కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి | Export of rice from Krishnapatnam port | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి

Published Sun, Oct 3 2021 4:35 AM | Last Updated on Sun, Oct 3 2021 4:35 AM

Export of rice from Krishnapatnam port - Sakshi

పోర్టులో లంగరు వేసిన నౌకలోకి బియ్యం బస్తాలు చేరవేస్తున్న దృశ్యం

ముత్తుకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఆదాని కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేపట్టారు. ‘ఎంవీ సారోస్‌ బీ’ అనే నౌక ద్వారా 10,900 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శనివారం చెప్పారు. ఈ మేరకు పోర్టులోని గిడ్డంగిలో సిద్ధం చేసిన బియ్యం బస్తాలను లారీల ద్వారా నౌకలోకి చేరవేస్తున్నారు.

ఈ బియ్యం బస్తాలను ఈస్ట్‌ ఆఫ్రికా దేశంలోని మెడగాస్కర్‌ పోర్టుకు చేరవేస్తున్నామని చెప్పారు. శనివారం సాయంకాలం బియ్యం ఎగుమతికి మరో నౌక పోర్టులో లంగరు వేసింది. అందులో 13వేల టన్నుల బియ్యంను వెస్ట్‌ ఆఫ్రికాలోని బెనిన్‌ పోర్టుకు చేరవేస్తామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement