goods transportation
-
నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!
దేశంలోని నదులు, కాలువలు, బ్యాక్‌వాటర్ ద్వారా సరుకులు రవాణా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దీనివల్ల ఇంధన ఖర్చు తగ్గడంతోపాటు రవాణా సులభతరం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశీయ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్(అంతస్థలీయ జలమార్గాలు) అభివృద్ధి చేసేందుకు స్టేట్రన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాయితీలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.తీరప్రాంతాల్లో ఒడరేవుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా జరిగే రవాణాకు సింహభాగం రోడ్లనే ఎంచుకుంటున్నారు. అందుకోసం శిలాజ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ నిర్వహణ పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రైఓవర్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించినా ట్రాఫిక్‌ను అదుపు చేయడం యంత్రాంగానికి సవాలుగానే పరిణమిస్తోంది. దానివల్ల సరుకు రవాణా ఆలస్యం అవుతోంది. ఈ సమస్యకు అంతస్థలీయ జలమార్గాలే పరిష్కారమని భావించి ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.దేశంలోని నదులు, కాలువలు, బ్యాక్‌వాటర్‌ను అనుసంధానించి రవాణా చేస్తే మేలు జరుగుతుందని ప్రభుత్వ యోచిస్తోంది. అందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముందుకొచ్చి సంస్థలకు ప్రాథమికంగా రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఇన్‌ల్యాండ్ వాటర్వేస్లో సరుకు రవాణా చేసే సంస్థలకు అయ్యే ఖర్చులో 35 శాతం సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాల ద్వారా మొత్తం 12 నుంచి 16 రకాల వస్తువులను రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇదీ చదవండి: సుప్రీం కోర్టు తీర్పు.. భారం కాబోతున్న విద్యుత్?నేషనల్ వాటర్‌వేస్ 1(ఎన్‌డబ్ల్యూ1)లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్లో ప్రవహిస్తున్న గంగా, భగీరథీ, హుగ్లీ నదులను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్గం 1,620 కిలోమీటర్ల పరిధిలో విస్తరించనుంది. ఎన్‌డబ్ల్యూ 2లో 891 కిలోమీటర్ల పరిధిలో బ్రహ్మపుత్ర నదిలో రవాణా సాగించేలా ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ప్రాథమికదశలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ద్వారా రవాణా చేసి కంపెనీలు నష్టాలపాలైతే దాన్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. అంతస్థలీయ జలమార్గాల ద్వారా సరుకు రవాణా చేసి రోడ్లు, రైళ్ల రవాణాపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటికే తీరప్రాంతాల్లో ఓడరేవుల నిర్వహణ, సరుకు రవాణా చేసే కంపెనీలకు ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆయా కంపెనీలు ఇన్‌ల్యాండ్ వాటర్వేస్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే అదనంగా ఆదాయం సమకూర్చుకోవచ్చు. -
ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసుకునేలా రాష్ట్రంలో ఓడరేవులు, లాజిస్టిక్ పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు తెలిపింది. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ‘భవిష్యత్తు అవసరాల కోసం పోర్టుల అభివృద్ధి–న్యూ ఇండియా 75’ అనే అంశంపై ఆన్లైన్లో జాతీయ సదస్సును నిర్వహించింది. ఇందులో ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తీర ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.చదవండి: Andhra Pradesh: అవసరం ఏదైనా.. ఒక్క బటన్ నొక్కితే చాలు : ముఖ్యంగా సరుకు రవాణా వ్యయం తగ్గించడానికి పోర్టుల సమీపంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామన్నారు. దీంతో దేశంలోనే అత్యధిక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి పోర్టులకు సమీపంలో భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని కోరారు.చదవండి: ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ! రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘమైన తీర ప్రాంతం కలిగి ఉండటంతో సముద్ర ఆధారిత వాణిజ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అంతకుముందు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ మాట్లాడుతూ.. దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి, పారిశ్రామికీకరణలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. -
సరికొత్త రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ
కరోనా మహమ్మరి కాలంలో భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. మే నెల మొత్తంలో అత్యధికంగా సరుకుల రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2021 మేలో భారత రైల్వే అత్యధికంగా 114.8 మెట్రిక్ టన్నుల(ఎమ్‌టి) సరుకులను రవాణా చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో సుమారు 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్(క్లింకర్ మినహా), 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల మినరల్ ఆయిల్ రవాణా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఫలితంగా గత నెలలో 11,604 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మే 2019లో 104.6 టన్నుల సరుకు రవాణా చేసింది. ఇప్పటి వరకు అదే అత్యధికం ఉండేది, ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. 2019 మేతో పోలిస్తే ఇది 9.7 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వేకు గత నెలలో ఆదాయం, సరుకు రవాణా ఎక్కువగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మే నెలలో వేగన్ టర్న్ అరౌండ్ టైమ్ 26 శాతం మెరుగైందని రైల్వే పేర్కొంది. గత 18 నెలల్లో సరుకు రవాణా రైళ్ల వేగం రెట్టింపు కావడంతో పాటు, రాయితీలు డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల గత నెలలో అత్యధికంగా సరుకు రవాణా చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2021లో సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 45.6 కిలోమీటర్లుగా నమోదైంది, అదే సమయంలో ఇది గత ఏడాది 36.19 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 26 శాతం ఎక్కువ" అని రైల్వే శాఖ వెల్లడించింది. చదవండి: మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం -
రైతు.. రవాణా.. విక్రయం
సాక్షి, హైదరాబాద్: రైతు పండిస్తాడు.. ఆ పంట మార్కెట్‌కు అక్కడి నుంచి వినియోగదారుడికి చేరాలి. ఇది సామాజిక ఆహారపు గొలుసు. ఇందులో ఎక్కడ లంకె తెగినా ప్రజలు ఇబ్బందిపడతారు. అది తీవ్రరూపం దాలిస్తే వారు దాడులకు దిగే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ ఉద్దేశం తలకిందులవుతుంది. కోవిడ్ వైరస్ కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఐదు రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్నా 24 గంటలు ఈ ఆహారపు గొలుసును కాపాడేం దుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇందు కోసం గ్రామా ల్లో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం పెడుతున్నారు. రైతులంతా ముఖాలకు మాస్క్‌లు కట్టుకొని నిర్భయంగా వ్యవసాయం చేసుకోవచ్చని, పండించిన కూరగాయలు, పాలను ఇబ్బంది లేకుండా మార్కెట్లకు తరలించవచ్చని అభయమిచ్చారు. దీంతో రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఈ బాధ్యతను గ్రామస్థాయిలో ఉండే కానిస్టేబుళ్లు తీసుకుంటున్నారు. ఇక తరలించిన పంటలను మార్కెట్లో అధిక ధరలకు విక్రయించకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తగ్గిన వాహనాల సంఖ్య: హైదరాబాద్‌లో గురువారం వాహన సంచారం బాగా తగ్గింది. పోలీసులు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాంకేతికతతో పనిచేసే సాఫ్ట్వేర్ సాయంతో కేసులు బుక్ చేస్తామని ప్రకటించారు. 3 కి.మీ. దూరం దాటే ప్రతి వాహనదారుడిపై కేసులు పెడతామని హెచ్చరించడంతో గురువారం హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు బాగా తగ్గాయి. వస్తువుల సరఫరాకు పాసులు: డీజీపీ నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు ప్రత్యేక పాసులు జారీ చేయాలని కమిషనర్లు, ఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏయే వస్తువులను ఎక్కడికి రవాణా చేస్తున్నారనే వివరాలు సేకరించి పాసులు ఇవ్వాలని సూచించారు. రవాణా వాహనాలకు పెద్ద పోస్టర్లు... కూరగాయలు, బియ్యం, ఇతర వంట సామగ్రిని సరఫరా చేసే వాహనదారులు తమ వాహనాల అద్దాలపై వారు ఏం రవాణా చేస్తున్నారో తెలిపేలా పెద్ద పోస్టర్లు అంటించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. అలాగే పలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు వాటి కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా లాక్డౌన్ నుంచి డీజీపీ మినహాయింపు ఇచ్చారు. ఉబర్, జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్ ప్రతినిధులు యూనిఫారం, ఐడీ కార్డులు వేసుకుంటే చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి ఆటంకాలు ఉండవని డీజీపీ ట్వీట్ చేశారు. -
ఆర్టీసీలో సరుకుల రవాణాకు బ్రేక్
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో సరుకుల రవాణాకు బ్రేక్ పడింది. జిల్లాలోని ఆయా బస్స్టేషన్లలో నిర్వహించే ఏఎన్ఎల్ సర్వీసు కేంద్రాలకు తాళం పడింది. ఆర్టీసీ బస్సుల్లో ఏఎన్ఎల్ పార్సిల్స్‌ను అనుమతించరాదంటూ డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి సరుకులు రవాణా, ఇతరత్రా పార్సిల్స్ తీసుకువచ్చిన డ్రైవర్లపై కొరడా ఝళిపించారు. నాలుగు రోజుల క్రితం ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడడంతో మంచిర్యాల డిపోకు చెందిన కండక్టర్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. దీంతో బస్సుల్లో పార్సిల్స్ తీసుకు రావాలంటే డ్రైవర్లు, కండక్టర్లు జంకుతున్నారు. ఎప్పటి నుంచో రవాణా.. ఆర్టీసీ బస్సుల్లో సరకులు రవాణా చేసే విధానం గతం నుంచి అమల్లో ఉంది. అప్పట్లో ఏఎన్ఎల్ సంస్థ ద్వారా సరుకులను రవాణా చేసేవారు. దీని కోసం సంస్థ ఆర్టీసీకి లీజు కింద ఏడాదికి కొంత సొమ్ము చెల్లించేది. సరుకు రవాణా ఆదాయం మెరుగ్గా ఉన్నా ఏఎన్ఎల్ సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసే సరుకులు రవాణా నిలిపివేయడంతో ఏఎన్ఎల్ సంస్థ జూన్ 8 నుంచి కేంద్రాలను మూసివేసింది. అప్పటి నుంచి బస్సుల్లో సరుకులు తీసుకు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత సరుకులకు మినహయింపు బస్సుల్లో ప్రయాణికుడు తన వెంట సరుకులు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. వారే స్వయంగా సరుకులు దింపడం చేస్తే అభ్యంతరం చెప్పడం లేదు. 25 కేజీల వరకు సరుకులను తీసుకెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు. ఆపై సరుకులను బరువును బట్టి ప్రయాణికుడితోపాటు లగేజీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లు ప్రయాణికుడు లేకుండానే లగేజీ చార్జీలు చెల్లించి తీసుకు వస్తే మాత్రం చర్యలు చేపట్టింది. మంచిర్యాల డిపోకు చెందిన కండక్టర్ జీఎం కుమార్ ప్రయాణికుడు లేకుండా సరుకులను బస్సులో తరలించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో సరుకులు తరలిస్తున్నట్లు తేలడంతో కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఎవరైనా సరకులు, ఇతరత్రా పార్సిల్స్ తీసుకువెళ్లమంటే ‘మాకెందుకు తంటా’ అంటూ తప్పించుకోవాల్సి వస్తుందని ఓ డ్రైవర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయానికి గండి నిర్మల్, ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోలతోపాటు చెన్నూర్, లక్షెట్టిపేట, జన్నారం, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లో ఏఎన్ఎల్ పార్సిల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధానంగా సరుకులు చేరవేయటం ద్వారా ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. పార్సిల్స్, సరుకులు చేరవేయడం ద్వారా బస్సుల్లో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించినా నష్టాన్ని కొంత మేర పూడ్చుకునే వీలుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 620 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా నిత్యం సరుకులు, పార్సిల్స్ చేరవేస్తుంటాయి. గత నెల 8 నుంచి సరుకుల రవాణా నిలిపివేయడం వల్ల పార్సిల్స్‌తో వచ్చే ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. నష్టాలను పూడ్చుకునేందుకేనా..? నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించడం కోసం యాజమాన్యం పలు విధానాలు అమలు చేస్తోంది. స్థలాల లీజు, వ్యాపార సముదాయాలను నిర్మించి అద్దెకు ఇవ్వడం వంటివి చేస్తున్నా ఆశించినా రీతిలో ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సరుకుల రవాణా ద్వారా ఆదాయం మెరుగ్గా విషయాన్ని అధ్యయనం చేసిన సంస్థ సొంతంగా నిర్వహించేందుకు ఏఎన్ఎల్ సంస్థను పక్కకు తప్పించినట్లు ప్రచారంలో ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది నుంచి సరుకుల రవాణా ప్రక్రియను కార్గో పేరుతో ఆర్టీసీ యాజమాన్యమే పూర్తిస్థాయిలో నిర్వహిస్తోంది. అక్కడ సంస్థకు వచ్చిన లాభాలను బేరీజు వేసుకుని ఇక్కడ కూడా సరకు రవాణా, కొరియర్ సేవలను సొంతంగా నిర్వహించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు ఓ అధికారి చెప్పుకొచ్చారు. సరుకులు తరలించరాదు బస్సుల్లో సరుకులు తీసుకురావడం చట్ట వ్యతిరేకం. తెలంగాణ వ్యాప్తంగా ఏఎన్ఎల్ పార్సిల్స్ తీసుకురావద్దని ఆదేశాలున్నాయి. అందుకే ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ఏఎన్ఎల్ పార్సిల్స్ అనుమంతించబోమంటూ ముందస్తుగా కండక్టర్లు, డ్రైవర్లకు తెలియజేశాం. అయినప్పటికీ బస్సుల్లో సరుకులు తీసుకువస్తూ డిపోకు చెందిన కండక్టర్ ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడడంతో సస్పెండ్ చేశారు. – మల్లికార్జున్‌రెడ్డి, మంచిర్యాల డీఎం -
‘కంటైనర్’లో మద్యం విక్రయాలు
- నెల్లూరు జిల్లా పంటపాళెంలో దుకాణాలు - తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు సరుకులు రవాణా చేసే కంటైనర్లను మద్యం దుకాణాల మాదిరిగా ఉపయోగిస్తున్నారు. ఏకంగా కంటైనర్లలోనే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం, పోర్టు బైపాస్‌రోడ్డులో ఇలా కంటైనర్లలో మద్యం దుకాణాలు నడుపుతున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. –ముత్తుకూరు (సర్వేపల్లి) -
సరుకుల రవాణాపై సమీక్ష
ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టు నుంచి దిగుమతి సరుకులు రైలు మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు జరిగే సరుకుల రవాణాపై సమీక్ష ప్రారంభమైంది. రైల్వే జీఎం రవీంద్రగుప్తా పర్యటన అనంతరం రైల్వేవర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం బొగ్గు, ఎరువులు, సున్నపు రాయి, జిప్సం తదితర సరుకులు 2014–15లో పోర్టు నుంచి రైలు మార్గంలో 5,196 రేక్స్ ద్వారా రవాణా జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం 1.90 కోట్ల టన్నుల సరుకులు రవాణా అయ్యాయి. 2015–16లో 3,202 రేక్స్ ద్వారా 1.19 కోట్ల టన్నుల సరుకులు రవాణా జరిగింది. 2016–17లో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 1,585 రేక్స్ ద్వారా సరుకులు రవాణా చేశారు. 57 లక్షల టన్నులు రవాణా జరిగింది. సరుకుల రవాణా క్రమంగా సన్నగిల్లడంపై అటు రైల్వేశాఖ, ఇటు పోర్టు వర్గాలు సమీక్ష చేస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. -
నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె
స్తంభించనున్న సరుకు రవాణా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా స్తంభించనుంది! తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మె చేపట్టనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు లక్ష లారీలు సహా తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. లారీల బంద్ వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సాధారణ ప్రజలు సతమతమవుతుండగా లారీల సమ్మె వల్ల వాటి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్ను విధానానికి వ్యతిరేకంగా లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఇవ్వడం సహా పెండింగ్‌లో ఉన్న 17 డిమాండ్లను పరిష్కరించాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సీఎం, రవాణాశాఖ మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలసి విన్నవించుకున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు అందలేదని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత్యంతరం లేని స్థితిలో సమ్మెకు సిద్ధమయ్యామన్నారు. టాటా ఏస్‌లు, గూడ్స్ ఆటోలు మినహా ఇతర సరుకు రవాణా వాహనాలు బంద్‌లో పాల్గొంటాయన్నారు. అత్యవసర వస్తువులు రవాణా చేసే వాహనాలు, నీటి ట్యాంకర్లను సమ్మె నుంచి మినహాయించారు. డిమాండ్లు ఇవీ... ⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్నుకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంచెల్లుబాటయ్యేలా తాము చెల్లించిన త్రైమాసిక పన్ను నుంచి ఏపీలోని 13 జిల్లాలకు పన్ను తగ్గించాలి. ⇒ ఇరు రాష్ట్రాల్లో తిరిగేందుకు అనుమతినిస్తూ ఏటా రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు పన్ను తీసుకొని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలి. ⇒ 15 ఏళ్లు నిండిన కాలం చెల్లిన సరుకు రవాణా లారీలపై నిషేధం విధించే అంశంపై సంప్రదింపులు జరపాలి. ⇒ లారీ యజమానుల నుంచి హమాలీ, గుమాస్తా మామూళ్ల వసూలును నిలిపేయాలి. ⇒ సరుకు లోడింగ్, అన్లోడింగ్ సమయంలో రక్షణ కల్పించాలి.టట్రక్ ఓనర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (తోహాస్) నూతన కమిటీని ఏర్పాటు చేయాలి.టజిల్లా, తాలూకా కేంద్రాల్లో ట్రక్ టర్మినల్స్, ట్రక్ పార్కింగ్లు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె వాయిదా.. ఏపీలో డీజిల్, పెట్రోలుపై పెంచిన వ్యాట్ రద్దు చేయడంతోపాటు మరో 10 డిమాండ్లు నెరవేర్చాలని పెట్రోల్ బంకులు, లారీల యజమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సోమవారం రాత్రి వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఏపీ పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, ఏపీ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్ల అసోసియేషన్ ఐక్య కార్యాచరణ సమితితో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జూలై 8లోగా సమస్యల్ని పరిష్కరించడంతోపాటు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీనివ్వడంతో సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. జూలై 8లోగా సమస్యలు పరిష్కరించకపోతే 9 నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ఈశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
సరుకు రవాణాతో రైల్వేకు భారీ ఆదాయం
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం చేకూరింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 35.2% వృద్ధితో రూ.945.47 కోట్ల ఆదాయాన్ని పొందింది. గతేడాది ఇదే నెలలో నమోదైన ఆదాయం రూ.699.29 కోట్లు. జనవరిలో 10.59 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. గతేడాదితో పోల్చుకుంటే ఇది 0.74 మిలియన్ టన్నులు అధికం కావడం విశేషం. రైల్వేశాఖ ఈ సారి ప్రత్యేక అధికారులను నియమించి సరుకు రవాణాను మరింత సమర్థంగా నిర్వహించింది. దీంతో జనవరి చివరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7,476.60 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24.3% ఎక్కువ. ముఖ్యంగా కాకినాడ పోర్టు దగ్గర బొగ్గు లోడింగ్‌లో ఏకంగా 102.2% వృద్ధి సాధించినట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ప్రయాణికుల ద్వారా జనవరి నెలలో రూ.249.88 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పొందిన ఆదాయం రూ.2,562.88 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.362 కోట్లు ఎక్కువ.