ఏపీసెజ్‌–కృష్ణపట్నం పోర్టు డీల్‌కు లైన్‌ క్లియర్‌  | CCI Nod APSEZ To 25 Percent Additional Stake In Krishnapatnam Port | Sakshi
Sakshi News home page

ఏపీసెజ్‌–కృష్ణపట్నం పోర్టు డీల్‌కు లైన్‌ క్లియర్‌ 

Published Wed, May 19 2021 9:19 AM | Last Updated on Wed, May 19 2021 9:37 AM

CCI Nod APSEZ To 25 Percent Additional Stake In Krishnapatnam Port - Sakshi

న్యూఢిల్లీ: అదానీ కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) మరో 25 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ఏపీసెజ్‌కు ఇప్పటికే పోర్టులో 75% వాటాలు ఉన్నాయి. మిగతా వాటాల కొనుగోలుతో 100% వాటాలు దక్కించుకున్నట్లవుతుంది. కృష్ణపట్నం పోర్టులో విశ్వసముద్ర హోల్డింగ్స్‌కి ఉన్న 25% వాటాలను రూ. 2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏప్రిల్‌లో ఏపీసెజ్‌ వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement