Krishnapatnam port
-
కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
-
పోర్టు సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
సాక్షి ప్రతినిధి నెల్లూరు/ముత్తుకూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాడికి తెగబడిన వైనం కలకలం రేపింది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునద్ధరణ పనులపై యాజమాన్యంతో చర్చించేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం తన అనుచరులతో వెళ్లారు. పోర్టు ప్రధానద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ డీజీఎం ఎమ్మెల్యే కారుతోపాటు కొన్ని వాహనాలను లోనికి అనుమతించారు. మిగిలిన వాహనాలను తనిఖీచేయాలని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన సోమిరెడ్డి కారునుంచి దిగివచ్చి కోపంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో తిట్లదండకం అందుకున్నారు. సెక్యూరిటీ డీజీఎంపై దాడికి తెగబడి ఆయన్ని వెనక్కి నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసకువెళ్లే క్రమంలో పోలీసులు, నాయకులు డీజీఎంను వారించారు. ఇదే అంశంపై పోర్టు అడ్మిన్ భవనం వద్ద కూడా సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.సీఈఓతోనూ దురుసు ప్రవర్తనఎన్నికలముందు పోర్టు కంటైనర్ టెర్మినల్ సేవలను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటివరకు పోర్టు యాజమాన్యంతో చర్చలు జరపకపోవడం, కార్యాచరణ చేపట్టకపోవడంతో సీఐటీయూ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి అఖిలపక్షం పేరుతో పోర్టు అధికారులతో మాట్లాడేందుకు సోమవారం వెళ్లిన సోమిరెడ్డి పోర్టు కార్యాలయంలోకి వెళ్లి సీఈఓతోనూ వాగ్వాదానికి దిగారు. ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తూ కేకలు వేశారు. ఖండించిన కాకాణి కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేయిచేసుకోవడాన్ని మాజీమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డి అఖిలపక్షం పేరిట డ్రామాలు ఆడుతూ, కూటమి పార్టీల నేతలను పోర్టుకు తీసుకెళ్లడం ఏమిటని నిలదీశారు. అత్యంత భద్రత ఉండే ప్రధానమైన పోర్టులో తనిఖీచేసి వాహనాలను అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినకుండా దాడి చేశారన్నారు. పోర్టు కార్యాలయంలోనూ సోమిరెడ్డి కేకలు వేసి సీఈఓతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. ఎమ్మెల్యే వీధిరౌడీలా మారి నేరుగా దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. -
వీడియో: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జన్యం..
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సోమిరెడ్డి ప్రతీ చోటా దుసురుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి కృష్ణ పోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి కొట్టేందుకు ప్రయత్నించారు.వివరాల ప్రకారం.. కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సోమవారం పోర్టు వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. తనతో వచ్చిన ఓ కారును అనుమతించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, వెంటనే కారు దిగి.. సెక్యూరిటీపై తన ఆధిపత్యం చూపించారు. సెక్యూరిటీని నెట్టేసి.. అతడికి కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రౌడియిజంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. అదాని పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడి సెక్యూరిటీపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. రౌడీయిజం చేసి పరిశ్రమలను వెళ్లగొట్టాలని సోమిరెడ్డి కుట్రలు చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలను బెదరగొట్టి సోమిరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు. గత పది ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. రౌడీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
కృష్ణపట్నం పోర్టుపై అనవసర రాజకీయం చేస్తున్నారు: కాకాణి
-
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పని
-
KP Port: అదంతా ఎల్లో మీడియా సృష్టే: మంత్రి కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఎల్లో మీడియా, టీడీపీపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. కృష్ణపట్నం పోర్టు టెర్నినల్‌పై ఎల్లో దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు. కాగా, మంత్రి కాకాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కొత్త ఫేక్ ప్రచారానికి తెరలేపింది. కేపీ పోర్ట్ తరలి పోతుందని ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు, కేపీ పోర్టు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వానికి పోర్టుకు సంబంధించిన నివేదిక కూడా ఇచ్చింది. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అయితే, అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని సోమిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. పోర్టు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయ. కానీ, పోర్టు పురోగతికి ఎలాంటి ఢోకా లేదు. కేపీ పోర్టులో ఎలాంటి సర్వీసులు రద్దు కాలేదు. ఎక్కడికి తరలిపోలేదు. పోర్టు ఎలాంటి సర్వీస్ కూడా తొలగించలేదు. గతంలో పవర్ పొల్యూషన్‌పై కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి నాడు యాజమాన్యాలతో కుమ్ముక్కయ్యారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్ పరిక్రమ’
ముత్తుకూరు: గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు పరిశీలించడానికి ఆయన శనివారం చెన్నై నుంచి ప్రత్యేక నౌకలో నెల్లూరు జిల్లాలోని అదాని కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు. ఆయనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పోర్టు సీఈవో జీజే రావు స్వాగతం పలికారు. రూపాల పోర్టులో పర్యటించి అక్కడ జరుగుతోన్న అభివృద్ధి, ఎగుమతి దిగుమతుల వివరాలను తెలుసుకున్నారు. సముద్రతీర ప్రాంతంలో ఫిషింగ్ జెట్టీల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి కాకాణి ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మత్స్యకార భరోసాపై మంత్రి అప్పలరాజు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు ఎంపీ బీద మస్తాన్‌రావు, మత్స్యశాఖ కమిçషనర్ కన్నబాబు, ఎంపీ జీవీఎల్‌తో కలిసి కృష్ణపట్నం ఆర్కాట్పాళెంలోని మత్స్యకార గ్రామాలను రూపాల సందర్శించారు. -
ప్యాకేజీ మింగేశారు.. 1.22 కోట్ల పేదల సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి!
పోర్టు నిర్మాణంతో బతుకుదెరువు కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు అందాల్సిన నిధులను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన అనుచరులు స్వాహా చేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి కాలయాపన చేసింది. ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలంలో ఓట్ల కోసం హడావుడిగా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ నిధులను సోమిరెడ్డి మంజూరు చేయించారు. ఆ నిధులను ఆయన, అనుచరులే బొక్కేశారు. రికార్డుల్లో మాత్రం లబ్దిదారులకు అందినట్లు చూపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని అవినీతిగా ప్రచారం చేస్తూ నిత్యం ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ఉండే సోమిరెడ్డి తన అవినీతి నిర్వాకానికి మాత్రం సమాధానం చెప్పరు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రానికే తలమానికంగా కృష్ణపట్నం పోర్టును 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాల తరలింపునకు, కొంత కాలం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున రూ.32 కోట్లు అందించారు. వీరితో పాటు మత్స్యకారేతరులను గుర్తించి వారికి ప్యాకేజీ అందించాలని వైఎస్సార్ నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ అకాల మరణం నాన్ ఫిషర్మెన్ కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత పాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీని బుట్టదాఖలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.43 వేలకుపైగా ప్యాకేజీ అందిస్తామని కొంత కాలం మభ్యపెట్టింది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ఇస్తానని చెప్పడంతో అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారేతర కుటుంబాల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకూ తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీని పట్టించుకోని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో వారి ఓట్ల కోసం కేవలం ఎస్సీ, ఎస్టీలకే అంటూ ప్రత్యేకంగా రూ.4.09కోట్లు మంజూరు చేయించారు. హడావుడి గా 3,550 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.3.87 కోట్లు పంపిణీ చేయించారు. ఇంకా రూ.1.22 కోట్లు పంపిణీ చేయకుండా అప్పట్లో ఆ నగదు పంపిణీలో సోమిరెడ్డి, ఆయన అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. చెక్కుల రూపంలో పంపిణీ జరగడంతో రెవెన్యూ అధికారులు మాత్రం లబి్ధదారులకు పంపిణీ జరిగినట్లు చూపించారు. కానీ లబి్ధదారుల పేరుతో టీడీపీ నేతలే బ్యాంకు కెళ్లి డ్రా చేసుకుని ఆరగించారు. మండలంలోని పంటపాళెం, పైనాపురం, నేలటూరు, ముత్తుకూరు, దొరవులపాళెం గ్రామాల్లో దాదాపు 300 మందికి సంబంధించిన నగదును టీడీపీ నేతలే దిగమింగారు. నాకు ప్యాకేజీ ఇవ్వకుండానే.. నాకు నాన్‌ఫిషర్‌మెన్ ప్యాకేజీ కింద డబ్బులు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. నాకు మాత్రం అందలేదు. నా పేరు మీద చెక్కురాసి తీసేసుకున్నారు. టీడీపీ నేతలే ఈ పని చేశారు. మా కడుపులు కొట్టి ఇలా ప్రవర్తించడం వాళ్లకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్యాకేజీ మంజూరు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూశారు. – కర్లపూడి సుబ్రహ్మణ్యం, ముత్తుకూరు ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లారు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు నిధులు పంపిణీ చేయించారు. టీడీపీ హయాంలో ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో మాకు నిధులు ఇస్తున్నట్లు చెప్పి మా పేర్లతో టీడీపీ నేతలు తినేశారు. – సుబ్బరాయుడు, దొరవులపాళెం కాకాణి చొరవతో 16,337 కుటుంబాలకు లబ్ధి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా 16,337 కుటుంబాలను లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున రూ.35.75 కోట్లు కేటాయించి, లబి్ధదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయించారు. టీడీపీ హయాంలో రూ.10,500 మాత్రమే లబ్ధి పొందిన వారికి సైతం మిగతా రూ.14,500 వంతున ప్యాకేజీ అందించారు. -
విద్యుత్ రంగంలో మరో ముందడుగు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యుత్ రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో నిర్మించిన 3వ యూనిట్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు నిర్వాసితుల ఖాతాల్లో మత్స్యకారేతర పరిహారం జమ చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన 800 మెగావాట్ల ప్లాంటును మీ అందరి సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి (నాన్న గారు) 2008లో శంకుస్థాపన చేశారని తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఈ పవర్‌స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత శ్రీకారం చుట్టగా, నేడు మనందరి ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంతో దానిని ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవర్ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నాణ్యమైన, నిరంతర విద్యుత్ ►రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ►మననందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఈ ప్రాజెక్టుకు రూ.3,200 కోట్లు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేశాం. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ►ఈ రోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంటుతో పోల్చితే సూపర్ క్రిటికల్ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుంది. భూములిచ్చిన రైతులకు అభివాదం ► ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్లాంటు.. ఈ రెండూ ఈ ప్రాంతంలో రావాలి. వీటి ద్వారా జిల్లా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ నిండు మనసుతో శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నా. ► వీళ్లందరికీ మంచి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియను ఈ నవంబర్ పూర్తయ్యేలోగా ప్రారంభించాలని ఆదేశించాం. నెరవేరిన మరో ఎన్నికల హామీ ► ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు ఎన్నికల వేళ ఆరోజు మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడుకు మేమంతా గుర్తుకు వస్తామని ఆ రోజు మీరందరూ చెప్పారు. ► ఆయన ఐదేళ్ల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా, హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. మీ అందరి కష్టాలు నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు నేను చెప్పాను. ► ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలకు కూడా బటన్ నొక్కి నేరుగా రూ.36 కోట్ల పరిహారాన్ని వాళ్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాం. ఆ వేళ హడావుడిగా కేవలం మోసం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వని పరిస్థితులు. ఈ రోజు వాళ్లకు మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా, మిగిలిపోయిన 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ, అందరికీ ఈ ప్యాకేజీ ఇస్తున్నాం. ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే ► నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే నిర్మాణం కోసం రూ.93 కోట్ల కేటాయిస్తూ.. దానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. నా సోదరుడు, శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరిక మేరకు ఈ కాజ్వే నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా. ► ఇటువంటి ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా అడుగుతున్నా, పట్టించుకోని పాలకులను మనం చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రంలోకి వెళ్లే నీటిని ఆపగలుగుతాం. సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్‌నూ ఆపగలుగుతాం. తద్వారా నాలుగు మండలాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల ప్రారంభించిన నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతున్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టీ ► ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ప్రత్యేక జట్టీ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఉప్పుకాలువ, వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాళెం హైలెవల్ బ్రిడ్జి కోసం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రూ.12 కోట్లు అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాం. మరో హైలెవల్ బ్రిడ్జి.. నెల్లూరు నక్కలవాగు – కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటంపాడు (వయా బ్రహ్మదేవం) వరకు మరో రూ.10 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నా. ► ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలని, ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మనం గర్వించాల్సిన రోజు మనం నిజంగా గర్వించాల్సిన రోజిది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ కోసం ప్రతి వాగ్దానం చేయడం, అమలు చేయకపోవడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. 3,500 మంది ఎస్సీ, ఎస్టీలకు గాను వారిలో కూడా టీడీపీ వారికే ఇస్తామని, వైఎస్సార్సీపీ వారిని పక్కనపెట్టండని చెప్పి.. ఎవరికీ ఇవ్వలేదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో కేవలం 7 పంచాయతీలు మాత్రమే ప్యాకేజీకి ఎంపిక చేశారు. మన ప్రభుత్వం 20 పంచాయతీలతో పాటు, పోర్టుకు, థర్మల్ విద్యుత్ కేంద్రానికి భూములు ఇచ్చిన వారందరికీ రూ.36 కోట్ల ప్యాకేజీ ఇస్తోంది. జగనన్న ఏమి అడిగినా ఇస్తున్నారు. ఉప్పుకాలవ మీద రూ.12 కోట్లతో బ్రిడ్జి, కృష్ణపట్నం నక్కలకాలువ వాగు మీద రూ.9.40 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయాలని అడుగుతున్నాం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఈ రోజు 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 3వ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విద్యుత్ స్టేషన్ దేశంలోనే మొదటిది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అడ్డగోలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో చంద్రబాబు రూ.20 వేల కోట్లకు పైగా నష్టాల్లోకి తోశారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచాలని సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఖర్చు తగ్గేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవి ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ట్రాన్స్‌కో అభివృద్ధికి రూ.4 వేల కోట్లతో ఎన్నో చర్యలు తీసుకున్నారు. రూ.40 వేల కోట్ల ఆర్థిక సాయంతో డిస్కంల ఆదుకుంటున్నారు. ఇవాళ మనం 45 శాతం విద్యుత్‌ను జెన్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా పలు విధాలా ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుష్టచతుష్టయం దు్రష్పచారం చేస్తోంది. నిత్యం అసత్యాలు వల్లించే ఈ పచ్చ పత్రికలు చదవద్దని, పచ్చ టీవీలు చూడద్దని విజ్ఞప్తి చేస్తున్నా. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
ఇక వేగంగా సరకు రవాణా
సాక్షి, అమరావతి: పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాన్ని సరకు రవాణాకు (లాజిస్టిక్‌కు) కేంద్ర బిందువుగా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పోర్టులను అనుసంధానిస్తూ నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఆరు రహదారులకు కేంద్రం ఆమోదం తెలపగా, తాజాగా కృష్ణపట్నం పోర్టును అనుసంధానిస్తూ రెండు జాతీయ రహదారులకు ఆమోదం లభించింది. రూ. 2,308.31 కోట్ల అంచనాతో వీటి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి తూర్పు కానుపూరు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మిస్తారు. తద్వారా కృష్ణపట్నం పోర్టును నాయుడుపేటతో అనుసంధానిస్తారు. మొత్తం 34.88 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ.1,398.84 కోట్లు ఖర్చవుతుంది. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ రహదారి. రెండోది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని చిలకూరు క్రాస్ నుంచి తూర్పు కానుపూరు వరకు నిర్మిస్తారు. ఇది నాలుగు లేన్ల రహదారి. కృష్ణపట్నం పోర్టు దక్షిణ గేటు నుంచి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నిర్మించే ఈ మార్గం గ్రామాల వద్ద ఫ్లై ఓవర్లు, అప్రోచ్ రోడ్లతో సహా మొత్తం 36.05 కి.మీ. ఉంటుంది. రూ.909.47 కోట్లతో దీనిని నిర్మిస్తారు. వీటికి త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. 2024 జనవరి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 13 రహదారులకు ప్రతిపాదన ఆగ్నేయాసియా దేశాలతో సరకు రవాణాకు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఈ మూడు పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ 277 కిలోమీటర్ల మేర 13 రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపింది. సీఎం వైఎస్ జగన్ 2019లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మూడు పోర్టుల అనుసంధానానికి 8 రహదారులకు ఆమోదం తెలిపింది. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఈ రెండు రహదారులతో కృష్ణపట్నం పోర్టు నుంచి వాహనాలు చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారికి సులువుగా చేరుకోవచ్చు. దాంతో పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు మరింత వేగం పుంజుకుంటాయి. ప్రధానంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇప్పటికే ఎస్పీఆర్ఎస్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఎస్ఈజెడ్లలో తయారీ పరిశ్రమలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పరిశ్రమల నుంచి సరకు రవాణాకు ఈ రహదారులు మరింతగా తోడ్పడతాయి. మరోవైపు కృష్ణపట్నం పోర్టు ద్వారా తూర్పు కర్ణాటక ప్రాంతానికి సరకు రవాణా మరింతగా పెరుగుతుంది. దాంతో రాయలసీమ లాజిస్టిక్ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
CM YS Jagan: బొగ్గు కొరత రానివ్వద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని, థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరతను అధిగమించడానికి సులియారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి పెంచడంతో పాటు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యంతోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి రావడంతో పాటు, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుందని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. డిసెంబర్‌లోగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల టెండర్లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్ కొనుగోలు చేశామని ఇంధన శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ (పీహెచ్‌ఎస్‌పీపీ)పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం అన్ని రకాలుగా ప్రయత్నం.. ► కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండటం వల్ల ఓడల ద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలి. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి. కోల్ స్వాపింగ్ (ఇచ్చిపుచ్చుకోవడం) లాంటి వినూత్న ఆలోచనలు అమలు చేయాలి. ► విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు. డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. మీటర్ల ఏర్పాటుపై రైతులకు లేఖలు ► వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇందు కోసం రైతులకు లేఖలు రాయాలి. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో, దానివల్ల రైతులకు జరిగిన మేలేంటో కూడా వివరించాలి. అక్కడ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియాజేయాలి. ► మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని, విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటుందనే విషయాలపై రైతుల్లో అవగాహన కల్పించాలి. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలి. ► ఈ సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్కాప్ ఎండీ ఎస్ రమణారెడ్డి, డిస్కంల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మా జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్‌లోగా టెండర్లు ► పోలవరం విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ పనులపైనా సీఎం సమీక్షించారు. పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామని అధికారులు తెలిపారు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామన్నారు. ► ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్‌లోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు(పీఎస్పీ)లపై సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. జగనన్న కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ► కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ యూనిట్–3 సెప్టెంబర్ నుంచి, విజయవాడ థర్మల్ ప్లాంట్ ఐదవ స్టేజ్ 2023 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. -
కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు రవాణాకు సహకరిస్తాం
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు లోడింగ్, ప్రధానమైన సరుకులను నిరాటంకంగా రవాణా చేయడానికి రైల్వే శాఖ సహాయ సహకారాలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ (జీఎం) అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. మెస్సర్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్వాహకులతో సరుకు లోడింగ్ అభివృద్ధి అవకాశాలపై రైల్వే జీఎం శనివారం చర్చించారు. పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర ముఖ్యాంశాలను రైల్వే జీఎంకు పోర్టు అధికారులు వివరించారు. పోర్టు వద్ద కోస్టల్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రైల్వే జీఎం అక్కడ మొక్కలను నాటారు. అనంతరం కృష్ణపట్నం స్టేషన్ – విజయవాడ సెక్షన్ మధ్య ప్రత్యేక రైలులో ప్రయాణించి పలు రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. గూడూరు–విజయవాడ సెక్షన్ మధ్య నిర్మాణంలో ఉన్న 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం లేదు రైల్వే అధికారులు టెక్నాలజీని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం లేదని, దానికితోడు క్రమశిక్షణతో కూడిన విధులు లేవని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అసహనం వ్యక్తం చేశారు. జీఎం తన పర్యటనలో భాగంగా ఒంగోలు రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫారంపై ఉన్న ఆహారం, పండ్ల రసం స్టాల్స్‌ను తనిఖీ చేసి అక్కడి విక్రయదారులతో మాట్లాడారు. విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇస్తున్నారా లేదా అని జీఎం అడిగిన ప్రశ్నకు ఓ కూల్‌డ్రింక్ షాపు యజమాని సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టడంతో.. బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేయిస్తుంటే ఏమి చేస్తున్నారని కమర్షియల్ రైల్వే విభాగం అధికారులను జీఎం నిలదీశారు. రైల్వే ఆస్పత్రిలో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడం, రైల్వేస్టేషన్‌లోని ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్‌లోనూ సాంకేతిక సమస్యలు ఉండటం గుర్తించిన జీఎం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సక్రమంగా సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవుతున్నారని, వెంటనే లోపాలను సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే జీఎం పర్యటనలో విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్రమోహన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి
ముత్తుకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఆదాని కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేపట్టారు. ‘ఎంవీ సారోస్ బీ’ అనే నౌక ద్వారా 10,900 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శనివారం చెప్పారు. ఈ మేరకు పోర్టులోని గిడ్డంగిలో సిద్ధం చేసిన బియ్యం బస్తాలను లారీల ద్వారా నౌకలోకి చేరవేస్తున్నారు. ఈ బియ్యం బస్తాలను ఈస్ట్ ఆఫ్రికా దేశంలోని మెడగాస్కర్ పోర్టుకు చేరవేస్తున్నామని చెప్పారు. శనివారం సాయంకాలం బియ్యం ఎగుమతికి మరో నౌక పోర్టులో లంగరు వేసింది. అందులో 13వేల టన్నుల బియ్యంను వెస్ట్ ఆఫ్రికాలోని బెనిన్ పోర్టుకు చేరవేస్తామని తెలిపారు. -
గంగవరం పోర్టులో.. ప్రభుత్వ వాటా ఉపసంహరణపై పిల్
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై దర్యాప్తు జరిపేలా ఏపీ లోకాయుక్తను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రొప్రయిటీ ఆడిట్ కూడా నిర్వహించేలా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన డాక్టర్ వైజా సత్యభూపాల్‌రెడ్డి, బొంత పూర్ణచంద్రారెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాల విక్రయం, కృష్ణపట్నం పోర్టు స్వాధీనం తదితరాల వ్యవహారంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. వాటాల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని, అందుకు సంబంధించిన జీఓలను సైతం అందుబాటులో లేకుండా చేసిందని చెప్పారు. వాటాల ఉపసంహరణకు అంతర్జాతీయ స్థాయిలో బిడ్లు ఆహ్వానించి ఉంటే మరింత ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉండేదన్నారు. లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చాలి ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధిదారులుగా ఉన్న కంపెనీలను ప్రతివాదులుగా చేయలేదన్నారు. వారిని ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగానే వాటాల ఉపసంహరణ జరిగిందని చెప్పారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు. గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
ఆనందయ్య మందుకు ‘ఆయుష్’ అంగీకారం
సాక్షి, అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మందుకు పేరు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఆక్సిజన్ స్థాయిలు పెరిగేందుకు కరోనా రోగుల కంట్లో వేసే ఐ డ్రాప్స్‌కు ఆమోదం తెలిపే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో కొంత పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బొనిగె ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
సముద్రంలో చెన్నై పడవకు అగ్ని ప్రమాదం!
ముత్తుకూరు: చెన్నై హార్బర్ నుంచి గురువారం 10 మంది మత్స్యకారులతో బయలుదేరిన ఓ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు బంగాళాఖాతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డ్స్(ఐఎస్‌జీఎస్) వెంటనే సముద్రంలోకి వెళ్లి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసి, ఆర్పివేశారు. ఐఎస్‌జీఎస్ అధికారుల కథనం ప్రకారం..చెన్నై కాసిమేడుకు చెందిన 10 మంది మత్స్యకారులు మరపడవలో చేపల వేటకు బయలు దేరారు. కృష్ణపట్నం పోర్టుకు సుమారు 12.5 నాటికల్ మైళ్ల దూరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ మరపడవలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు పడవను చుట్టు ముట్టాయి. ఇందులోని మత్స్యకారులంతా నీటిలోకి దూకి, మరో పడవలోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెన్నైలోని ‘మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్’ ద్వారా ఈ ప్రమాద విషయం కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డ్స్ కు చేరింది. ఐఎస్‌జీఎస్ సీ–449 నౌక ద్వారా కోస్టుగార్డులు సముద్రంలోకి వెళ్లి, పడవ నుంచి వెలువడే మంటలను ఆర్పివేశారు. వీరికి సహాయంగా చెన్నై నుంచి ఐఎస్‌జీఎస్ సీ–436 నౌక ప్రమాద స్థలికి చేరింది. అతికష్టంపై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
Krishnapatnam Medicine: ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ
ముత్తుకూరు: ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య చెప్పారు. శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీగోవిందానంద సరస్వతి నేతృత్వంలో ఆనందయ్య శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందు ఉంచి పూజలు చేయించారు. ఆనందయ్య మాట్లాడుతూ..సోమవారం (ఈ నెల 7న) 3 రకాల మందు ఉన్న కిట్‌ను ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. మందు పేరు ‘ఔషధ చక్రం’ తమ గురువుల సహకారంతో 30 ఏళ్లుగా అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నామని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు. మందుకు ఈ పేరునే పరిగణించాలని కోరారు. కాగా, కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు. సోమిరెడ్డి విమర్శలు సరికాదు: ఆనందయ్య నెల్లూరు(సెంట్రల్): కరోనాకు తాను తయారు చేసిన మందుపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ఆయుర్వేద మందు తయారీ నిపుణుడు ఆనందయ్య అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఏదో వెబ్సైట్ అంటూ విమర్శలు చేస్తున్నారని, సోమిరెడ్డి తనను రాజకీయాల్లోకి లాగడం మాని, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని శనివారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. తనను కలవడానికి వచ్చిన కొందరిపై లాఠీ చార్జీ చేశారని సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు. తాను కరోనాకు మందు తయారుచేయడం మొదలుపెట్టి 40 రోజులకు పైగా అయిందని, కొద్ది రోజులపాటు నిలిచిపోయినా.. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో మందు తయారీలో నిమగ్నమయ్యానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా తనకు సహకరించిందన్నారు. అనుమతులు రావడంతో మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేసి, తరువాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేద్దామనే నిబంధన పెట్టుకున్నామని, అంతేతప్ప వెబ్‌సైట్‌కు కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. సోమవారం నాటికి మందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ముత్తుకూరు/నెల్లూరు (సెంట్రల్): కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మందును భారీగా తయారుచేసి 13 జిల్లాలకు పంపి కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. మందు తయారీ, పంపిణీ క్యాంపును కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ కోసం ఒక బ్లాక్ కేటాయించారు. భారీ గ్రైండర్, వంటపాత్రలు, మందు తయారీకి దినుసులను సమకూరుస్తున్నారు. 60 వేలమందికి సరిపడా మందును ఆదివారం రాత్రి తయారు చేసి, 13 జిల్లాలకు సోమవారానికి పంపాలని యోచిస్తున్నారు. అవసరమైతే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి తేనె సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మందుకోసం ఇతర జిల్లాల వారెవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. మందును అవసరమైన వారి చిరునామాకుగానీ, లేదా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారాగానీ అందించేలా చూస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో 4 ప్రాంతాల్లో మందును పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోమవారం నాటికి మందు పంపిణీని ప్రారంభించి రానున్న రోజుల్లో మరింతగా నిల్వలను సిద్ధం చేసి అన్ని జిల్లాలతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా పంపాలని నిర్ణయించారు. మందు తయారీ కోసం సొంత భవన నిర్మాణానికి ఆనందయ్య భూమిపూజ ఆయుర్వేద మందు తయారీకి కావాల్సిన భవన నిర్మాణానికి ఆనందయ్య కృష్ణపట్నంలోని తన స్థలంలో బుధవారం భూమిపూజ చేశారు. భగవాన్ వెంకయ్యస్వామి అనుచరుడైన సైదాపురం మండలం తలుపూరు ఆశ్రమానికి చెందిన నారాయణదాసు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో రోగులకు వైద్యసేవలు అందించడం, సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం కోసం ‘ఆనందయ్య సేవా ట్రస్టు’కూ శ్రీకారం చుట్టారు. దుష్ప్రచారాలొద్దు: నారాయణ ఆనందయ్య మందుపై దుష్ప్రచారం చేయవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం కృష్ణపట్నంలో ఆనందయ్యను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఆనందయ్య ఆయుర్వేద మందును రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. పుత్తూరు ఎముకల కట్లు, హైదరాబాద్‌లో చేపమందు వలే ఆనందయ్య మందు ప్రజల ఆదరణ పొందిందని చెప్పారు. -
పోర్టుకు మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రాక
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/ముత్తుకూరు: విజయవాడ డివిజన్ కృష్ణపట్నం పోర్టుకు మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం చేరుకుంది. రైలు మార్గం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది ఏడోది. ఇది నాలుగు ట్యాంకర్లలో 76 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఒడిశాలోని రూర్కెలాలో బయలుదేరి 22 గంటల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. ఈ ప్రత్యేక రైలు ద్వారా ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు 20 ట్యాంకర్లలో మొత్తం 395 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి దిగుమతి అయ్యింది. డీఆర్ఎం పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రీన్ చానల్ ద్వారా ఈ ఆక్సిజన్ రైళ్ల కదలికలను పర్యవేక్షిస్తూ సకాలంలో గమ్యస్థానానికి చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్ కృష్ణపట్నం పోర్టుకు శుక్రవారం ఒడిశా నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ద్వారా రెండు ట్యాంకర్లలో నింపిన 60.66 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఒడిశాలోని రూర్కెలా నుంచి రాష్ట్రానికి తరలించారు. ఈ రైలు 1,305 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల వ్యవధిలో ప్రయాణించి కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. ఇప్పటివరకు విజయవాడ డివిజన్‌కు వచ్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది నాలుగోది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 275 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి దిగుమతి జరిగింది. ఈ సందర్భంగా డీఆర్ఎమ్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన గడువులోగా ఇవి గమ్యస్థానాలకు చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
ఏపీసెజ్–కృష్ణపట్నం పోర్టు డీల్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: అదానీ కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) మరో 25 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. ఏపీసెజ్‌కు ఇప్పటికే పోర్టులో 75% వాటాలు ఉన్నాయి. మిగతా వాటాల కొనుగోలుతో 100% వాటాలు దక్కించుకున్నట్లవుతుంది. కృష్ణపట్నం పోర్టులో విశ్వసముద్ర హోల్డింగ్స్‌కి ఉన్న 25% వాటాలను రూ. 2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏప్రిల్‌లో ఏపీసెజ్ వెల్లడించింది. -
Andhra Pradesh: 'ఆక్సిజన్' రైలొచ్చింది..
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు శనివారం సాయంత్రం ఆక్సిజన్ రైలు వచ్చింది. దీని ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ఉన్న రెండు ట్యాంకర్లు పోర్టుకు చేరుకొన్నాయి. ఈ ప్రత్యేక రైలుకు అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో అవినాష్‌చంద్ రాయ్, నెల్లూరు జేసీ హరేందిరప్రసాద్, జేసీ (ఆసరా) బాబిరెడ్డి, చిత్తూరు జేసీ మార్కండేయులు, పోర్టు సెక్యూరిటీ జీఎం రాకేష్ కృష్ణన్, స్థానిక తహసీల్దార్ సోమ్లానాయక్‌లు స్వాగతం పలికారు. ఇప్పటికే రైల్లో వచ్చిన ట్యాంకర్ల నుంచి ఆక్సిజన్‌ను స్థానిక ట్యాంకర్లలోకి నింపుకొనే ప్రక్రియ చేపట్టారు. వీటిని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తరలించనున్నారు. -
కృష్ణపట్నం.. అదానీ పరం
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్ సోమవారం స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్ టన్నుల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా రూ.1,840 కోట్ల ఆదాయం, ఎబిట్టా రూ.3,125 కోట్లుగా పేర్కొంది. విస్తరణ దిశగా కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగివున్న కృష్ణపట్నం పోర్టును భారీగా విస్తరించనున్నట్లు ఏపీసెజ్ సీఈవో కరన్ అదాని తెలిపారు. 2025 నాటికి ప్రస్తుత పోర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డీప్‌వాటర్ పోర్టు కావడం, 6,800 ఎకరాలు ఉండటం మాస్టర్ ప్లాన్ ప్రకారం పోర్టు సామర్థ్యం 300 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశాలుగా పేర్కొన్నారు. దక్షిణాంధ్రప్రదేశ్‌కు కృష్ణపట్నం పోర్టును ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇది ఎంతో కీలకంకానుందని చెప్పారు. తూర్పు తీరంపై ప్రత్యేక దృష్టి 2025 నాటికి ఏపీసెజ్ నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్టపల్లి, ఎన్నోర్ పోర్టులను కొనుగోలు చేసిన అదానీ, మన రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్లకు కొనుగోలు చేసింది. అదాని గ్రూపు రాష్ట్రంలోని ఈ రెండు పోర్టులో కొనుగోలు చేయడం కోసం రూ.20,354 కోట్లు వ్యయం చేసింది. రాష్ట్ర ఆదాయంలో మార్పు ఉండదు కృష్ణపట్నం పోర్టులో ఏపీసెజ్ 100 శాతం వాటాను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎటువంటి ప్రభావం చూపదని ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్టు ఆదాయంలో 2.6 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందని, ఇప్పుడు 100 శాతం వాటా తీసుకున్నా అదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీథరన్ ‘సాక్షి’కి తెలిపారు. -
సామాజిక బాధ్యత అభినందనీయం
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సహకారంతో కొవిడ్ క్వారంటైన్ సెంటర్ కమ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చొరవతో కృష్ణపట్నం పోర్టు ట్రస్టు యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సామాజిక బాధ్యతను కలెక్టర్ అభినందించారు. పారిశ్రామిక సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పారిశ్రామిక వాడలో కొవిడ్ బాధితులకు చికిత్స అందించనున్నారు. తొలిదశలో 100 ఐసోలేషన్ బెడ్లు, 20 బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి క్లినిక్ లో బెడ్ల సామర్థం పెంచనున్నారు. వైద్యులు, సిబ్బందిని కూడా కృష్ణపట్నం పోర్టు ట్రస్టు నియమించినట్లు వైద్య ఆర్యోగ శాఖ వెల్లడించింది. -
ఆంధ్రా టు ఆఫ్రికా
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు చేరాల్సిన ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం (పీడీఎస్ బియ్యం) కృష్ణపట్నం పోర్టు ద్వారా ఆఫ్రికాకు భారీ ఎత్తున తరలిస్తున్న గుట్టు రట్టయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. 1,645 టన్నుల బియ్యం కృష్ణపట్నం పోర్టులో అనధికారికంగా నిల్వ ఉంచారంటే.. ఈ స్కామ్‌లో ఎంత పెద్ద నెట్వర్క్ నడిచిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రభుత్వ శాఖలు, పోర్టు సిబ్బంది సైతం కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్స్‌పోర్టర్లకు సంబంధించిన నలుగురు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తే ఆఫ్రికా దేశానికి రవాణా చేసేందుకు తరలిస్తున్నట్లు బయటపడింది. నెల్లూరు (క్రైమ్): కృష్ణపట్నం పోర్టులో సీబార్డ్ గోదాముల్లో భారీ ఎత్తున ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. 1,645 టన్నుల బియ్యం అక్రమ నిల్వలు బయట పడిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో బియ్యం నిల్వ చేయడం వెనుక ప్రభుత్వ శాఖల హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ స్థాయిలో నిల్వ చేయాలంటే సుమారు ఆరు నెలలకు పైగానే సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు బియ్యాన్ని సరఫరా చేసే సప్లయిర్లు నేరుగా ఎక్స్‌పోర్టర్స్‌తో సంబంధాలు పెట్టుకుని ఈ దందా కొనసాగిస్తున్నారని ప్రాథమిక సమాచారం. రేషన్ షాపులకు పంపే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే నేరుగా లారీల్లో రైస్ మిల్లలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యం గోతాలను మార్చి అనువైన బ్రాండ్స్‌తో కొత్తగా ప్యాకింగ్ చేసి లారీల్లో పోర్టులోని గోదాములకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడకు చేరిన లారీలకు వే బిల్లులు, అధికార పూర్వకంగా ఉండాల్సిన పత్రంలో ఏ వివరాలు లేవని తేలింది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ సంబంధిత శాఖల కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం. పోర్టుకు చేరిన అనంతరం అక్కడ జరగాల్సిన తంతు పోర్టు సిబ్బంది చూసుకుంటారు. షిప్మెంట్ జరిగే సమయంలో మాత్రమే సంబంధిత వే బిల్లులు, క్వాలిటీ, ఎన్ని రోజులు నిల్వ ఉంచారన్న అంశాలపై కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అక్రమ నిల్వలు బయట పడ్డాయని అధికారులు వెల్లడించారు. అయితే పోర్టు, సంబంధిత ప్రభు త్వ అధికారుల నడుమ ఒప్పందాలు బహిర్గతం కావడంతో అసలు విషయం బయటకు పొక్కిందని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకుని పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేయాల్సి వచ్చింది. బియ్యం సేకరణ ఇలా.. దాడుల్లో ప్రధానంగా బియ్యం తరలించే నలుగురు సప్లయిర్స్, నలుగురు ఎక్స్‌పోర్టర్లను గుర్తించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉండటం గమనార్హం. సప్లయిర్స్‌లో కర్ణాటకకు చెందిన శ్రీవీరభద్రేశ్వర ఇండస్ట్రీ నుంచి రాధిక బ్రాండ్ పేరుతో 30 టన్నుల బియ్యాన్ని రాజస్థాన్‌కు చెందిన రాధికా ఎంటర్ ప్రైజస్ ఎక్స్పోర్టర్కు సీషల్ లాజిస్టిక్ ద్వారా సరఫరా చేశారు. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పోర్టు సిబ్బంది వరకు భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారకపోతే ఇంత పెద్ద రాకెట్ దందాకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ►గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ నుంచి ఓషన్ బ్రాండ్ పేరుతో 1263.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ–వేబిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్‌లు చెల్లించకుండా చేర్చినట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ఫ్లోర్ మిల్ నుంచి ఈగల్ బ్రాండ్ పేరుతో రెండు దఫాలుగా 63 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ►చెన్నైకు చెందిన శివకేశవ ట్రేడర్స్ నుంచి సలోని బ్రాండ్ పేరుతో 3,900 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన సిస్టర్ కన్సైన్మెంట్ కాకినాడ అండ్ సరలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ నుంచి ఏవీకే లాజిస్టిక్స్‌కు సరఫరా చేశారు. ►విజయవాడకు చెందిన ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ నుంచి సూపర్ టైగర్ బ్రాండ్ పేరుతో 11,225 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన ఎంఓఐ కమోడిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ సీవేస్ షిపింగ్ అండ్ లాజిస్టిక్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేసినట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు. సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్ వివరాల సేకరణ అసలు ఇలాంటి వ్యవహారాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో అనే వివరాలు సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందుకు కస్టమ్స్ అధికారుల నుంచి 2016–17 నుంచి 2019–20 వరకు సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్, ట్రాన్స్పోర్టర్స్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. బయటపడిందిలా.. బియ్యం బ్యాగ్‌లు మార్చి, పేర్లు మార్చి, బిల్లులు లేకుండా పోర్టు గోదాముకు చేరిన బియ్యం అమ్మిన ధరను తెలిపే బిల్లులు అక్రమాల పుట్టను బయట పెట్టాయి. బియ్యం రూ.25, రూ.20 ఇలా తక్కువ ధరలకు కొని విదేశాలకు ఎగుమతి చేయడం ఎలా సాధ్యమవుతుందని తొలుత కస్టమ్స్ అధికారుల్లో రేగిన ఆలోచనలు అసలు విషయాన్ని బయట పెట్టాయి. శ్రీవీరభద్రా ఇండస్ట్రీస్ కేజీ బియ్యం రూ.25కు కొనుగోలు చేసినట్లు, సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్‌మిల్లు కేజీ రూ 21.40లకు కొనుగోలు చేసినట్లు, శివకేశవ ట్రేడర్స్ రూ.25, ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ రూ.20.60 కేజీకి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ వే బిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్ చెల్లించనట్లు అధికారులు గుర్తించారు. ఈ బియ్యం విజయవాడ, కాకినాడ, గుంటూరు, చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 లారీల ద్వారా పోర్టులోని సీబోర్డ్ గోదాముకు తరలినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను విజిలెన్స్ అధికారులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి 6ఏ కింద కేసు నమోదు చేశారు. అదే క్రమంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్.. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీలో (కేపీసీఎల్) 75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కేపీసీఎల్‌ను ప్రమోట్ చేస్తున్న సీవీఆర్ గ్రూప్ నుంచి ఈ వాటాను దక్కించుకుంటోంది. కేపీసీఎల్‌ను రూ.13,572 కోట్లుగా విలువ కట్టారు. డీల్ అనంతరం మిగిలిన 25 శాతం వాటా కేపీసీఎల్ చేతిలోనే ఉంటుంది. మల్టీ కార్గో ఫెసిలిటీ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు ద్వారా 2018–19లో 5.4 కోట్ల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది. దీనిని ఏడేళ్లలో 10 కోట్ల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకు వెళ్లాలని అదానీ పోర్ట్స్ భావిస్తోంది. కృష్ణపట్నం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,394 కోట్ల టర్నోవర్ సాధించింది. తూర్పు తీరంలో అదానీకి ఇది అయిదవది కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిది. కాగా, 2025 నాటికి 40 కోట్ల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా స్థాయికి చేరాలన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లక్ష్యానికి ఈ కొనుగోలు దోహదం చేయనుంది. తాజా డీల్‌తో దేశంలో పోర్టుల వ్యాపారంలో తమ సంస్థ వాటా ప్రస్తుతమున్న 22 నుంచి 27%కి చేరుతుందని అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త విస్తరణలో ఇది తమకు విలువ చేకూరుస్తుందని చెప్పారు. 120 రోజుల్లో ఈ లావాదేవీని పూర్తి చేస్తారు. -
‘నవయుగ’ ఎగనామం!
సాక్షి, నెల్లూరు: పారిశ్రామికాభివృద్ధి పేరుతో కృష్ణపట్నం పోర్టు భూములు దక్కించుకున్న ‘నవయుగ’ సంస్థ స్థానిక పంచాయితీకి రూ.400 కోట్లకు పైగా పన్నులు ఎగ్గొట్టింది! పోర్టు ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఆశతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ ప్రజలు తక్కువ ధరకే నవయుగకు భూములు అప్పగించారు. రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న పోర్టు యాజమాన్యం స్థానిక పంచాయతీకి మాత్రం మొండిచెయ్యి చూపింది. భూమి, భవనాల విలువ రూ.6,610.08 కోట్లు కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగి దాదాపు 11 ఏళ్లు గడుస్తున్నా స్థానిక పంచాయతీకి యాజమాన్యం రూపాయి కూడా పన్ను చెల్లించిన పాపాన పోలేదు. ఏపీ పంచాయతీరాజ్ 1994 చట్టం సెక్షన్ 61 ఐ, ఏ ప్రకారం పంచాయతీ పరిధిలోని వాణిజ్య, నివాస భవనాలకు పన్నులు వసూలు చేసే హక్కు ఉంది. ముత్తుకూరు రెవెన్యూ పరి«ధిలో పోర్టు కోసం సేకరించిన 2,625 ఎకరాల తాజా మార్కెట్ విలువ దాదాపు రూ.6,352 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. టీటీటీ పోర్టు ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ టెర్మినల్స్, స్టోరేజీ, వేర్‌హౌస్ భవన సముదాయాల భవనాలతో కలిపి భూమి విలువను మొత్తం రూ.6,610.08 కోట్లుగా ధ్రువీకరించారు. నామమాత్రంగా కూడా చెల్లించని వైనం.. భూములు, భవనాల మార్కెట్ విలువలో స్థానిక పంచాయతీకి రూపాయి చొప్పున పన్నులు చెల్లించాలి. కానీ అధికారులు మాత్రం నామమాత్రంగా రూ.0.50 చొప్పున నిర్ణయించి లెక్కలు కట్టారు. ఆ ప్రకారం చూసినా రూ.6,610.08 కోట్ల విలువ చేసే కృష్ణపట్నం పోర్టు, భూములకు అర్ధ రూపాయి చొప్పున పన్ను వేసినా పంచాయతీకి దాదాపు రూ.33.05 కోట్లు (నెట్ ట్యాక్స్) చెల్లించాలి. ఆపై ప్రభుత్వ వనరులు ఉపయోగించుకున్నందుకు 8 శాతం లైబ్రరీ సెస్‌కు రూ.2.64 కోట్లు, పది శాతం వాటర్ సెస్‌కు రూ.3.30 కోట్లు, పది శాతం లైటింగ్ సెస్‌కు రూ.3.30 కోట్లు, 20 శాతం డ్రైనేజీ సెస్‌కు రూ.6.61 కోట్లు చొప్పున ఏడాదికి రూ.48.91 కోట్లు ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కొలతలకు అనుమతి నిరాకరణ ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దాదాపు రూ.400 కోట్లకుపైగా పన్నులు బకాయి పడినట్లు అధికారులు తేల్చారు. పలుమార్లు పంచాయతీ ఆడిటింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. పన్నులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్వీకరించలేదు. ఏటా మారుతున్న విలువల ప్రకారం పోర్టు భవనాల కొలతలు తీసుకునేందుకు కూడా సిబ్బందిని అనుమతించకపోవడం గమనార్హం. విజిలెన్స్ ఆరా.. ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం పన్నులు బకాయి పడటంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల ఆరా తీశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. పన్నుల ఎగవేతపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. నోటీసులకు స్పందన లేదు.. కృష్ణపట్నం యాజమాన్యం ముత్తుకూరు పంచాయతీకి పన్నులు బకాయి పడింది. పోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నులు చెల్లించలేదు. పన్నులు చెల్లించాలని గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదు. – సుస్మితారెడ్డి, ఇన్చార్జి డీపీవో, నెల్లూరు పోర్టుకి పన్ను మినహాయింపు లేదు.. కృష్ణపట్నం పోర్టుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పన్ను మినహాయింపు లేదు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – షేక్ అబ్దుల్ షఫీఉల్లా, రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ మైనార్టీ మోర్చా -
దోపిడీలో ‘నవయుగం’
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టుకు 100 కిలోమీటర్లు, చెన్నై పోర్టుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీసిటీ సెజ్ 180కి పైగా దేశ, విదేశీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 36,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు 75 కిలోమీటర్లు, చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నాయుడుపేట సెజ్ 60కి పైగా భారీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 6,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరి ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఐఎల్) ప్రతిపాదించిన ‘మల్టీ ప్రొడక్ట్ సెజ్’ ఎన్ని పెట్టుబడులను ఆకర్షించింది, ఎంతమందికి ఉపాధి కల్పించిందో ఊహించగలరా? ప్రభుత్వం నుంచి 4,731.5 ఎకరాల భూమిని తీసుకొని పదేళ్లు దాటింది. అయినా ఈ సెజ్‌లో ఇప్పటిదాకా పనులే ప్రారంభం కాలేదంటే నమ్మగలరా? సెజ్ పేరిట తీసుకున్న భూములను కేఐపీఎల్ సంస్థ వేరే కంపెనీల పేరిట బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఇప్పటికే తీసుకున్న భూమిలో కనీసం ఒక్క శాతం కూడా వినియోగించుకోలేకపోయినా ఇంకా 6,000 ఎకరాలు కావాలంటూ దరఖాస్తు చేసుకుందంటే ఈ కంపెనీ భూ దాహాన్ని అర్థం చేసుకోవచ్చు. మల్టీ ప్రొడక్ట్ సెజ్ పేరిట నవయుగ గ్రూప్ విచ్చలవిడిగా సాగించిన భూ దందా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) విచారణలో బట్టబయలయ్యింది. ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేటాయింపు సుబ్బారావు పేరిట ఉన్న భూములను అప్పారావు బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని రుణం పొందడానికి వీలవుతుందా? ఒక కంపెనీ పేరిట ఉన్న భూములను వేరే కంపెనీలు తనఖా పెట్టుకొని రుణం తీసుకోగలవా? ఇది సాధ్యమేనని నిరూపించింది నవయుగ గ్రూపు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో మల్టీ ప్రొడక్ట్ సెజ్‌ను ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న భూములను నవయుగ కంపెనీ సొంత అవసరాలకు వినియోగించుకోవడం వివాదాస్పదంగా మారింది. భారీ సెజ్‌ను ఏర్పాటు చేయడానికి నవయుగ గ్రూపు కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2009, 2010లో రెండు విడతలుగా మొత్తం 4,731.5 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భూమిని ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేఐపీఎల్కు ఏపీఐఐసీ విక్రయించింది. ఈ భూములను సెజ్ అభివృద్ధి కోసం వినియోగించకుండా నవయుగ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల పొందినట్లు ఏపీఐఐసీ పరిశీలనలో తేలింది. నవయుగ గ్రూపునకు చెందిన మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, నవయుగ ఇంజనీరింగ్, కాటలిస్ట్ ట్రస్టీషిప్ ఇలా అనేక అనుబంధ కంపెనీల పేరిట ఏకంగా రూ.1,935 కోట్ల రుణాలు తీసుకుంది. భూములను తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే ఏపీఐఐసీ నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎన్వోసీ లేకుండానే పలు బ్యాంకులు నవయుగ సంస్థకు రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చేశాయి. ఒక్క ఐఎఫ్సీఐ మాత్రమే ఎన్ఓసీ కావాలని పట్టుపట్టడం, ఏపీఐఐసీ ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో రూ.250 కోట్ల రుణం ఆగిపోయింది. వేరే కంపెనీ పేరిట ఉన్న భూములను తనఖా పెట్టుకొని బ్యాంకులు ఎన్వోసీ లేకున్నా ఎలా రుణాలు ఇచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన ఏపీఐఐసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రెండేళ్లలోగా ‘సెజ్’ను అందుబాటులోకి తీసుకురావాలి. నాలుగేళ్ల తర్వాత పనులను పరిశీలిస్తే కేవలం 4–5 ఎకరాల పరిధిలో కేవలం మూడు అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఒక పాఠశాల, తాత్కాలిక క్యాంటీన్‌ను మాత్రమే నిర్మించారు. అంటే తీసుకున్న 4,731.15 ఎకరాల్లో ఒక శాతం భూమిని కూడా వినియోగించుకోలేదు. ఒప్పందం కుదుర్చుకున్న 2008 ఆగస్టు 1న ఉన్న కేపీఐఎల్ వాటాదారులు 2013 సెప్టెంబర్ 16 మారిపోయారు. నవయుగ గ్రూపే కేఐపీఎల్‌ను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న విషయం ఫర్పార్మెన్స్ ఆడిటింగ్‌లో బయటపడింది. అంతేకాదు కేఐపీఎల్ పేరిట తీసుకున్న రుణాలను నవయుగ సొంత అవసరాలకు వాడుకున్న విషయం బహిర్గతమైంది. సెజ్ పనులు మొదలు పెట్టకుండానే మరో 6,200 ఎకరాలు కావాలంటూ నవయుగ సంస్థ దరఖాస్తు చేసుకుంది. రద్దును అడ్డుకుంటూ వచ్చిన బాబు నవయుగ సంస్థ సెజ్ పనులను ప్రారంభించకపోవడంతో భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ పలుమార్లు నోటీసులు పంపినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటూ వచ్చారు. ఒకసారి ఫైనాన్స్ విభాగం కొర్రి వేసి పంపితే దానికి ఏపీఐఐసీ సమాధానం ఇచ్చింది. దానితో ఫైల్ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో ఈ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపించారు. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి మరో సందేహం లేవనెత్తి పరిశ్రమల శాఖకు వెనక్కి పంపించారు. ఇలా అప్పటి సీఎం చంద్రబాబు నవయుగకు ఇతోధికంగా సాయం చేశారు. చంద్రబాబు అండతోనే ఈ భూములను నవయుగ సంస్థ తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. సెజ్ నిర్మాణం విషయంలో నిబంధనలు ఉల్లఘించడం, పనులు మొదలు పెట్టకపోవడంపై నోటీసులు జారీ చేసినా కేఐపీఎల్ స్పందించకపోవడంతో 4,731.5 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. -
కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోర్టుల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు గౌతమ్ అదానీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను కైవసం చేసుకుంటున్నట్టు సమాచారం. భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు పోర్టు ఆపరేటర్ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) కృష్ణపట్నం పోర్ట్ కంపెనీలో 72 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకోసం రూ.5,500 కోట్లకు పైగా వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. డీల్ ద్వారా వచ్చిన మొత్తంలో అధిక భాగం అప్పులు చెల్లించేందుకు వినియోగించనున్నారు. కన్స్ట్రక్షన్, పోర్ట్స్, పవర్, స్టీల్, ఐటీ, ఎక్స్‌పోర్ట్స్ రంగాల్లో ఉన్న సీవీఆర్ గ్రూప్‌నకు (నవయుగ) కృష్ణపట్నం పోర్ట్ కంపెనీలో 92 శాతం వాటా ఉంది. తప్పుకోనున్న 3ఐ.. లండన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 3ఐ గ్రూప్ పీఎల్సీ తన అనుబంధ కంపెనీ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 2009 ఫిబ్రవరిలో కృష్ణపట్నం పోర్ట్ కంపెనీలో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. 3ఐ వాటా ప్రస్తుతం 8 శాతానికి వచ్చి చేరింది. అదానీ ఎంట్రీతో 3ఐ తన వాటా విక్రయించి తప్పుకోనుంది. కృష్ణపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నెలకొని ఉంది. 2008లో ఈ పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. పోర్టు అభివృద్ధికి సుమారు రూ.8,000 కోట్లు ఖర్చుచేశారు. నౌకాశ్రయం నుంచి 2018–19లో 5.43 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. 2025 నాటికి 40 కోట్ల టన్నులు.. కృష్ణపట్నం పోర్టు లావాదేవీ పూర్తి అయితే ఏపీఎస్ఈజెడ్కు తూర్పు తీరంలో ఇది మూడవ డీల్ అవుతుంది. ఇప్పటికే కంపెనీ 2014లో ధమ్రా, 2016లో కట్టుపల్లి పోర్టులను దక్కించుకుంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 2025 నాటికి ఏటా 40 కోట్ల టన్నుల సరుకు రవాణా నమోదు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. 2018–19లో 15 శాతం వృద్ధితో 20 కోట్ల టన్నులకుపైగా సరుకు రవాణా చేపట్టింది. పోర్టుల వ్యాపార విస్తరణకు ఏటా రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఏపీఎస్ఈజెడ్ సీఈవో కరణ్ అదానీ ఆగస్టు 7న ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వెల్లడించారు. పోర్టు వ్యాపారం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.8,897 కోట్ల టర్నోవర్‌పై రూ.4,006 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఏపీఎస్ఈజెడ్ ఏపీలోని విశాఖపట్నంతోసహా 10 పోర్టులను నిర్వహిస్తోంది. -
నవయుగ కంటెయినర్ టర్మినల్ సరికొత్త రికార్డు
హైదరాబాద్: నవయుగ కంటెయినర్ టర్మినల్ (ఎన్సీటీ) సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2018–19లో 5,00,000 టీఈయూల (భారీ ఓడల నిర్వహణ సామర్థ్యాన్ని లెక్కించే కొలమానం) హ్యాండ్లింగ్‌ను 2019 మార్చి 27న తొలిసారిగా చేరుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ఎం.వి ఎస్ఎస్ఎల్ కుచ్ వెస్సెల్ ద్వారా దీన్ని సాధించినట్టు తెలిపింది. 2013–14లో 58,577 టీఈయూల సామర్థ్యం నుంచి చూస్తే ఐదేళ్ల కాలంలో 9 రెట్ల వృద్ధిని నమోదు చేసినట్టు పేర్కొంది. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ సీఈవో, డైరెక్టర్ అనిల్ యెండ్లూరి దీనిపై మాట్లాడుతూ... నవయుగ కంటెయినర్ టర్మినల్ భారత తూర్పు తీరంలో రవాణా హబ్‌గా అవతరించేందుకు భారీ ముందగుడు వేసినట్టు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో దీన్నొక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. షిప్పింగ్ లైన్స్‌తో బలమైన భాగస్వామ్యాలు లేకుండా ఈ ప్రగతి సాధ్యమయ్యేది కాదని నవయుగ కంటెయినర్ టర్మినల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి జితేంద్ర నిమ్మగడ్డ అభివర్ణించారు. టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 1.2 మిలియన్ టీఈయూల నుంచి 2019 చివరి నాటికి 2 మిలియన్ల టీఈయూలకు పెంచనున్నట్టు చెప్పారు. -
విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా
కృష్ణాజిల్లా, కావలి: కృష్ణపట్నం పోర్టు మీదుగా విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరుపేట మాఫియాకు చెందిన టర్బో లారీని కావలి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కావలి వన్‌టౌన్ సీఐ ఎం.రోశయ్య, బిట్రగుంట ఎస్సై నాగభూషణం కోల్కత్తా– చెన్నై జాతీయరహదారిపై కావలి రూరల్ మండలం గౌరవం టోల్‌ప్లాజా వద్ద వేకువ జామున 3 గంటల ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చిలకలూరిపేట నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఏపీ27టీటీ 2745 టర్బో లారీలో నకిలీ వే బిల్లులతో అక్రమంగా 27.5 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండడాన్ని గుర్తించి పట్టుకున్నారు. లారీ డ్రైవర్ పాశం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. టోల్గేట్ కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి కావడంతో లారీ, డ్రైవర్‌ను కావలి రూరల్ పోలీసులకు అప్పగించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రేషన్ బియ్యం మాఫియాగా మారిన టీడీపీ చోటా నేతలు పోలీసుల విచారణలో కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మాఫియా వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం కారుసూల గ్రామానికి చెందిన ఐలవరపు నాగేశ్వరరావు, నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సలిసం శ్రీనివాసరావు గ్రామస్థాయి టీడీపీ నాయకులు. వీరిద్దరూ కలిసి రేషన్‌బియ్యం అక్రమ తరలింపు వ్యాపారం సాగిస్తున్నట్లుగా సమాచారం. చిలకలూరిపేట నియోజకవర్గంలోని రేషన్‌షాపుల డీలర్ల నుంచి ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని కిలో రూ.12 వంతున కొనుగోలు చేసి 50కిలోల బస్తాల్లోకి మార్చి రహస్య ప్రదేశంలో డంపింగ్ చేస్తారు. గతంలో బియ్యాన్ని టర్బో లారీలకు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు లోడు చేసి కాకినాడు పోర్టుకు తరలించేవారు. పోర్టుకు బియ్యాన్ని తరలించగానే టీడీపీ చోటా నేతలకు కిలోకు రూ.19 చొప్పున నగదు అందుతుంది. ఈ లెక్కన లోడుకు రూ.4.75 లక్షల నుంచి రూ.5.70 లక్షల వరకు నగదు చేతికందుతున్నట్లు సమాచారం. ఇక పోర్టు నుంచి ఇతర దేశాలకు బియ్యాన్ని తరలించే ముఠా కంటైనర్లలో లోడింగ్ చేసి ఓడల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఇలా నెలకు 40 నుంచి 50 టర్బో లారీల్లో రేషన్‌బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ వే బిల్లులతో టీడీపీ చోట నేతలు నెలకు రూ.2 కోట్లకుపైగానే వ్యాపారం సాగిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల కాకినాడు పోర్టుకు రేషన్ బియ్యం తరలించడం కుదరకపోవడంతో కృష్ణపట్నం పోర్టును కేంద్రంగా చేసుకుని రవాణా సాగిస్తున్నట్లుగా సమాచారం. కాగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట శాసనసభ్యుడే కావడం గమనార్హం. -
స్మగ్లింగ్.. డెడ్చీప్లో మొబైల్ ఫోన్స్
సాక్షి, అమరావతి బ్యూరో : ఆటబొమ్మల పేరుతో చైనా నుంచి మనదేశంలోకి భారీగా డ్రోన్లు, సెల్ఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ బాగోతం బయటపడింది. పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) బృందాలు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... కొన్నేళ్లుగా పెరిగిన చైనా దిగుమతులు.. చైనా నుంచి కృష్ణపట్నం పోర్టుకు కొన్నేళ్లుగా ఆట వస్తువులు భారీగా దిగుమతి అవుతున్నాయి. అయితే పిల్లల ఆట వస్తువుల పేరుతో సెల్ఫోన్లు, కెమెరా కలిగిన డ్రోన్లు అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు హైదరాబాద్‌లోని డీఆర్ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారు ఇచ్చిన సమాచారంతో విజయవాడలోని డీఆర్ఐ ప్రాంతీయ ఆపరేషన్స్ విభాగం అధికారులు ఈనెల 3, 4వ తేదీల్లో కృష్ణపట్నం పోర్టులో తనిఖీలు చేశారు. ఆటవస్తువుల పేరుతో దిగుమతి అయిన కంటైనర్లను తనిఖీ చేయడంతో విషయం బట్టబయలైంది. హైదరాబాద్ తరలించేందుకే? చైనా నుంచి వచ్చిన కంటైనర్లలో భారీ సంఖ్యలో సెల్ఫోన్లు, డ్రోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ కంటైనర్‌లో దాదాపు 5,500 సెల్ఫోన్లు, 5 ఫాంటమ్ 4 డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయి. వీటి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇతర కంటైనర్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. డ్రోన్లు అక్రమంగా దిగుమతి కావడం ఆందోళనకరమైన అంశమని అధికారవర్గాలు చెబుతున్నాయి. డ్రోన్లను కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీలపై డీఆర్ఐ కేంద్ర కార్యాలయానికి నివేదించిన అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా స్మగ్లింగ్ చేసిన వాటిని వారంటీ, గ్యారంటీ లేకుండా తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అధికారులు చెప్పారు. వీటివల్ల దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అక్రమ డ్రోన్లు ఎవరి కోసం? చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న సెల్ఫోన్లు, డ్రోన్లు ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై డీఆర్ఐ వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రోన్ల వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. విచ్ఛిన్నకర శక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు వీటిని వినియోగించే ప్రమాదం ఉండటంతో డ్రోన్ల వాడకంపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించారు. -
సంపాదనే లక్ష్యంగా ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు
-
కృష్ణపట్నం పోర్టులో లాభార్జన కోసమే..
సాక్షి, హైదరాబాద్ : కృష్ణపట్నం పోర్టులో లాభార్జన కోసమే చంద్రబాబు నాయుడు దుగరాజుపట్నం పోర్టును వదులుకున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సంపాదనే లక్ష్యంగా ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కీలక ప్రాజెక్ట్‌ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం లేదని ఆయన అన్నారు. -
గోల్కొండ ఖిల్లా దగ్గర గోల్ఫ్ సందడి
-
తనిఖీలు తప్పనిసరి
ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టులో సరుకుల ఎగుమతి–దిగుమతులకు లంగరు వేసే ప్రతి విదేశీ నౌకలోని సిబ్బంది ఆరోగ్య స్థితిగతులు తనిఖీ చేయాల్సిందే. నౌకల్లోని సిబ్బంది ద్వారా విదేశాల నుంచి వ్యాధులు మన దేశంలోకి ప్రవేశించకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేసే డాక్టర్ అమరేంద్రనాథరెడ్డి ‘హెల్త్ ఆఫీసర్’ హోదాలో గత డిసెంబరు నుంచి ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పోర్టుకు వచ్చే ప్రతి విదేశీ నౌక సిబ్బంది హెల్త్ కార్డులను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా సిబ్బందిలో ‘ఎల్లో ఫీవర్’ లక్షణాలు గుర్తించడమే ఆయన విధుల్లో ముఖ్యమైన అంశం. ప్రతి నౌకలో 19 నుంచి 21 మంది వరకు సిబ్బంది ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థగుర్తించిన వైద్య సంస్థలు అన్ని రకాలుగా పరీక్షించి, విదేశాలకు బయలుదేరే నౌక సిబ్బందికి హెల్త్ కార్డులిస్తుంది. ప్రతి ఒక్కరి హెల్త్ కార్డులో ఎల్లో ఫీవర్ లక్షణాలు లేవనే అంశాన్ని తనిఖీ చేయడమే హెల్త్ ఆఫీసర్ బాధ్యత. సిబ్బంది హెల్త్ కార్డులన్నీ క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆయన క్లీన్ చిట్ ఇవ్వాలి. పోర్టులో విదేశీ నౌక లంగరు వేసినప్పుడల్లా హెల్త్ ఆఫీసర్ రంగంలోకి దిగాలి. ప్రతి నెలా 35 నౌకల తనిఖీ కృష్ణపట్నంపోర్టులో లంగరు వేసే ప్రతి విదేశీ నౌకా సిబ్బంది హెల్త్ కార్డులు తనిఖీ చేస్తాం. ప్రతి నెలా 30 నుంచి 35 విదేశీ నౌకలు తనిఖీ చేస్తుంటాం. ముఖ్యంగా ఎల్లో ఫీవర్ లక్షణాలపై శ్రద్ధ వహిస్తాం. ఇప్పటి వరకు నౌకల్లో ఈ లక్షణాలున్న వ్యక్తులు తారసపడలేదు. స్వదేశీ నౌకల్లో సిబ్బందిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదు. –డాక్టర్ అమరేంద్రనాథరెడ్డి, హెల్త్ ఆఫీసర్ -
దక్షిణాసియాలో అత్యుత్తమం..కృష్ణపట్నం పోర్టు
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ముత్తుకూరు(సర్వేపల్లి): కృష్ణపట్నం పోర్టు దక్షిణాసియాలోనే అన్ని వసతుల కలిగిన అత్యుత్తమ పోర్టుగా రూపుదిద్దుకుంటోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఆయన ఆటోమేటిక్ ఫర్టిలైజర్ హ్యాండ్లింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక ఫర్టిలైజర్ హ్యాండ్లింగ్ సిస్టం ద్వారా ఎరువులకు నీమ్ కోటింగ్ ఇవ్వడంతో పాటు అత్యాధునిక ప్యాకింగ్ కల్పించడ వల్ల నాణ్యత దెబ్బతినదన్నారు. సరుకుల ఎగుమతి–దిగుమతుల్లో సమయ పాలన పాటిస్తున్నారన్నారు. పోర్టులో కస్టమ్స్ క్లియరెన్స్ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ఎండీ చింతా శశిధర్, సీఈఓ అనీల్‌ఎండ్లూరి తదితరులు ఆయనకు పోర్టు ప్రగతిని వివరించారు. -
కృష్ణపట్నం పోర్టు టు సింగపూర్...
కంటైనర్ల రవాణా ప్రారంభం ముత్తుకూరు(సర్వేపల్లి): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంపోర్టు నుంచి సరాసరి సింగపూరుకు కంటైనర్ల రవాణా చేయడం వల్ల ఎంతో ఖర్చు, సమయం ఆదా అవుతుందని కృష్ణపట్నంపోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి పేర్కొన్నారు. పోర్టు నుంచి సింగపూరు, మలేషియా, దక్షిణ కొరియా పాస్ట్ ఈస్ట్, సౌత్ ఈస్ట్‌లకు సరాసరి ప్రయాణించే ‘హుండాయ్ ప్రిస్టేజ్–039’ నౌకను శుక్రవారం పోర్టులో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పోర్టు సీఈఓతో పాటు హెచ్ఎంఎం మేనేజింగ్ వైడీ పార్క్‌తో కలసి ఆయన కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సీఈఓ అనీల్ ఎండ్లూరి మాట్లాడుతూ పోర్టు నుంచి చైనా, మలేసియా, సింగపూరు, సౌత్‌కొరియాలకు నేరుగా సరుకుల రవాణా చేయడం వల్ల ఎగుమతి–దిగుమతుల కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. 4 లక్షల కంటైనర్ల ఎగుమతి–దిగుమతి లక్ష్యం గత సంవత్సరం పోర్టు నుంచి 1.18 కంటైనర్ల ఎగుమతి–దిగుమతులు జరిగాయని సీఈఓ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 2.40 లక్షలకు పెరిగిందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో 4 లక్షల కంటైనర్ల ఎగుమతి–దిగుమతి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కస్టమ్స్ జాయింట్ కమిషనర్ రామ్మోహన్రావు, కేపీసీటీ సీఓఓ జితేంద్ర పాల్గొన్నారు. -
ఏపీ రేవుల రంగంలో పెట్టుబడి అవకాశాలు
• త్వరలో రెండో స్థానంలోకి • కృష్ణపట్నం పోర్ట్ సీఈవో అనిల్ యెండ్లూరి సాక్షి, అమరావతి: తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఓడరేవుల రంగంలో పెట్టుబడులకు అపారఅవకాశాలున్నాయని కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి తెలిపారు. చైనాలో షెన్జెన్ నగరం కేవలం ఓడరేవులతో 300 బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను సృష్టించిందని, అదే విధమైన అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయన్నారు. 974 కి.మీ పొడవైన తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రంలో మొత్తం 14 ఓడరేవులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మంగళవారం విజయవాడలో ’పోర్టులు-లాజిస్టిక్స్’ అనే అంశంపై సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నిర్వహించిన సదస్సులో అనిల్ మాట్లాడుతూ త్వరలోనే రేవుల రంగంలో రాష్ట్రం మహారాష్ట్రను దాటి రెండవ స్థానానికి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 45 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధగమించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.రాష్ట్రంలోని 13 జిల్లాల్లో హైవేలు, రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు, కంటైనర్లు, లాజిస్టిక్స్‌పై మరింత దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం. మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రమంతా కోస్తా తీరం ఉండటంతో వాతావరణ మార్పులు వల్ల జరిగే నష్టాలను అధిగమించే విధంగా మౌలికవసతులు పెంచుకోవాలన్నారు. చెన్నై-వైజాగ్, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడర్లలో భాగంగా రాష్ట్రంలో ఏడు నాడ్సను అభివృద్ధి చేస్తున్నామని ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సి.కుటుంబరావు తెలిపారు. -
సరుకుల రవాణాపై సమీక్ష
ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టు నుంచి దిగుమతి సరుకులు రైలు మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు జరిగే సరుకుల రవాణాపై సమీక్ష ప్రారంభమైంది. రైల్వే జీఎం రవీంద్రగుప్తా పర్యటన అనంతరం రైల్వేవర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం బొగ్గు, ఎరువులు, సున్నపు రాయి, జిప్సం తదితర సరుకులు 2014–15లో పోర్టు నుంచి రైలు మార్గంలో 5,196 రేక్స్ ద్వారా రవాణా జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం 1.90 కోట్ల టన్నుల సరుకులు రవాణా అయ్యాయి. 2015–16లో 3,202 రేక్స్ ద్వారా 1.19 కోట్ల టన్నుల సరుకులు రవాణా జరిగింది. 2016–17లో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 1,585 రేక్స్ ద్వారా సరుకులు రవాణా చేశారు. 57 లక్షల టన్నులు రవాణా జరిగింది. సరుకుల రవాణా క్రమంగా సన్నగిల్లడంపై అటు రైల్వేశాఖ, ఇటు పోర్టు వర్గాలు సమీక్ష చేస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. -
పోర్టులో బొగ్గు దిగుమతి
ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టు ద్వారా మండలంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన బొగ్గు పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా యూకేకి చెందిన ఎంవీ అలికీ పెర్రోటిస్ అనే నౌక ద్వారా 59,310 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది. పనామాకు చెందిన జియోలాండ్ అల్మైర్ నౌక నుంచి 56 వేల టన్నుల బొగ్గు దిగుమతి చేస్తున్నారు. 74,121 టన్నుల బొగ్గు దిగుమతి జరిపేందుకు హాంగ్‌కాంగ్‌కు చెందిన డెక్కన్ ప్రైడ్ నౌక శుక్రవారం లంగరు వేయనుంది. మరో భారీ నౌక కేప్ బ్రాజిల్లా ద్వారా 1.64 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేయనున్నారు. ఈ నౌక శనివారం పోర్టులో లంగరు వేయనుంది. -
హెలికాప్టర్ సమకూర్చిన కృష్ణపట్నం పోర్టు
నెల్లూరు రూరల్ : అవయవదానంలో గుండెను తరలించేందుకు కృష్ణపట్నం పోర్టు ప్రత్యేక హెలికాప్టర్‌ను సమకూర్చింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన సుబ్బారెడ్డి అవయవదానం ఆపరేషన్ నారాయణ హాస్పిటల్లో మంగళవారం నిర్వహించారు. గుండెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ జిల్లా పోలీసు కవాతు మైదానంలో ల్యాండ్ కావాల్సి ఉండగా గ్రౌండ్లో దుమ్ము వల్ల ల్యాండ్ కాకుండా నేరుగా కృష్ణపట్నం పోర్టుకు వెళ్లింది. అక్కడ వరకు గుండెను అంబులెన్స్‌లో తీసుకురావడం కష్టం అవుతుందని నారాయణ మెడికల్ కళాశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగింది. నారాయణ ఆస్పత్రి నుంచి గుండెను అంబులెన్స్‌లో హెలిప్యాడ్ వరకు తీసుకురాగా అక్కడ నుంచి హెలికాప్టర్లో వైద్యులు తీసుకెళ్లారు. అవయవదానానికి తమ వంతు సాయంగా కృష్ణపట్నం పోర్టు సొంత హెలికాప్టర్‌ను పంపించినట్లు పోర్టు పీఆర్ హెడ్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ విజయకుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మీడియా మేనేజర్ శీనయ్య పాల్గొన్నారు. -
కృష్ణపట్నంపోర్టులో మూడంచెల భద్రత
సందర్శకుల ప్రవేశంపై నిషేధం ముత్తుకూరు : పీఓకేలోని పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంపోర్టులో మూడంచెల భద్రత అమలు చేస్తున్నట్టు పోర్టు సీనియర్ జనరల్ మేనేజర్ టీ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా ఇండియన్ కోస్టుగార్డు, మెరైన్ పోలీసు, పోర్టు సెక్యూరిటీ గార్డుల ఆధ్వర్యంలో తీరప్రాంత గస్తీ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పాక్ ఉగ్రమూకలను అంతం చేసిన సందర్భంగా దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలు, కీలక ప్రదేశాల్లో హై అలెర్ట్ ప్రకటించారని తెలిపారు. ఈ కారణంగా పోర్టులో సందర్శకుల పర్యటనను తాత్కాలికంగా నిషేధించామన్నారు. వివిధ పనులపై వచ్చే వారు గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోవాలన్నారు. పోర్టు పరిసర గ్రామాల ప్రజలు, తీరప్రాంత వాసులు తమకు సహకరించాలని సెక్యూరిటీ ఏజీఎం మనోహరబాబు విజ్ఞప్తి చేశారు. -
2 వేల కోట్ల ఆదాయం సాధిస్తాం
♦ కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి ♦ రూ.300 కోట్లతో ఎల్ఎన్జీ టెర్మినల్ ♦ బంకరింగ్తో ఓడలకు నేరుగా ఇంధనం నింపొచ్చు ♦ కొత్త పోర్టులు వచ్చినా మా బిజినెస్‌కు ఢోకా ఉండదు సాక్షి, అమరావతి : ప్రైవేటు రంగ కృష్ణపట్నం పోర్టు వేగంగా విస్తరిస్తోంది. బల్క్ కార్గోతో పాటు కంటైనర్ కార్గోలోనూ తనదైన ముద్ర వేస్తోంది. భారీ విస్తరణ ప్రణాళికల అమల్లో ఉన్న ఈ పోర్టు... తక్కువ వ్యయంతోనే ఎగుమతి, దిగుమతులకు అవకాశం కల్పించటంపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పోర్టు సీఈఓ అనిల్ యెండ్లూరి... సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా పోర్టులు వచ్చినా ఇబ్బంది లేదంటున్న అనిల్‌తో ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... రాష్ట్రంలో కొత్తగా మరో రెండు పోర్టులొస్తున్నాయి. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటారు? రాష్ట్రంలో పోర్టు వ్యాపారానికి అపారమైన అవకాశాలున్నాయి. ముఖ్యంగా కంటైనర్ కార్గో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చే పోర్టుల ప్రభావం మాపై ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ వాటన్నిటికంటే ముందుగా పోర్టులతో పాటు దానికి తగ్గట్టు రోడ్లు, రైల్వే, విమానాలతో కలిసిన ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అభివృద్ధి కావాలి. తూర్పు తీర ప్రాంతానికి మన రాష్ట్రం ముఖ ద్వారంగా ఉంది. దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల నుంచి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. పోర్టులే కాకుండా వాటి పక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలి. కంటైనర్ కార్గోలో ఇండియా ఎందుకు పోటీ పడలేకపోతోంది? విదేశీ ఎగుమతుల విషయంలో కంటైనర్ కార్గో ద్వారా తక్కువ ధరతో పోటీ పడొచ్చు. కానీ ఈ రంగంలో మనం పూర్తిగా వెనుకబడి ఉన్నాం. సింగపూర్ అనే చిన్న దేశంలోని పోర్టు ఏటా 30 మిలియన్ టీఈయూ కార్గోని హ్యాండిల్ చేస్తుంటే మన దేశంలోని అన్ని పోర్టులు కలిసి 9 ఎంటీఈయూ మించి చేయడం లేదు. చివరికి కొలంబో కంటే మన దేశం వెనకబడిపోయింది. దీనిక్కారణం సరైన లాజిస్టిక్స్ లేకపోవడమే. గతంలో ఢాకా నుంచి మన దేశానికి ఏదైనా కంటైనర్ రావాలంటే 30 రోజులు పట్టేది. లక్ష రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు నేరుగాా ఢాకాకి కంటైనర్ కార్గో అందుబాటులోకి రావడంతో రూ.40,000 వ్యయంతో ఏడు రోజుల్లోనే కంటైనర్ పంపే వెసులుబాటు కలుగుతోంది. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. అందుకే కంటైనర్ కార్గోని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు ఎగుమతి దిగుమతులపై కనిపిస్తున్నాయా? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లావాదేవీల్లో వృద్ధి కనిపిస్తోంది. 2015-16లో మొత్తం 35.06 ఎంఎంటీల బల్క్ కార్గోను హ్యాండిల్ చేయగా ఈ ఏడాది 40 ఎంఎంటీలు దాటుతుందని అంచనా వేస్తున్నాం. కంటైనర్ కార్గోలోనూ మంచి వృది ్ధకనిపిస్తోంది. ఆదాయం విషయానికొస్తే ఈ ఏడాది రూ. 2,000 కోట్ల మార్కును చేరుకుటాం. గతేడాది ఆదాయం రూ. 1,800 కోట్లుగా ఉంది. పోర్టు విస్తరణ ఎంతవరకూ వచ్చింది? రెండో దశ విస్తరణ పనులు జరుగుతున్నాయి. మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడి అంచనాతో 2007లో పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు రూ. 8,000 కోట్లు వెచ్చించాం. రూ. 300 కోట్ల పెట్టుబడితో రెండు ప్రత్యేక లిక్విడ్ కార్గో బెర్తులను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఒక బెర్తు ఎల్ఎన్జీ/ఎల్పీజీ కోసం కాగా మరొకటి కెమికల్ షిప్స్ కోసం. సింగపూర్ మాదిరి నేరుగా ఓడలకు ఇంథనం నింపే బంకరింగ్ సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇవికాక 200 ఎంపీటీఏ సామర్థ్యంతో 42 బెర్తులు, 600 ఎకరాల్లో ప్రత్యేక కంటైనర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. తూర్పు తీరంలో కీలకమైన పోర్టుగా కృష్ణపట్నాన్ని తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. -
కృష్ణపట్నం పోర్టులో పచ్చదనం భేష్
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ముత్తుకూరు: పర్యావరణానికి మారుపేరుగా కృష్ణపట్నంపోర్టు పచ్చదనంతో పరిఢవిల్లుతోందని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సెంట్రల్ అటమిక్ ఎనర్జీ–స్సేస్ మినిస్టర్ జితేంద్రసింగ్ పేర్కొన్నారు. కృష్ణపట్నంపోర్టును ఆదివారం కేంద్రమంత్రి సందర్శించారు. పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎగుమతి–దిగుమతి కార్యకలాపాలను పరిశీలించారు. జరుగుతున్న ప్రగతిని పోర్టు అధినేత చింతా శశిధర్, సీఈఓ అనీల్ ఎండ్లూరి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలో త్వరతగతిన అభివృద్ధి చెందుతున్న ఓడరేవుల్లో కృష్ణపట్నంపోర్టు ఒకటిగా నిలిచిందన్నారు. కాలుష్య నివారణకు,పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛభారత్ అమలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఎగుమతి, దిగుమతుల్లో పురోగతి ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించడం సంతోషంగా ఉందన్నారు. వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం పోర్టులో కల్పించారన్నారు. అనంతరం గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించారు. సెక్యూరిటీ గార్డుల గౌరవవందనం స్వీకరించారు. వనం–మనం కింద మొక్కలు నాటారు. సీవీఆర్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆస్పత్రి, వంటశాల, మొక్కల పెంపకం, స్కిల్ డెవలప్మెంట్ తరగతులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పోర్టు అభివృద్ధిపై రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, పీఆర్వో వేణుగోపాల్ పాల్గొన్నారు. -
కృష్ణపట్నం టూ చైనా:14 రోజులే
తొలి నౌకాయానం ప్రారంభం ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టు నుంచి చైనాకు కేవలం 14 రోజుల్లో కంటైనర్ల నౌక ద్వారా సరుకుల రవాణా జరుగుతుందని పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి వెల్లడించారు. ప్రతి వారం చైనాకు సరుకుల కంటైనర్ల రవాణా చేసే తొలి నౌక ‘ఎంవీ మాస్క్ కైరెనియా’ను సోమవారం పోర్టులో మెర్స్క్‌లైన్ ఇండియా ఎండీ ఫ్రాంక్ డెడెనిస్, పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తూర్పు, ఈశాన్య దేశాలైన కొరియా, సింగపూర్, మలేసియా, చైనాకు ఇక నుంచి ప్రతి వారం కంటైనర్ల నౌక ప్రయాణిస్తుందని వెల్లడించారు. ఈ నౌకా యానం వల్ల ఖర్చు తగ్గుతుందని, వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. కాంకర్ రైలు సర్వీసు ప్రారంభం బెంగళూరు, హైదరాబాద్ నుంచి వారానికి రెండు సార్లు కంటైనర్లు రవాణా చేసే రైలును కూడా మాస్క్ ౖలైన్ ఇండియా ఎండీ ఫ్రాంక్ డెడెనిస్, పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి ప్రారంభించారు. కాంకర్ సంస్థ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతంగా ఈ రవాణా జరుగుతుందని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ధనుంజయులు వెల్లడించారు. -
ఐడీబీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం
నెల్లూరు : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని ఐడీబీఐ బ్యాంక్ శాఖలో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భద్రత సిబ్బంది అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, ఫైళ్లు కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'కృష్టపట్నం భూములు కొట్టేసేందుకు కుట్ర'
నెల్లూరు : టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ కేవలం ప్రచార ఆర్భాటమే అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట అధ్యక్షుడు కాకాని గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. వాస్తవానికి రైతులకు రుణమాఫీ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నం ఎరువుల ఫ్యాక్టరీ కోసం చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గ్యాస్ లేకుండా పరిశ్రమ ఎలా వస్తుందో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. కృష్ణపట్నం భూములను కొట్టేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
పరిహారం దోపిడీకి కుట్ర
► రామదాసుకండ్రిగలో రూ.16 కోట్ల భూమికి ఎసరు ► దళారులే సూత్రధారులు అధికారపార్టీ నాయకుల అండ అవి కృష్ణపట్నం పోర్టు రహదారి పక్కన రూ. కోట్లు విలువ చేసే భూములు. సాగుకు యోగ్యంగా లేక పోవడంతో ఏళ్ల తరబడి నుంచి బీళ్లుగానే ఉన్నాయి. ఆ భూములను ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కు కేటాయించను న్నారని ముందే పసిగట్టారు కొందరు పెద్దలు. దళారులను రంగంలోకి దించి అధికారపార్టీ నాయకుల అండతో పేదల పేరుతో ఉన్న ఆ భూములను తక్కువ ధరకు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. ఒప్పుకోని రైతులను బెదిరించి మరీ సంతకాలు చేయించుకున్నారు. సుమారు రూ.16 కోట్లు పేదలకు దక్కాల్సిన పరిహారాన్ని దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఇందులో అధికారులూ వాటాదారులనే ఆరోపణలున్నాయి. వెంకటాచలం: వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 2194, 2195, 2196, 2200, 2201లోని 122ఎకరాల సీలింగ్ భూములను ఆ గ్రామంలోని పేదలను గుర్తించి 1976లో ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూముల్లో కొందరు అప్పట్లో మెట్ట పంటలు పండించారు. 15 ఏళ్ల నుంచి ఆ భూముల్లో మొక్కలు మొలచి బీళ్లుగా మారాయి. కృష్ణపట్నం పోర్టు రహదారి నిర్మాణానంతరం ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. పలువురు పారిశ్రామికవేత్తలు ఆ భూములను చేజిక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. జిల్లా అధికారులు ఎన్జీవోలకు ఆ భూములను ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారమే అండగా కొన్ని నెలల క్రితం నుంచి ఈ భూములపై అధికారపార్టీ ప్రముఖులతో సంబంధాలుండే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. ఈ భూములు ఏపీఐఐసీకు కేటాయించనున్నారనే విషయాన్ని పసిగట్టి ఎలాగైనా పేదల నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేయాలనుకున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులను దళారులుగా మార్చారు. రామదాసుకండ్రిగ సీలింగ్ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని దళారులు కొన్ని నెలల క్రితం గ్రామంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రభుత్వం భూములు తీసుకుంటే ఏమీ రాదని, కొందరు ఎకరా రూ.6 లక్షల లెక్కన కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని అమ్ముకుంటే మంచిదని రైతులను మాయ చేశారు. దళారుల మాయమాటలు నమ్మిన రైతులు తమ పొలాలను ఎకరా రూ.6 లక్షల వంతున అమ్మేందుకు సమ్మతించారు. ఇందుకు ఒప్పుకోని కొందరిపై దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై వెంకటాచలం పోలీస్స్టేషన్లోనూ బాధితులు ఫిర్యాదుచేసి ఉన్నారు. ఆరు నెలల క్రితం ఒక్కో రైతుకు అడ్వాన్స్‌గా రూ.30 వేలు ఇచ్చి గూడూరులోని ఐడీబీఐ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేయించారు. ఒక్కో రైతు నుంచి ఆ నగదులో దళారులు రూ.5వేలు వసూలు చేశారు. రైతుల ఆగ్రహం రెవెన్యూ అధికారులు ఇటీవల గ్రామసభ నిర్వహించి రైతులకు ఇచ్చిన సీలింగ్ భూములు ఏపీఐఐసీకు కేటాయిస్తామని తెలియజేశారు. భూములకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు చూపితే పరిహారం వస్తుందని అధికారులు తెలపడంతో దళారుల దోపిడీ బయట పడింది. ప్రస్తుతం సీలింగ్ భూముల్లో కృష్ణపట్నంపోర్టు రోడ్డు, నివాస స్థలాలు ఏర్పాటుకు పోను సుమారు 100ఎకరాలు మిగిలి ఉంది. పేదలకు చెందాల్సిన రూ.కోట్ల పరిహారాన్ని దళారులు మాయచేసి వ్యాపార వేత్తలకు దక్కేలా చేస్తున్నారు. ఇందులో కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎకరాకు ఏపీఐఐసీ ద్వారా రూ.14 లక్షల నుంచి రూ.16లక్షలు పరిహారం వస్తుందని ప్రచారం ఉంది. దీంతో దళారులు తమను మోసం చేసి అగ్రిమెంట్లు రాయించుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం లబ్ధిదారులకు చెందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
'పోర్టు రాకుండా అధికార పార్టీ కుట్రలు'
నెల్లూరు: దుగ్గరాజుపట్నం పోర్టు రాకుండా అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని ఎంపీ వరప్రసాదరావు విమర్శించారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని అన్నారు. శనివారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. కృష్ణపట్నం యాజమాన్యం తాయిలాలకు తలొగ్గి గూడురు ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణ పోర్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపినా లాభదాయకం కాదని నివేదిక ఇవ్వడం సరికాదని ఎంపీ వరప్రసాద రావు వాపోయారు. -
కృష్ణపట్నం పోర్టు నుంచి కొత్త రైలు సర్వీసులు
ఐసీడీ బెంగళూరుకు వారానికి 2 సర్వీసులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంటెయినర్ కార్పొరేషన్‌తో (కాన్కార్) కలసి కృష్ణపట్నం పోర్టు కంపెనీ (కేపీసీఎల్) కొత్త రైలు సర్వీసులు ప్రారంభించింది. కృష్ణపట్నం పోర్టు నుంచి ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) బెంగళూరు మధ్య వారానికి రెండుసార్లు ఈ సర్వీసులుంటాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఎగుమతి, దిగుమతిదారులకు సురక్షితమైన ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు కేపీసీఎల్ సీఈవో అనిల్ యెండ్లూరి తెలిపారు. దీనివల్ల సరుకు రవాణా సమయం 48 గంటలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో బరువుపరమైన నియంత్రణ సమస్యలు ఎదుర్కొనే భారీ కార్గోల రవాణాకు ఈ సర్వీసులు తోడ్పడగలవని అనిల్ చెప్పారు. ఎగుమతులకు ఉద్దేశించిన వస్తూత్పత్తులు బెంగళూరు నుంచి ప్రతి మంగళ, శుక్రవారం ఈ రైలు సర్వీస్ ద్వారా పోర్టుకు చేరతాయి. అలాగే దిగుమతైనవి ప్రతి బుధ, శనివారం పోర్టు నుంచి బయలుదేరి ఐసీడీ బెంగళూరుకు చేరతాయి. -
కృష్ణపట్నం పోర్టుకు మరో వెయ్యి ఎకరాలు
సవరించిన మాస్టర్‌ప్లాన్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం సాక్షి, హైదరాబాద్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు మరో వెయ్యి ఎకరాలు కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కేపీసీఎల్) సమర్పించిన మాస్టర్‌ప్లాన్‌కు సర్కారు ఆమోదముద్ర వేసింది. గతంలో కేపీసీఎల్ 5,800 ఎకరాల్లో పోర్టు అభివృద్ధి పనులకు సమర్పించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించింది. అయితే కేపీసీఎల్ తాజాగా 6,800 ఎకరాల్లో అభివృద్ధికి సవరించిన మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించింది. ఇందులో వెయ్యి ఎకరాల నీటి వనరులు ఉన్నాయని పేర్కొంది. లైట్ హౌస్‌ను మరోచోటకు మార్పు చేయడం, జెట్టీ విస్తరణ తదితరాలు సవరించిన మాస్టర్‌ప్లాన్‌లో ఉన్నాయి. దీన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. -
కృష్ణపట్నం పోర్టుతో మెర్క్ లైన్ ఇండియా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒమన్‌లోని సలాలా నుంచి కొత్తగా సేవలు ప్రారంభించేం దుకు మెర్క్ లైన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కృష్ణపట్నం పోర్టు (కేపీసీఎల్) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి వీక్లీ సర్వీసులు ప్రారంభమవుతాయని కేపీసీఎల్ ఎండీ చింతా శశిధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల కస్టమర్లను నేరుగా ఒమన్ ప్రాంత కస్టమర్లకు అనుసంధానించేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. -
కంటైనర్ల కొద్దీ విదేశీ సిగరెట్లు
♦ కృష్ణపట్నం పోర్టులో మరో రెండు కంటైనర్లను తెరిచిన అధికారులు ♦ రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మొటిక్స్ లభ్యం ♦ ఇద్దరు స్మగ్లర్లను కోర్టులో హాజరుపర్చిన డీఆర్ఐ విభాగం సాక్షి, ముత్తుకూరు/విజయవాడ బ్యూరో: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మరో రెండు కంటైనర్లలో రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మెటిక్స్ బయటపడినట్లు తెలిసింది. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఓ కంటైనర్‌లో రహస్యంగా తరలిస్తున్న వివిధ బ్రాండ్ల సిగరెట్లను డైరె క్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 12 రోజుల క్రితం పట్టుకున్న విషయం తెలిసిందే. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి గత నెల 29న కృష్ణపట్నం పోర్టుకు వచ్చిన నౌకలో ఈ కంటైనర్‌ను గుర్తించారు. అందులో తనిఖీ చేయగా రూ.9 కోట్ల విలువైన 71.40 లక్షల ఫిల్టర్ సిగరెట్లు బయటపడ్డాయి. సిగరెట్లు, కాస్మెటిక్స్ స్మిగ్లింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను డైరె క్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు చెన్నైలో అదుపులోకి తీసుకొన్నారు. ఆది, సోమవారాల్లో పోర్టులో మళ్లీ విచారించారు. యూఏఈ నుంచి వచ్చిన వాటిలో మరో రెండు కంటైనర్లను 1వ నంబర్ బెర్తు వద్ద తెరచి, తనిఖీలు చేశారు. ఈ రెండు కంటైనర్లలో రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మొటిక్స్ లభించినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఇద్దరు స్మగ్లర్లను డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) విభాగం అధికారులు హైదరాబాద్‌లోని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిసింది. యథేచ్ఛగా విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా *కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా విదేశాల నుంచి అక్రమంగా సిగరెట్ల దిగుమతి పెరిగిపోతోంది. *యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, చైనా దేశాల నుంచి 20 కంపెనీలకు చెందిన విదేశీ సిగరెట్లు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి. * దూది పరుపులు, బెడ్షీట్లు, కాటన్ ఉత్పత్తుల పేరిట విదేశాల్లో షిప్పింగ్ బిల్ తయారుచేసి సిగరెట్లను ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు సంబంధించిన పత్రాల్లో పూర్తిగా అవాస్తవాలను పొందుపరిచే స్మగ్లర్లు పరుపులు, బెడ్షీట్ల కింద సిగరెట్ కార్టన్లు(అట్టపెట్టెలు) పెడుతున్నారు. *ఇప్పటివరకూ రాష్ట్రానికి దిగుమతి అయిన విదేశీ సిగరెట్లలో బ్లాక్, రోతమ్స్, డన్హిల్స్ వంటి పదిపైగా బ్రాండ్లు ఉన్నాయి. వీటిపై తయారీ తేదీలు, చట్టబద్ధ హెచ్చరికలు ఉండవు. * విదేశీ సిగరెట్ బాక్సుపై సిగరెట్ తయారీలో వాడిన ముడిసరుకు వివరాలేవీ ఉండవు. * చెన్నైలో కస్టమ్స్ తనిఖీలు ముమ్మరమైన నేపథ్యంలో సమీపంలోని కృష్ణపట్నం పోర్టును వ్యాపారులు ఎంపిక చేసుకున్నారు. * విదేశీ సిగరెట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించే వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు నిఘాపెట్టారు. * 2015 సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కాలంలో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు. * డిసెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసి రూ.25 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. * సుంకం చెల్లించకుండా దిగుమతి అవుతున్న విదేశీ సిగరెట్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్ తెలిపారు. -
రూ.1,400 కోట్లతో న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్
► కృష్ణపట్నంపోర్టులో ప్రత్యేక బెర్తు ఏర్పాటు ► 2017లో పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా ముత్తుకూరు/చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా భారీ సహజ వాయువుల పైపులైను ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ సంస్థ రూ. 1,400 కోట్ల అంచనాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టులో ఎల్ఎన్జీ(లిక్విడ్ నాచురల్ గ్యాస్) బెర్తు నిర్మిస్తారు. ఇక్కడ నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకే కాకుండా ఇఫ్కో, శ్రీసిటీ, మేనకూరు సెజ్‌లు, తొట్టంబేడు, ఏర్పేడు, మాంబట్టు, గుమ్మడిపూడి, మనాలి పారిశ్రామికవాడలకు గ్యాస్ సరఫరా చేస్తారు. 2017లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నూరు, నెల్లూరు, కృష్ణపట్నం, సుళ్లూరుపేట, రేణిగుంట వరకు పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు. తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు ట్రక్కుల ద్వారా గ్యాస్ రవాణా జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో, జపాన్, చైనా పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. రివర్‌బే గ్రూపు, కేఈఐ గ్రూపులు ఈ ఎల్ఎన్జీ భారత్ టెర్మినల్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్యాస్ కొరతను తీరుస్తాం: మూర్తి కృష్ణపట్నం పోర్టులో తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో 5 ఎమ్ఎమ్టీపీఏ సామర్థ్యం ఉన్న ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ స్టోరేజి యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ ఎండీ మూర్తి మంగళవారం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా విద్యుత్, ఎరువుల పరిశ్రమలకు గ్యాస్‌ను అందించే వీలుంటుందన్నారు. భారతదేశ గ్యాస్ మార్కెట్లో సుమారు 45 ఎంఎంఎస్సీ ఎండీ కొరత ఉందని, డిమాండ్‌కు తగ్గట్టుగా అందించడానికి కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఎన్ఎన్జీ స్టోరేజీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారుగా 1.30 లక్షల ఎల్‌త్రీ ఎల్ఎన్జీని నిల్వచేసే ఒక ఎఫ్‌ఎస్‌యూ(నిల్వలతో తేలియాడే యూనిట్ షిప్)ను కృష్ణపట్నంలోని ప్రత్యేక జట్టీతో కలిపి ఉంచుతామన్నారు. దీనివలన చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కాలుష్యం ఉండదని తెలిపారు. -
మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ
ముత్తుకూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : కృష్ణపట్నం పోర్టు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కితాబునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడారు. అనంతరం సీవీఆర్ జ్యోతి పథకం కింద మొత్తం 660 మంది మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పోర్టు సీఈవో అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక బాధ్యతలో కృష్ణపట్నం పోర్టు
ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాల దత్తత ముత్తుకూరు : ఆసియాలోనే అతిపెద్ద ఓడరేవుగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు (కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్బిలిటి) సామాజిక బాధ్యత కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవల పెద్ద పీట వేసింది. మండలంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ పోర్టు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అంది పుచ్చుకొంటూ 42 బెర్తుల నిర్మాణ లక్ష్యంతో అడుగులు వేస్తోంది. 2007లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, దివంగత సీఎం డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన నాటి నుంచి అభివృద్ధి-పర్యావరణం-సామాజిక బాధ్యతలే ఊపిరిగా ప్రభావిత గ్రామాలతో పెనవేసుకుపోయింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా పోర్టుకు ‘భారత పరిశ్రమల సమాఖ్య’ దక్ష ణాది రీజియన్ తాజాగా ‘3 స్టార్’ రేటింగ్‌ను ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేసినందుకు 130 పరిశ్రమలతో పోటీపడి ఈ అవార్డు దక్కించుకొంది. 2020 నాటికి కాలుష్య రహిత పోర్టుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యాలను రూపొందించుకొంది. ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాలను దత్తత తీసుకొని రూ.లక్షలు వెచ్చించి సిమెంటు రోడ్ల నిర్మించారు. సీవీఆర్ ట్రస్టు తరపున మత్స్యకార గ్రామాల్లో ఆర్వో ప్లాంటు ఏర్పాటు ద్వారా ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నారు. పోర్టు పరిసరాల్లో ఖాళీ ఉన్న చోటే కాకుండా, రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంపకం చేపట్టారు. పునరావాస కాలనీలోని మత్స్యకార కుటుంబాల పిల్లలను విద్యావంతుల్ని చేసేందుకు అన్ని సౌకర్యాలతో ఇంగ్లీషు మీడియం స్కూల్ ఏర్పాటుచేశారు. భక్తి భావం నింపేందుకు ఆలయాలు నిర్మించారు. ఉచిత వైద్య శాల ఏర్పాటు ద్వారా వైద్య నిపుణులతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందచేస్తున్నారు. అంబులెన్సులు సైతం అందుబాటులో ఉంచారు. అగ్నిప్రమాదాలు సంభవిస్తే తక్షణం మంటలు అదుపు చేసేందుకు ఫైరింజన్లు సమకూర్చారు. వృథా నీటి వనరులతో గ్రీన్ బెల్టు అభివృద్ధి చేసే ప్రక్రియకు నడుంకట్టారు. మడ అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. ప్రమాదాలు అదుపు చేయడంలో భాగంగా రవాణా వ్యవస్థలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక యంత్రాల ద్వారా దుమ్ము వ్యాపించకుండా రోడ్లను శుభ్ర పరిచే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. -
కృష్ణపట్నం పోర్టుకు సీఐఐ అవార్డు!
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు ‘భారత పరిశ్రమల సమాఖ్య’(సీఐఐ) ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా పోర్టుకు భారత పరిశ్రమల సమాఖ్య దక్ష ణాది రీజియన్ ‘3 స్టార్’ రేటింగ్‌ను బహూకరించి, అవార్డు ప్రదానం చేసింది. చెన్నైలో ఇటీవల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ భద్రత అవార్డు అందజేశారు. 130 పరిశ్రమలతో పోటీపడినప్పటికీ చివరికి ఈ అవార్డు తమకే దక్కిందని పోర్టు ప్రతినిధులు మంగళవారం వెల్లడించారు. 2020 నాటికి కాలుష్యరహిత పోర్టుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కృష్ణపట్నం పోర్టు భేష్!
జపాన్ పారిశ్రామిక బృందం ముత్తుకూరు/తడ: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలంగా ఉందని జపాన్ పారిశ్రామిక బృందం ప్రశంసించింది. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు పర్యటనకు వచ్చిన జపాన్‌లోని ప్రముఖ పరిశ్రమలకు చెందిన 50 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం పోర్టులో పర్యటించింది. ఈ బృందంలో హిటాచి, మిత్సుబిషి, టయోటా తదితర సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి వీరికి ఘనస్వాగతం పలికారు. కండలేరు క్రీక్‌కు ఇరువైపులా పోర్టులో జరుగుతున్న బెర్తుల నిర్మాణం, ఎగుమతులు-దిగుమతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ప్రస్తుతం తీరప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టుల వివరాలను తెలిపారు. అనంతరం జపాన్ పారిశ్రామిక బృంద సభ్యులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు, పరికరాలు, ముడిసరుకులు దిగుమతి చేసుకొనేందుకు కృష్ణపట్నం పోర్టు అనుకూలంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు అనువైన సముద్రతీర ప్రాంతం ఉందని పేర్కొన్నారు. శ్రీసిటీలో అమెరికా బృందం పర్యటన అమెరికాకు చెందిన వాణిజ్య దూత కార్యాలయ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం తడ సమీపంలోని శ్రీసిటీని సందర్శించింది. ముఖ్య వాణిజ్య అధికారి జాన్ ఫ్లెమింగ్ నేతృత్వంలో వచ్చిన బృందానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికి శ్రీసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు చేపట్టిన మౌలిక వసతుల గురించి వివరించారు. ఇప్పటికే శ్రీసిటీలో 9 అమెరికా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన అన్ని వసతులనూ ఇక్కడ నెలకొల్పినందుకు జాన్ ఫ్లెమింగ్ శ్రీసిటీ యాజమానాన్ని అభినందించారు. ఈ బృందంలో రాజకీయ, ఆర్థిక వ్యవహారాల అధికారి కల్పనమూర్తి, ఆర్థిక నిపుణులు జార్జి మ్యాథ్యూస్ తదితరులు ఉన్నారు. జపాన్ బృందం కూడా... జపాన్ దేశానికి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు కూడా శుక్రవారం తడ సమీపంలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో పర్యటించారు. -
నెల్లూరు జిల్లాలో అడుగిడిన క్రికెట్ దిగ్గజం
నెల్లూరు జిల్లాలో అడుగిడిన క్రికెట్ దిగ్గజం ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన సచిన్‌కు సాదర స్వాగతం... కృష్ణపట్నం పోర్టులో కోలాహలం ముత్తుకూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకోనున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో ఆదివారం పర్యటించనున్నారు. దీంతో ఆ ఊరు అప్పుడే సంక్రాంతి శోభను సంతరించుకుంది. సచిన్ శనివారమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రానికి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన సచిన్‌కు పోర్టు ఎండీ శశిధర్, సీఈఓ అనిల్ ఎండ్లూరి పుష్పగుచ్ఛాలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సచిన్ ప్రత్యేక వేదిక నుంచి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సెక్యూరిటీ కేంద్రంలో మొక్కలు నాటారు. సీవీఆర్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ట్రస్టు నిర్వహించే స్కూళ్ల విద్యార్థులతోముచ్చటించి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. పోర్టు ఉద్యోగులు, స్థానిక యువకులు సచిన్‌ను చూసేందుకు, సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపటంతో సెక్యూరిటీ గార్డులు వారందరినీ నెట్టివేశారు. అనంతరం జేసీ రేఖారాణితో పాటు ప్రత్యేక కాన్వాయ్‌లో ఆయన పోర్టును సందర్శించారు. జరుగుతున్న అభివృద్ధిని పోర్టు నిర్వాహకులు ఆయనకు వివరించారు. ఆ తర్వాత చిల్లకూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ తీరంలో పోర్టు యాజమాన్యానికి చెందిన ప్రత్యేక అతిధిగృహంలో సచిన్ బసచేశారు. ఆయన ఆదివారం నాడు తాను దత్తత తీసుకోనున్న పుట్టంరాజు వారి కండ్రిక గ్రామాన్ని సందర్శించనున్నారు. -
నెల్లూరులో క్రికెట్ దిగ్గజం సచిన్
-
సచిన్ బోట్ విహారం
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కృష్ణపట్నం పోర్టు వద్ద బోట్ విహారం చేశారు. బోట్లోనుంచే కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలను పరిశీలించారు. పోర్టు సీఈఓ అనిల్, ఎండి శశిధర్ పోర్టు ప్రగతి గురించి సచిన్‌కు వివరించారు. అంతకు ముందు హెలికాప్టర్లో ఆయన నేరుగా పోర్టుకు చేరుకున్నారు. అధికారులు, పోర్టు సిబ్బంది సచిన్‌కు ఘనస్వాగతం పలికారు. పోర్టు సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనాన్ని సచిన్ స్వీకరించారు. ప్రస్తుతం సచిన్ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సాయంత్రం ఆయన జిల్లా ప్రముఖులను కలుస్తారు. సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్ టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామంలో సచిన్ రేపు పర్యటిస్తారు. ** -
రూ. 1,800 కోట్లకు కృష్ణపట్నం పోర్టు ఆదాయం
కృష్ణపట్నం పోర్టు నుంచి బిజినెస్ బ్యూరో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) కృష్ణపట్నం పోర్టు ఆదాయం 30 శాతం వార్షిక వృద్ధితో రూ. 1,700 - 1800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ఎండీ సి. శశిధర్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి పోర్టు కంటెయినర్ టెర్మినల్ వద్ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) కి చెందిన లైనర్ సర్వీసు.. ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమానికి ఆహ్వానించిన మీడియా బృందంతో ఆయన మాట్లాడారు. గతేడాది పోర్టు ద్వారా ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల రూపేణా రూ. 1,600 కోట్లు ప్రభుత్వానికి, భారతీయ రైల్వేలకు రూ. 1,500 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం పోర్టులో బల్క్, కంటెయినర్లకు కలిపి మొత్తం 11 టెర్మినల్స్ ఉన్నాయని శశిధర్ తెలిపారు. భవిష్యత్ అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని భారీ కార్గో హాండ్లింగ్ సామర్థ్యంతో పోర్టును ఏర్పాటు చేశామని ఆయన వివరిం చారు. ప్రస్తుతం ఇందులో 50% మాత్రమే వినియోగం అవుతున్నందున, ఇప్పట్లో విస్తరణ యోచనేదీ లేదన్నారు. ఇక, సమీపంలో ఏర్పాటవుతున్న దుగ్గరాజపట్నం పోర్టు వల్ల తమకు పోటీ ఉండబోదని శశిధర్ చెప్పారు. అలాగే సమీప భవిష్యత్‌లో నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఉద్దేశం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భూసేకరణ తర్వాతే మచిలీపట్నం పోర్టు నిర్మాణం: మచిలీపట్నం పోర్టు నిర్మాణ కాంట్రాక్టు పొందిన తమ నవయుగ గ్రూప్.. భూసేకరణ జరిగిన వెంటనే పనులు ప్రారంభిస్తుందని శశిధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఈ భూసేకరణ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ దగ్గర రాజ ధాని ఏర్పాటవుతున్నందున మచిలీపట్నం పోర్టుకి డిమాండు పెరుగుతుందన్నది తమ అంచనా అన్నారు. మయన్మార్‌కు షిప్పింగ్ లైనర్... సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు నుంచి మయన్మార్‌లోని యాంగాన్ పోర్టుకు షిప్పింగ్ లైనర్ ‘ఎస్సీఐ కమల్’ను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (లైనర్ అండ్ ప్యాసింజర్ సర్వీసెస్ విభాగం) డెరైక్టర్ కెప్టెన్ ఎస్ నారూలా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇదే తరహా లైనర్ సర్వీసులను ఇతర ఆగ్నేయాసియా దేశాలకు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పక్షం రోజులకోసారి ఈ సర్వీసు ఉంటుం దని, డిమాండ్‌ను బట్టి వారం రోజులకోసారి ఉండేలా చూస్తామన్నారు. యాం గాన్ పోర్టు నుంచి భారత్‌కు పప్పు దినుసులు, కలప, దుస్తులు దిగుమతి అవుతాయని తెలిపారు. అలాగే ఇక్కణ్నుంచి మయన్మార్‌కు సిమెంటు, కార్లు, టెలికం పరికరాలు ఎగుమతి అవుతాయని వివరించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి షిప్పింగ్ లైనర్ సర్వీసులను ప్రారంభించడం వల్ల ఎగుమతి, దిగుమతి వ్యయాలు గణనీయంగా తగ్గగలవని కృష్ణపట్నం పోర్టు ఎండీ శశిధర్ తెలిపారు. తూర్పు తీరంలో ఈ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చిన మొదటిపోర్టు తమదేనని, దేశంలో రెండోదని తెలిపారు. -
నిజాలు దాచి.. వైఎస్‌పై శివాలు
-
బోగస్ రాతలు