కృష్ణపట్నంపోర్టులో మూడంచెల భద్రత
-
సందర్శకుల ప్రవేశంపై నిషేధం
ముత్తుకూరు : పీఓకేలోని పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంపోర్టులో మూడంచెల భద్రత అమలు చేస్తున్నట్టు పోర్టు సీనియర్ జనరల్ మేనేజర్ టీ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా ఇండియన్ కోస్టుగార్డు, మెరైన్ పోలీసు, పోర్టు సెక్యూరిటీ గార్డుల ఆధ్వర్యంలో తీరప్రాంత గస్తీ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పాక్ ఉగ్రమూకలను అంతం చేసిన సందర్భంగా దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలు, కీలక ప్రదేశాల్లో హై అలెర్ట్ ప్రకటించారని తెలిపారు. ఈ కారణంగా పోర్టులో సందర్శకుల పర్యటనను తాత్కాలికంగా నిషేధించామన్నారు. వివిధ పనులపై వచ్చే వారు గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోవాలన్నారు. పోర్టు పరిసర గ్రామాల ప్రజలు, తీరప్రాంత వాసులు తమకు సహకరించాలని సెక్యూరిటీ ఏజీఎం మనోహరబాబు విజ్ఞప్తి చేశారు.