center decision
-
నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్ ఏంటో తెలిస్తే..!
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఇపుడు మరో కీలకమైన అడుగువేయనుందని తెలుస్తోంది. ఈ ఎగుమతుల బ్యాన్ లిస్ట్‌లో నెక్ట్స్ చక్కెర ఉండవచ్చనే అంచనాలు ఆందోళన రేకెత్తిస్తోంది. బియ్యం ఎగుమతి నిషేధం ఆహార భద్రత, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళనకు స్పష్టమైన సంకేతమిదని ట్రాపికల్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఈ జాబితాలో చక్కెర , ఇథనాల్ ఉండవచ్చని సంస్థ హెడ్ హెన్రిక్ అకమైన్ అన్నారు. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు) ఇప్పటికే ప్రతికూల వాతావరణం, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని, ఈనేపథ్యంలో చక్కెర విషయంలో ఇలాంటి నిషేధాలనే అమలు చేయనుంది అనేది ఆందోళన కలిగిస్తోందని అకమైన్ అన్నారు. దేశీయ ధరలను నియంత్రించేందుకు బియ్యం ఎగుమతులను నిషేధించిన తర్వాత, మరో ముఖ్యమైన ఆహారం వస్తువు చక్కెరపై ఆంక్షలుండవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ సరఫరాలు కఠినతరం కావడంతో దక్షిణాసియా దేశం నుండి చక్కెర ఎగుమతులపై ప్రపంచం ఎక్కువగా ఆధారపడుతోంది. భారతదేశంలోని వ్యవసాయ బెల్ట్లలో అసమాన వర్షపాతం చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందనే ఆందోళనను రేకెత్తించింది. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే సీజన్లో వరుసగా రెండో సంవత్సరం పడిపోనుందని అంచనా. ఇది దేశం ఎగుమతి సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు. దేశీయ సరఫరాలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, కొన్ని బియ్యం రకాల విదేశీ అమ్మకాలను పరిమితం చేసిన సంగతి తెలిసిందే. (అయ్యయ్యో.. దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది) మరోవైపు మహారాష్ట్ర , కర్నాటకలోని ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలలో చెరకు పొలాలు జూన్‌లో తగిన వర్షాలు పడలేదు. ఇది పంట ఒత్తిడికి దారితీసిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య జున్‌జున్‌వాలా తెలిపారు. 2023-24లో చక్కెర ఉత్పత్తి ఏడాది క్రితం నుండి 31.7 మిలియన్ టన్నులకు 3.4శాతం తగ్గుతుందని గ్రూప్ అంచనా వేసింది. అయినప్పటికీ, దేశీయ డిమాండ్‌ను సరఫరా చేయగలదని జున్‌జున్‌వాలా చెప్పారు. ఇదిలా ఉండగా, జీవ ఇంధనం కోసం భారత్ మరింత చక్కెరను వినియోగించేందుకు సిద్ధమైంది. ఇథనాల్‌ను తయారు చేయడానికి 4.5 మిలియన్ టన్నులను మళ్లించడాన్నిఅసోసియేషన్ గుర్తించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.8శాతం ఎక్కువ. భారతదేశం ఇంతకు ముందు చక్కెర ఎగుమతులను పరిమితం చేసింది. 2022-23 సీజన్లో, ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు పరిమితం చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం 11 మిలియన్ టన్నుల నుండి తగ్గింది. తదుపరి సీజన్లో, అకామైన్ అండ్ లిమాతో సహా విశ్లేషకులు 2 మిలియన్ నుండి 3 మిలియన్ టన్నులు మాత్రమే అనుమతించబడతారని భావిస్తున్నారు.ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలో, భారతదేశం ఎటువంటి ఎగుమతిని ఆంక్షలను విడుదల చేయకపోవచ్చు" అని స్టోన్ఎక్స్ సుగర్ అండ్ ఇథనాల్ హెడ్ బ్రూనో లిమా అన్నారు. అయితే ఇథనాల్ మళ్లింపు పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. దక్షిణ ఆఫ్రికా మధ్య అమెరికా వంటి ఇతర ప్రాంతాలలో తక్కువ ఉత్పత్తితో కలిపి, ఎల్‌నినో దక్షిణ ,ఆగ్నేయాసియా వేడి, పొడి వాతావరణ పరిస్థితులను తీసుకువస్తుందని మార్కెట్ ఆందోళన చెందుతోంది. థాయ్‌లాండ్‌లో కూడా ఉత్పత్తి తగ్గుదల కనిపించవచ్చు. దీంతో షుగర్ ఫ్యూచర్లు ఈ సంవత్సరం దాదాపు 20శాతం పెరిగాయి, అయితే బ్రెజిల్ బంపర్ పంటను సాధించింది.(లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) 2023-24 చక్కెర ఎగుమతి కోటాలపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అక్టోబరు నుండి మాత్రమే హార్వెస్ట్ ప్రారంభమవుతుంది. ఇటీవలి వర్షాలు పంటకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్ఎంఏ వ్యాఖ్యానించింది. అయితే ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. చక్కెర ఉత్పత్తి తక్కువగా ఉంటుందనే ఐఎస్ఎంఏ అంచనాలను భారత ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ఖండించారు. ఇలాంటి ముందస్తు అంచనాలే దేశంలో తీవ్ర కొరతను సృష్టించిందన్నారు. అయితే పూర్తి ఉత్పత్తి గణాంకాల వరకు అధికారులువేచి చూస్తారని ఉంటారని రాబోబ్యాంక్లోని సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు కార్లోస్ మేరా అన్నారు. -
అద్భుతం : మనకీ ధైర్యం పెరుగుతుంది
సాక్షి, ముంబై : లాక్డౌన్ ఆంక్షలను కొంతమేర సడలిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో స్థానిక దుకాణాలను తిరిగి తెరవడం వారి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుందనీ ఇది ప్రజల మనోస్థైర్యాన్ని పెంచుతుందనీ శనివారం ఆయన ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం అద్భుతమైందనీ, స్థానిక వ్యాపారాలే సమాజానికి వెన్నుముక లాంటివని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా స్థానిక దుకాణాదారులే బాగా ఒత్తిడిని ఎదుర్కొన్నారన్నారు. తాజా నిర్ణయంతో షాపులు తిరిగి తెరుచుకుని ఆర్థికంగా తెప్పరిల్లే అవకాశం వారికి కలుగుతుందన్నారు. మన ధైర్యాన్ని కూడా పెంచుతుందనీ, అలాగే వారికి హోం డెలివరీ చేసే అవకాశం కూడా లభిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. (ఇ-కామర్స్ కంపెనీలకు మరో షాక్) కోవిడ్-19 ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నెల రోజుల తరువాత హాట్స్పాట్లు లేదా కంటైన్మెంట్ ప్రాంతాలను మినహాయించి, స్థానిక వ్యాపారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ కేంద్రం శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. నివాస సముదాయాలు, పరిసరాల్లోని దుకాణాలతో సహా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని తెలిపింది. అయితే ఈ సడలింపులు, కరోనావైరస్ హాట్స్పాట్లు లేదా కంటైన్మెంట్ జోన్లకు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఆయా దుకాణాల్లోని కార్మికులకు మాస్క్ లు, సామాజిక దూర నిబంధనలు తప్పనిసరి అని హోం మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్ .2 మే 3వ తేదీవరకు పొడిగించిన గతి తెలిసిందే. (5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!) చదవండి : ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్ -
సీఏపీఎఫ్ రిటైర్మెంట్ @ 60 ఏళ్లు
న్యూఢిల్లీ: అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) నుంచి అత్యున్నత ర్యాంకు డైరెక్టర్ జనరల్(డీజీ) వరకు ఉన్న ఈ నాలుగు బలగాల అధికారుల రిటైర్మెంట్ వయస్సు కూడా ఇకపై 60 ఏళ్లే. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ బలగాలకు చెందిన అన్ని స్థాయిల అధికారులకు 60 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండగా తమకు మాత్రమే 57 ఏళ్లను రిటైర్మెంట్ వయస్సుగా నిర్ణయించటం వివక్ష చూపడమేనంటూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం.. ఇలా వేర్వేరు పదవీ విరమణ వయస్సులను నిర్ధారించడం ‘రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితం’ అని, బలగాల మధ్య అంతరం చూపడమేనని వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని సవరించాలని జనవరిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా బలగాలను ఆదేశిస్తూ సోమవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా రిటైరై ఉంటే అలాంటి వారు తాము పొందిన రిటైర్మెంట్ ప్రయోజనాలను వాపసు చేసి తిరిగి విధుల్లో చేరవచ్చనీ లేదా 60 ఏళ్లు వచ్చే వరకు విధుల్లో కొనసాగి, రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకోవచ్చని తెలిపింది. రిటైరైన తర్వాత న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారు, స్టే పొందిన కూడా 60 ఏళ్లు వచ్చే దాకా తమ విధుల్లో కొనసాగవచ్చని కూడా స్పష్టత ఇచ్చింది. ఈ నాలుగు బలగాలకు చెందిన కమాండెంట్ స్థాయి దిగువ హోదా వారికి ఏడో వేతన సంఘం కమిషన్ సిఫారసులు సీఐఎస్ఎఫ్ మాదిరిగానే వర్తిస్తాయని పేర్కొంది. అయితే, తక్షణం కార్యక్షేత్రం దూకాల్సిన అవసరం ఉండే సీఆర్పీఎఫ్ వంటి బలగాల అధికారుల ఫిట్నెస్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి సీఏపీఎఫ్ నాయకత్వం తెలిపింది.