నెల్లూరు : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని ఐడీబీఐ బ్యాంక్ శాఖలో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భద్రత సిబ్బంది అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, ఫైళ్లు కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐడీబీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం
Published Tue, Jul 5 2016 9:52 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement