కృష్ణపట్నం పోర్టుకు సీఐఐ అవార్డు! | CII Award Krishnapatnam port | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం పోర్టుకు సీఐఐ అవార్డు!

Published Wed, Mar 18 2015 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

కృష్ణపట్నం పోర్టుకు సీఐఐ అవార్డు!

కృష్ణపట్నం పోర్టుకు సీఐఐ అవార్డు!

ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు ‘భారత పరిశ్రమల సమాఖ్య’(సీఐఐ) ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా పోర్టుకు భారత పరిశ్రమల సమాఖ్య దక్ష ణాది రీజియన్ ‘3 స్టార్’ రేటింగ్‌ను బహూకరించి, అవార్డు ప్రదానం చేసింది. చెన్నైలో ఇటీవల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ భద్రత అవార్డు అందజేశారు. 130 పరిశ్రమలతో పోటీపడినప్పటికీ చివరికి ఈ అవార్డు తమకే దక్కిందని పోర్టు ప్రతినిధులు మంగళవారం వెల్లడించారు. 2020 నాటికి కాలుష్యరహిత పోర్టుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement