సరుకు రవాణాతో రైల్వేకు భారీ ఆదాయం | profit very high in Railway goods transportation | Sakshi
Sakshi News home page

సరుకు రవాణాతో రైల్వేకు భారీ ఆదాయం

Published Mon, Feb 23 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

profit very high in Railway goods transportation

సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం చేకూరింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 35.2% వృద్ధితో రూ.945.47 కోట్ల ఆదాయాన్ని పొందింది. గతేడాది ఇదే నెలలో నమోదైన ఆదాయం రూ.699.29 కోట్లు. జనవరిలో 10.59  మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. గతేడాదితో పోల్చుకుంటే ఇది 0.74 మిలియన్ టన్నులు అధికం కావడం విశేషం. రైల్వేశాఖ ఈ సారి ప్రత్యేక అధికారులను నియమించి సరుకు రవాణాను మరింత సమర్థంగా నిర్వహించింది.

దీంతో జనవరి చివరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7,476.60 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24.3% ఎక్కువ. ముఖ్యంగా కాకినాడ పోర్టు దగ్గర బొగ్గు లోడింగ్‌లో ఏకంగా 102.2% వృద్ధి సాధించినట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ప్రయాణికుల ద్వారా జనవరి నెలలో రూ.249.88 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పొందిన ఆదాయం రూ.2,562.88 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.362 కోట్లు ఎక్కువ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement