
సచిన్ బోట్ విహారం
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కృష్ణపట్నం పోర్టు వద్ద బోట్ విహారం చేశారు. బోట్లోనుంచే కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలను పరిశీలించారు. పోర్టు సీఈఓ అనిల్, ఎండి శశిధర్ పోర్టు ప్రగతి గురించి సచిన్కు వివరించారు. అంతకు ముందు హెలికాప్టర్లో ఆయన నేరుగా పోర్టుకు చేరుకున్నారు. అధికారులు, పోర్టు సిబ్బంది సచిన్కు ఘనస్వాగతం పలికారు. పోర్టు సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనాన్ని సచిన్ స్వీకరించారు.
ప్రస్తుతం సచిన్ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సాయంత్రం ఆయన జిల్లా ప్రముఖులను కలుస్తారు. సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్ టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామంలో సచిన్ రేపు పర్యటిస్తారు.
**