టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు: కురసాల కన్నబాబు | Kurasala kannababu Fires On Eenadu Over Rice Export From kakinada Port | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు: కురసాల కన్నబాబు

Published Fri, Feb 18 2022 3:29 PM | Last Updated on Fri, Feb 18 2022 5:06 PM

Kurasala kannababu Fires On Eenadu Over Rice Export From kakinada Port - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఎల్లో మీడియా కథనాలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ కేంద్రంగా కిలో బియ్యం రూ.25 లకే విదేశాలకు రిసైకిల్ చేసి ఎగుమతి చేస్తున్నారని ఈనాడులో కథనం వచ్చిందన్నారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకనే కాకినాడ నుంచి బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయా అని ప్రశ్నించారు.  ఈ మేరకు మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బియ్యం ఎగుమతి అయ్యాయా లేదా అంటూ ఈనాడు పత్రికను నిలదీశారు. అప్పుడెందుకు ఈ అనుమానం రాలేదని ప్రశ్నించారు

కనీసం వివరణ తీసుకుని వార్త రాయాలన్న జర్నలిజం నైతిక విలువలు పాటించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు మూసుకుపోయి వార్తలు రాయొద్దన్నారు. లాంగ్ గ్రేయిన్ రైస్ ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ఎగుమతి చేశారో అధ్యయనం చేయాలని సూచించారు. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే బియ్యాన్ని అధికారులు ముందుగా పరీక్షిస్తారని తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు బయటకు వచ్చి రాజకీయంగా నడవలంటే రెండు ఊత కర్రలు.. ఒక త్రీవీల్ ఛైర్ కావాలని, రాజకీయంగా కదలలేని స్ధితిలో మూలన పడిపోయారని విమర్శించారు.
చదవండి: చంద్రబాబు రివర్స్‌ డ్రామా.. ఇదీ వాస్తవం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement