We Encourage Removal Of Restrictions On Rice Export, Says IMF - Sakshi
Sakshi News home page

బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్‌ చీఫ్ ఎకనామిస్ట్

Published Wed, Jul 26 2023 10:46 AM | Last Updated on Wed, Jul 26 2023 11:37 AM

We Encourage Removal Of Restrictions On Rice Export IMF To India - Sakshi

Restrictions On Rice Export  IMF To India  బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర   సర్కార్‌ చర్యలు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ సంక్షోభం నెలకొంది. ఇటీవల బియ్యం కోసం  విదేశాల్లో భారతీయులు క్యూ కట్టిన దృశ్యాలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా బియ్యం కొనుగోళ్లు విపరీతంగా పుంజు కున్నాయి. నెలలో కొనే బియ్యానికి రెట్టింపు పరిమాణంలో భారతీయులు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆస్ట్రేలియాలోని  దుకాణ దారులు  చెబుతున్నారు.  

బాస్మతీయేతరరకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలోపెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు విదేశాల్లోని భారతీయులు ప్రయత్నిస్తున్నారు.  ఫలితంగా ఒక్కసారిగా డిమాండ్‌  పెరగడంతో దాన్ని  నియంత్రించేందుకు  వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది భారతీయులు తమ నిర్ణయం పట్ల తిరగబడుతున్నారని, అయినప్పటికీ తాము ఒకరికి 5 కిలోలకు మంచి అమ్మడంలేదని అక్కడి విక్రయదారులు వాపోతున్నారు.

మరోవైపు  బియ్యం ఎగుమతులపై పరిమితులను తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ కొరత ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని , ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితులను తొలగించాలని భారతదేశాన్ని  కోరుతున్నామని పేర్కొంది. ప్రస్తుత వాతావరణంలో, ఈ రకమైన పరిమితులు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ప్రతీకార చర్యలకు కూడా దారితీస్తాయని ఐఎంఎఫ్‌ చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివర్ గౌరించాస్ మీడియాతో  అన్నారు. 

అటు ఈ  నిషేధం కారణంగా అమెరికాలోని ఇండియన్ స్టోర్‌లలో పరిమితులు కొనసాగుతున్నాయి. దాదాపు స్టోర్లన్నీ ఖాళీ. టెక్సాస్‌లో పరిస్థితి  దారుణంగా ఉంది.  ఒక కుటుంబానికి  ఒక  బ్యాగ్‌ను మాత్రమే  అనే  బోర్డులు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
రాబోయే పండుగ సీజన్‌లో దేశీయ సరఫరాను పెంచడానికి, రిటైల్ ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం జూలై 20న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించింది. దీన్ని తక్షణమే అమలులోకి తెచ్చింది.దేశం నుండి ఎగుమతి అయ్యే మొత్తం బియ్యంలో ఈ రకం బియ్యం 25 శాతం ఎగుమతి అవుతాయి. 

కాగా భారతదేశం నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులు 2022-23లో 4.2 మిలియన్ల డాలర్లు కాగా, అంతకుముందు సంవత్సరంలో 2.62 మిలియన్‌ డాలర్లుగా ఉంది.  ఇండియానుంచి  బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతయ్యే  దేశాల్లో ప్రధానంగా అమెరికా,  థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్  శ్రీలంక ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement