ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టికరణ
రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని కావాలని స్టార్టప్‌లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు.
చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘లింక్డ్‌ఇన్’లో పోస్టు చేశారు. ‘‘మీ అనుభవం, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం దేశానికి అవసరం. నవీన ఆవిష్కరణకు ద్వారాలు తెరిచి ఉన్నాయి. మన ప్రభుత్వ విధానాలు మీకు అనుకూలంగా పని చేస్తున్నాయి. రక్షణ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి.
మనమంతా కలిసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిద్దాం. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల తయారీలోని భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలి. బలమైన, స్వయం సమృద్ధితో కూడిన ఇండియాను నిర్మిద్దాం. గతంలో మనం విదేశాల నుంచి రక్షణ పరికరాలు, ఆయుధాలు దిగుమతి చేసుకొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుత ప్రయాణం దేశంలో ప్రతి పౌరుడికీ గర్వకారణమే.
ఇండియా రక్షణ ఉత్పత్తుల విలువ 2023–24లో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఇక ఎగుమతి విలువ 2014లో కేవలం రూ.1,000 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.21,000 కోట్లకు చేరుకుంది. 12,300 రకాల పరికరాలు, ఆయుధాలు దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ.7,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) నిధుల్లో 25 శాతం నిధులను ఇన్నోవేషన్‌కే ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు అధునాతన డిఫెన్స్ కారిడార్లు రాబోతున్నాయి’’అని ప్రధాని మోదీ వెల్లడించారు.
భారతీయ యువతకు తిరుగులేదు
నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలో భారతీయ యువతకు తిరుగులేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వారు అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత్ నిరి్వరామ ప్రగతి సాధిస్తోందంటూ గిట్‌హబ్ సంస్థ సీఈఓ థామస్ డోహ్‌మ్కే ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బుధవారం స్పందించారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ముందంజలో ఉందని థామస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment