వీడియో: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జన్యం.. | TDP MLA Somireddy Over Action At Krishnapatnam Port | Sakshi
Sakshi News home page

వీడియో: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జన్యం..

Published Mon, Oct 28 2024 4:56 PM | Last Updated on Mon, Oct 28 2024 5:12 PM

TDP MLA Somireddy Over Action At Krishnapatnam Port

సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి రెచ్చిపోయారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సోమిరెడ్డి ప్రతీ చోటా దుసురుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి కృష్ణ పోర్టు వద్ద ఓవరాక్షన్‌ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి కొట్టేందుకు ప్రయత్నించారు.

వివరాల ప్రకారం.. కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సోమవారం పోర్టు వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. తనతో వచ్చిన ఓ కారును అనుమతించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, వెంటనే కారు దిగి.. సెక్యూరిటీపై తన ఆధిపత్యం చూపించారు. సెక్యూరిటీని నెట్టేసి.. అతడికి కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రౌడియిజంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. అదాని పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడి సెక్యూరిటీపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. రౌడీయిజం చేసి పరిశ్రమలను వెళ్లగొట్టాలని సోమిరెడ్డి కుట్రలు చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలను బెదరగొట్టి సోమిరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు. గత పది ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. రౌడీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement