బెంగాల్ నుంచి కృష్ణపట్నం పోర్టుకు రైలులో చేరుకున్న రెండు ఆక్సిజన్ ట్యాంకర్లు
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు శనివారం సాయంత్రం ఆక్సిజన్ రైలు వచ్చింది. దీని ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ఉన్న రెండు ట్యాంకర్లు పోర్టుకు చేరుకొన్నాయి.
ఈ ప్రత్యేక రైలుకు అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో అవినాష్‌చంద్ రాయ్, నెల్లూరు జేసీ హరేందిరప్రసాద్, జేసీ (ఆసరా) బాబిరెడ్డి, చిత్తూరు జేసీ మార్కండేయులు, పోర్టు సెక్యూరిటీ జీఎం రాకేష్ కృష్ణన్, స్థానిక తహసీల్దార్ సోమ్లానాయక్‌లు స్వాగతం పలికారు. ఇప్పటికే రైల్లో వచ్చిన ట్యాంకర్ల నుంచి ఆక్సిజన్‌ను స్థానిక ట్యాంకర్లలోకి నింపుకొనే ప్రక్రియ చేపట్టారు. వీటిని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment