సరుకుల రవాణాపై సమీక్ష
సరుకుల రవాణాపై సమీక్ష
Published Mon, Nov 7 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టు నుంచి దిగుమతి సరుకులు రైలు మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు జరిగే సరుకుల రవాణాపై సమీక్ష ప్రారంభమైంది. రైల్వే జీఎం రవీంద్రగుప్తా పర్యటన అనంతరం రైల్వేవర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం బొగ్గు, ఎరువులు, సున్నపు రాయి, జిప్సం తదితర సరుకులు 2014–15లో పోర్టు నుంచి రైలు మార్గంలో 5,196 రేక్స్ ద్వారా రవాణా జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం 1.90 కోట్ల టన్నుల సరుకులు రవాణా అయ్యాయి. 2015–16లో 3,202 రేక్స్ ద్వారా 1.19 కోట్ల టన్నుల సరుకులు రవాణా జరిగింది. 2016–17లో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 1,585 రేక్స్ ద్వారా సరుకులు రవాణా చేశారు. 57 లక్షల టన్నులు రవాణా జరిగింది. సరుకుల రవాణా క్రమంగా సన్నగిల్లడంపై అటు రైల్వేశాఖ, ఇటు పోర్టు వర్గాలు సమీక్ష చేస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Advertisement