ప్రభుత్వం ఉప్పుడు బియ్యం(పార్‌బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని యోచిస్తోంది. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది తమకు భారంగా మారుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దాంతో బియ్యం ఎగుమతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 2023 ఆగస్టు నుంచి 20 శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది ఎగుమతిదారులకు భారంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ సుంకాన్ని తగ్గించాలని లేదా దాని స్థానంలో ప్రత్యేక వెసులుబాటు ఉండాలనే డిమాండ్ ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం ఎగుమతుల సమస్యలను పరిష్కరించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తీసుకున్న ప్రాథమిక నిర్ణయం ప్రకారం ఉప్పుడు బియ్యం ఎగుమతిపై టన్నుకు 100 అమెరికన్ డాలర్లు(రూ.8,300) వసూలు చేస్తారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.
ఇదీ చదవండి: బడ్జెట్‌లో రైతన్న కోరుకుంటున్నవి..
దేశీయంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేసింది. దాంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. దేశీయంగా వీటి నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment