని భావిస్తున్నారు.ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలో, భారతదేశం ఎటువంటి ఎగుమతిని ఆంక్షలను విడుదల చేయకపోవచ్చు" అని స్టోన్ఎక్స్ సుగర్ అండ్ ఇథనాల్ హెడ్ బ్రూనో లిమా అన్నారు. అయితే ఇథనాల్ మళ్లింపు పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. దక్షిణ ఆఫ్రికా మధ్య అమెరికా వంటి ఇతర ప్రాంతాలలో తక్కువ ఉత్పత్తితో కలిపి, ఎల్‌నినో దక్షిణ ,ఆగ్నేయాసియా వేడి, పొడి వాతావరణ పరిస్థితులను తీసుకువస్తుందని మార్కెట్ ఆందోళన చెందుతోంది. థాయ్‌లాండ్‌లో కూడా ఉత్పత్తి తగ్గుదల కనిపించవచ్చు. దీంతో షుగర్ ఫ్యూచర్లు ఈ సంవత్సరం దాదాపు 20శాతం పెరిగాయి, అయితే బ్రెజిల్ బంపర్ పంటను సాధించింది.(లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) 2023-24 చక్కెర ఎగుమతి కోటాలపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అక్టోబరు నుండి మాత్రమే హార్వెస్ట్ ప్రారంభమవుతుంది. ఇటీవలి వర్షాలు పంటకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్ఎంఏ వ్యాఖ్యానించింది. అయితే ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. చక్కెర ఉత్పత్తి తక్కువగా ఉంటుందనే ఐఎస్ఎంఏ అంచనాలను భారత ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ఖండించారు. ఇలాంటి ముందస్తు అంచనాలే దేశంలో తీవ్ర కొరతను సృష్టించిందన్నారు. అయితే పూర్తి ఉత్పత్తి గణాంకాల వరకు అధికారులువేచి చూస్తారని ఉంటారని రాబోబ్యాంక్లోని సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు కార్లోస్ మేరా అన్నారు. -
బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతున్న ఏపీ
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యముంది. ఎగుమతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. దీంతో బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం దూసుకుపోతోంది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు రాష్ట్ర బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2020 – 21)లో రాష్ట్రం నుంచి రూ.5,790 కోట్ల విలువైన 22.09 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే, ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 22) మొదటి ఏడు నెలలకే (ఏప్రిల్ – అక్టోబర్) రూ.4,131.86 కోట్ల విలువైన 16.38 లక్షల టన్నులు ఎగుమతి చేసింది. 2019–20లో ఈ విలువ రూ.1,902.65 కోట్లు మాత్రమే. రెండేళ్లలోనే ఎగుమతులు రెండు రెట్లకు పైగా పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర బియ్యం ఎగుమతులు 30 లక్షల టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. డీప్ వాటర్ పోర్టు ద్వారా కూడా గతంలో కాకినాడ యాంకర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతి జరిగేది. దీంతో బియ్యం తీసుకెళ్లడానికి వచ్చిన ఓడలు దీర్ఘకాలం సముద్రంలోనే నిరీక్షించాల్సి వచ్చేది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అహార సంక్షోభం తలెత్తింది. బియ్యానికి డిమాండ్ పెరిగింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించి కాకినాడ డీప్ వాటర్ పోర్టు ద్వారా కూడా బియ్యం ఎగుమతికి అనుమతులు తీసుకొంది. ఇక్కడి నుంచి కూడా బియ్యం ఎగుమతులకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. గతంలో నెలకు 10 నుంచి 12 ఓడల ద్వారా ఎగుమతి చేయగలిగేవాళ్లమని, ఇప్పుడు 16 ఓడల వరకు ఎగుమతి చేస్తున్నామని కాకినాడ యాంకరేజ్ పోర్టు అధికారులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం బియ్యం ఎగుమతి కోసం వచ్చిన ఓడ లోడింగ్‌కు కనీసం 30 రోజులు పట్టేదని, అది ఇప్పుడు 20 రోజులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. 10 శాతం వాటాపై దృష్టి ప్రస్తుతం రాష్ట్ర ఎగుమతుల్లో 5 శాతం వాటాను కలిగి ఉన్న బియ్యం రానున్న రోజుల్లో 10 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో కేంద్రం కూడా ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి బియ్యం (నాన్ బాసుమతి) 177.2 లక్షల టన్నుల ఎగుమతి అయింది. అది ఈ ఏడాది 200 లక్షల టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా ఆఫ్రికా దేశాలైన గునియా (17%), కోట్ డివోరి (15%), సెనెగల్ (12%) దేశాలతో పాటు బంగ్లాదేశ్, ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. -
అత్యాశతో కిడ్నాప్..హత్య
వీడిన అరుణ్‌కుమార్ మర్డర్ కేసు మిస్టరీ నిందితుడి అరెస్టు చందానగర్: గతనెల 23న ద్వారకా టిఫిన్ సెంటర్ సమీపంలో అనుమానాస్పద స్థితి జరిగిన కాపారపు అరుణ్‌కుమార్ హత్య కేసు మిస్టరీని చందానగర్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చందానగర్ డీఐ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన గండి నవీన్ (26) ఎంబీఏ పూర్తి చేశాడు. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రూ.2 లక్షలు నష్టపోయాడు. తర్వాత తండ్రి రూ. 20 లక్షలు అప్పు చేసి ఇవ్వగా.. రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రారంభించాడు. ఈ వ్యాపారంలో లాభాలు రావడంలేదు. దీనికి తోడు చేసిన అప్పుకు ప్రతి నెల రూ. 40 వేల వడ్డీ చెల్లిస్తుండటంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో సులవుగా డబ్బు సంపాదించేందుకు ఎవరినైనా కిడ్నాప్ చేయాలని నవీన్ పథకం వేసి.. జూన్ 26న హైదరాబాద్‌కు మకాం మార్చాడు. వెంకటగిరి కాలనీలో ఉంటున్న స్నేహితుల వద్దకు వచ్చాడు. జీఆర్‌ఏ పరీక్షకు కోచింగ్ తీసుకొనే వారు ధనవంతులవుతారని, వారిని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా కేపీహెచ్‌బీలోని బ్రూ క్లిన్ ప్రివ్యూ కోచింగ్ సెంటర్లో చేరాడు. కిడ్నాప్ చేసిన వారిని నిర్భందించేందుకు హౌసింగ్‌బోర్డులో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కోచింగ్ సెంటర్లో మొదట విజయవాడకు చెందిన మహేష్ ధనవంతుడిగా గుర్తించి, పరిచయం పెంచుకున్నాడు. తన ఫ్లాట్‌కు పిలిచి మద్యం తాగించబోయాడు. అతడు నిరాకరించడంతో కిడ్నాప్ పథకం బెడిసికొట్టింది. సాయి అనే విద్యార్థిని తన రూమ్‌కు ఆహ్వానించగా అతను నిరాకరించాడు. ఇదిలా ఉండగా... వైజాగ్‌కు చెందిన కాపారపు శివనాయుడు కుమారుడు అరుణ్ కుమార్ (31) వైజాగ్‌లో నగల షాపు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అనుభవం కోసం తన బంధువుల షాపులో కొన్ని రోజు పని చేద్దామని 3 నెలల క్రితం నగరానికి వచ్చాడు. ఇతనితో ఓ పార్టీలో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. అరుణ్ ఆస్తిపరుడిని గ్రహించిన నవీన్ అతడి ని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. పార్టీ ఇస్తానని గత నెల 22న హౌజింగ్ బోర్డులోని తన ఫ్లాట్‌కు ఆటోలో తీసుకొచ్చాడు. మార్గం మధ్యలో మద్యం బాటిల్ కాన్నాడు. ఫొటోలు చూస్తానని అరుణ్ సెల్‌ఫోన్ తీసుకొని స్విచ్ఛాప్ చేశాడు. తర్వాత మద్యంలో నిద్రమాత్రలు వేసి తాగించాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. అరుణ్ నిద్రలోకి జారుకోగానే..గోనెసంచిలో బంధించి తాళ్లతో బిగించాడు. తర్వాత మేల్కొన్న అరుణ్ పెద్దగా అర్వడంతో కట్టెతో తలపై మోదాడు. మళ్లీ అరవడంతో మరోసారి మోదాడు. దీంతో అతను చనిపోయాడు. కంగారుపడ్డ నవీన్.. మృతదేహాన్నిఎక్కడైనా వదిలేయాలని నిర్ణయించుకొని ఆటోలో ఎక్కించాడు. తర్వాత చందానగర్‌లోని ద్వారకా హాటల్ సమీపానికి మృతదేహాన్ని తీసుకొచ్చాడు. మద్యం మత్తులో ఉన్నాడని అక్కడి వారికి చెప్పాడు. మంచినీళ్లు తెచ్చి తాగిస్తానని చెప్పి మృతదేహాన్ని అక్కడే విచి పారిపోయాడు. ఇలా ఛేదించారు... ‘సాక్షి’లో వచ్చిన ఫొటో ఆధారంగా మృతుని బంధువులు చందానగర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించారు. 23న మధ్యాహ్నం అరుణ్ సెల్‌ఫోన్‌ను నవీన్ స్విచ్ఛాన్ చేశాడు. అరుణ్ ఆచూకీ తెలియక అతని ఫోన్‌కు బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారు. అతని ఫోన్ లాక్ కావడంతో సిమ్‌కార్డు బయటకు తీసి.. తన వద్ద ఉన్న ఫోన్లో వేసి ‘ నేను క్షేమంగా ఉన్నా.. భయపడవద్దు’అని అరుణ్ కుటుంబసభ్యులకు మెసేజ్ చేశాడు. అయితే, పోలీసులు ఆ సెల్‌ఫోన్ గతంలో ఉపయోగించిన నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నవీన్ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.