చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంది. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి 0.2 శాతం ఎగుమతులు తగ్గినట్లు కస్టమ్స్ డేటా ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే ముడి ఖనిజాల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉంది. దాదాపు 17 అరుదైన ఖనిజాలను ఆ దేశం రవాణా చేస్తుంది. ఈమేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డేటా వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
2024 ఏప్రిల్‌లో చైనా ఎగుమతులు: 4,566 టన్నులు.
2023 ఏప్రిల్‌లో ఎగుమతులు: 4,574 టన్నులు
2024 మార్చిలో ఎగుమతులు: 4,709.6 టన్నులు
2024 మొదటి నాలుగు నెలల్లో మొత్తం ఎగుమతులు: 18,049.5 టన్నులు
ఏడాదివారీగా పెరుగుదల: 10 శాతం
2024 ఏప్రిల్‌లో చైనా దిగుమతి చేసుకున్న ఖనిజాలు: మార్చితో పోలిస్తే 32.5% తగ్గి 13,145.9 టన్నులకు చేరుకున్నాయి.
2024 మొదటి నాలుగు నెలల కాలంలో దిగుమతులు మొత్తం 18.1% తగ్గి 48,842.5 టన్నులుగా నమోదయ్యాయి.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. చైనా ప్రపంచవ్యాప్తంగా 70 శాతం అరుదైన ఖనిజాలను కలిగి ఉంది. 90 శాతం మైనింగ్ రిఫైన్డ్ అవుట్‌పుట్ సామర్థ్యం చైనా సొంతం. చైనా ఎగుమతిచేసే అరుదైన ఖనిజాలతో లేజర్‌లు, సైనిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు , విండ్ టర్బైన్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.
ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు
చైనా ఇలాగే అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంటే సమీప భవిష్యత్తులో వీటితో తయారయ్యే వస్తువుల ధర పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయంగా ఖనిజాల అన్వేషణ జరిపి వాటిని వెలికితీసే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment