India Rice Export Ban Now Sparks Concern That Sugar Might Be Next - Sakshi
Sakshi News home page

నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్‌ ఏంటో తెలిస్తే..!

Published Mon, Aug 7 2023 8:21 PM | Last Updated on Mon, Aug 7 2023 9:49 PM

India rice export ban now sparks concern that sugar might be next - Sakshi

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఇపుడు మరో కీలకమైన అడుగువేయనుందని తెలుస్తోంది. ఈ ఎగుమతుల బ్యాన్‌  లిస్ట్‌లో నెక్ట్స్‌ చక్కెర  ఉండవచ్చనే అంచనాలు ఆందోళన రేకెత్తిస్తోంది.  బియ్యం ఎగుమతి నిషేధం ఆహార భద్రత, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళనకు స్పష్టమైన సంకేతమిదని ట్రాపికల్ రీసెర్చ్ సర్వీసెస్‌  వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రానున్న  రోజుల్లో ఈ జాబితాలో చక్కెర , ఇథనాల్ ఉండవచ్చని సంస్థ హెడ్ హెన్రిక్ అకమైన్ అన్నారు. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్‌ తనేజా, ఆసక్తికర విషయాలు)

ఇప్పటికే ప్రతికూల వాతావరణం, ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్‌లపై ఒత్తిడి పెరిగిందని,  ఈనేపథ్యంలో చక్కెర విషయంలో ఇలాంటి నిషేధాలనే అమలు చేయనుంది అనేది ఆందోళన కలిగిస్తోందని అకమైన్ అన్నారు. దేశీయ ధరలను నియంత్రించేందుకు బియ్యం ఎగుమతులను నిషేధించిన తర్వాత, మరో ముఖ్యమైన ఆహారం వస్తువు చక్కెరపై ఆంక్షలుండవచ్చని  వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ సరఫరాలు కఠినతరం కావడంతో దక్షిణాసియా దేశం నుండి చక్కెర ఎగుమతులపై ప్రపంచం ఎక్కువగా ఆధారపడుతోంది. భారతదేశంలోని వ్యవసాయ బెల్ట్‌లలో అసమాన వర్షపాతం చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందనే ఆందోళనను రేకెత్తించింది. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే సీజన్‌లో వరుసగా రెండో సంవత్సరం పడిపోనుందని అంచనా. ఇది దేశం ఎగుమతి సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు. దేశీయ సరఫరాలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, కొన్ని బియ్యం రకాల విదేశీ అమ్మకాలను పరిమితం చేసిన సంగతి తెలిసిందే. (అయ్యయ్యో.. దుబాయ్‌ అతిపెద్ద జెయింట్‌ వీల్‌ ఆగిపోయింది)

మరోవైపు మహారాష్ట్ర , కర్నాటకలోని ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలలో చెరకు పొలాలు జూన్‌లో తగిన వర్షాలు పడలేదు. ఇది పంట ఒత్తిడికి దారితీసిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య జున్‌జున్‌వాలా తెలిపారు. 2023-24లో చక్కెర ఉత్పత్తి ఏడాది క్రితం నుండి 31.7 మిలియన్ టన్నులకు 3.4శాతం  తగ్గుతుందని గ్రూప్ అంచనా వేసింది. అయినప్పటికీ, దేశీయ డిమాండ్‌ను సరఫరా చేయగలదని జున్‌జున్‌వాలా చెప్పారు. ఇదిలా ఉండగా, జీవ ఇంధనం కోసం భారత్‌ మరింత చక్కెరను వినియోగించేందుకు సిద్ధమైంది. ఇథనాల్‌ను తయారు చేయడానికి 4.5 మిలియన్ టన్నులను మళ్లించడాన్నిఅసోసియేషన్ గుర్తించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.8శాతం ఎక్కువ.

భారతదేశం ఇంతకు ముందు చక్కెర ఎగుమతులను పరిమితం చేసింది. 2022-23 సీజన్‌లో, ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు పరిమితం చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం 11 మిలియన్ టన్నుల నుండి తగ్గింది. తదుపరి సీజన్‌లో, అకామైన్ అండ్‌ లిమాతో సహా విశ్లేషకులు 2 మిలియన్ నుండి 3 మిలియన్ టన్నులు మాత్రమే అనుమతించబడతారని భావిస్తున్నారు.ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలో, భారతదేశం ఎటువంటి ఎగుమతిని ఆంక్షలను విడుదల చేయకపోవచ్చు" అని స్టోన్‌ఎక్స్‌  సుగర్‌ అండ్‌ ఇథనాల్ హెడ్ బ్రూనో లిమా అన్నారు. అయితే ఇథనాల్ మళ్లింపు పూర్తి స్థాయిలో జరుగుతుందా  లేదా అనేది  పరిశీలించాల్సి  ఉందన్నారు. 

దక్షిణ ఆఫ్రికా  మధ్య అమెరికా వంటి ఇతర ప్రాంతాలలో తక్కువ ఉత్పత్తితో కలిపి, ఎల్‌నినో దక్షిణ ,ఆగ్నేయాసియా వేడి, పొడి వాతావరణ పరిస్థితులను తీసుకువస్తుందని మార్కెట్ ఆందోళన చెందుతోంది. థాయ్‌లాండ్‌లో కూడా ఉత్పత్తి తగ్గుదల కనిపించవచ్చు. దీంతో షుగర్ ఫ్యూచర్‌లు ఈ సంవత్సరం దాదాపు 20శాతం పెరిగాయి, అయితే బ్రెజిల్ బంపర్ పంటను సాధించింది.(లక్‌ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్‌ పట్టిచ్చింది!)

2023-24 చక్కెర ఎగుమతి కోటాలపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అక్టోబరు నుండి మాత్రమే హార్వెస్ట్ ప్రారంభమవుతుంది. ఇటీవలి వర్షాలు పంటకు ప్రయోజనం చేకూరుస్తుందని  ఐఎస్‌ఎంఏ వ్యాఖ్యానించింది. అయితే ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. చక్కెర  ఉత్పత్తి  తక్కువగా ఉంటుందనే ఐఎస్‌ఎంఏ అంచనాలను భారత ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా  ఖండించారు. ఇలాంటి ముందస్తు అంచనాలే  దేశంలో తీవ్ర కొరతను సృష్టించిందన్నారు. అయితే  పూర్తి ఉత్పత్తి గణాంకాల వరకు అధికారులువేచి  చూస్తారని  ఉంటారని రాబోబ్యాంక్‌లోని సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు కార్లోస్ మేరా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement