puttamraju vari kandriga
-
'సచిన్‌లో దేవుడిని చూసుకున్నాం'
నెల్లూరు: సచిన్ టెండూల్కర్‌లో తాము దేవుడిని చూసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా పుట్టంరాజుగారి కండ్రిగ గ్రామస్తులు చెప్పారు. సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి గతంలో గ్రామం వదిలి వెళ్లిన వారందరూ తిరిగి గ్రామానికి వస్తున్నారు. నవంబరు 16వ తేదీని తాము సచిన్ డేగా జరుపుకుంటామని తెలిపారు. సచిన్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఆయన గ్రామానికి రావడం, ఆయనను దగ్గరగా చూడటం, ఆయన వారితో గడపడంతో గ్రామంలోని మహిళలు, యువకులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. సచిన్ చెప్పిన శుభ్రతలు పాటిస్తామని గ్రామస్తులు చెప్పారు. సచిన్ తమ గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉందని యువకులు చెప్పారు. అయితే ఆయనతో క్రికెట్ ఆడాలన్న కోరిక తీరలేదని చెప్పారు. ఈసారి వచ్చినప్పుడు ఆయనతో క్రికెట్ ఆడతామని చెప్పారు. ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని సచిన్ చెప్పారు. వచ్చే ఏడాది ఇదే రోజున మళ్లీ వస్తానని ఆయన చెప్పారు. ** -
పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ పర్యటన
-
పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ పర్యటన
నెల్లూరు: భారతరత్న, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదివారం పుట్టంరాజువారి కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. సచిన్‌కు ఉన్నతాధికారులు, గ్రామస్తులు ఘనస్వాగతం పిలికారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఏర్పాటు చేసిన సచిన్ శిలఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ... గ్రామస్తులను పలకరిస్తున్నారు.అందులోభాగంగా స్థానిక చెరువులో చేపలు వదిలి మీనోత్సవాన్ని సచిన్ ప్రారంభించారు. గ్రామంలో రూ.2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సచిన్ పర్యవేక్షించనున్నారు. పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకున్న తర్వాత తొలిసారిగా సచిన్ ఆ గ్రామంలో పర్యటిస్తున్నారు. సచిన్ పర్యటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నెల్లూరు జిల్లాలో అడుగిడిన క్రికెట్ దిగ్గజం
నెల్లూరు జిల్లాలో అడుగిడిన క్రికెట్ దిగ్గజం ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన సచిన్‌కు సాదర స్వాగతం... కృష్ణపట్నం పోర్టులో కోలాహలం ముత్తుకూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకోనున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో ఆదివారం పర్యటించనున్నారు. దీంతో ఆ ఊరు అప్పుడే సంక్రాంతి శోభను సంతరించుకుంది. సచిన్ శనివారమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రానికి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన సచిన్‌కు పోర్టు ఎండీ శశిధర్, సీఈఓ అనిల్ ఎండ్లూరి పుష్పగుచ్ఛాలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సచిన్ ప్రత్యేక వేదిక నుంచి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సెక్యూరిటీ కేంద్రంలో మొక్కలు నాటారు. సీవీఆర్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ట్రస్టు నిర్వహించే స్కూళ్ల విద్యార్థులతోముచ్చటించి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. పోర్టు ఉద్యోగులు, స్థానిక యువకులు సచిన్‌ను చూసేందుకు, సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపటంతో సెక్యూరిటీ గార్డులు వారందరినీ నెట్టివేశారు. అనంతరం జేసీ రేఖారాణితో పాటు ప్రత్యేక కాన్వాయ్‌లో ఆయన పోర్టును సందర్శించారు. జరుగుతున్న అభివృద్ధిని పోర్టు నిర్వాహకులు ఆయనకు వివరించారు. ఆ తర్వాత చిల్లకూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ తీరంలో పోర్టు యాజమాన్యానికి చెందిన ప్రత్యేక అతిధిగృహంలో సచిన్ బసచేశారు. ఆయన ఆదివారం నాడు తాను దత్తత తీసుకోనున్న పుట్టంరాజు వారి కండ్రిక గ్రామాన్ని సందర్శించనున్నారు. -
నెల్లూరులో క్రికెట్ దిగ్గజం సచిన్
-
సచిన్ బోట్ విహారం
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కృష్ణపట్నం పోర్టు వద్ద బోట్ విహారం చేశారు. బోట్లోనుంచే కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలను పరిశీలించారు. పోర్టు సీఈఓ అనిల్, ఎండి శశిధర్ పోర్టు ప్రగతి గురించి సచిన్‌కు వివరించారు. అంతకు ముందు హెలికాప్టర్లో ఆయన నేరుగా పోర్టుకు చేరుకున్నారు. అధికారులు, పోర్టు సిబ్బంది సచిన్‌కు ఘనస్వాగతం పలికారు. పోర్టు సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనాన్ని సచిన్ స్వీకరించారు. ప్రస్తుతం సచిన్ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సాయంత్రం ఆయన జిల్లా ప్రముఖులను కలుస్తారు. సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్ టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామంలో సచిన్ రేపు పర్యటిస్తారు. ** -
సచిన్ సభకు గ్రామస్తులకే అనుమతి
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా పర్యటనపై భద్రత సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సచిన్ పాల్గొనే పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామ సభకు గ్రామస్తులను మాత్రమే అనుమతిస్తామని, ఇతరులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ రేఖా రాణి చెప్పారు. సచిన్ ఈ నెల 16న నెల్లూరు జిల్లా పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామానికి రానున్నారు. గూడూరు నియోజకవర్గంలో ఉన్న పుట్టంరాజు వారి కండ్రిగను సచిన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మాస్టర్ రానున్న నేపథ్యంలో ఆ గ్రామంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సచిన్ ప్రతినిధులైన మనోజ్, నారాయణ ఇటీవల ఆ గ్రామానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. మాస్టర్ పర్యటన మొత్తం సింపుల్‌గా జరగనుంది. ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా సాధారణంగా జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సచిన్ కేవలం దత్తత తీసుకున్న గ్రామాన్ని పరిశీలించేందుకు మాత్రమే వస్తున్నారని, మిగతా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనరని ఆయన ప్రతినిధులు తేల్చి చెప్పేశారు. సచిన్ కోసం అభిమానులు వేలల్లో వచ్చే అవకాశం ఉన్నందున వారందర్నీ కంట్రోల్ చేసేందుకు, ఎవ్వరూ అటువైపు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా తోపులాటలు, ఆయన్ను తాకేందుకు ఆస్కారం ఇవ్వరు. వీఐపీలు ఆయన్ను కలిసే ప్రయత్నం చేయకూడదు. కార్యక్రమం ముగింపు సమయంలో ఓ 10 నిమిషాలు గ్రామస్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించవచ్చు. సచిన్ రాక నేపథ్యంలో ఆయన తిరిగే అన్నిచోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బ్యారికేడ్ల మధ్యలో సచిన్, మరికొంత మంది మాత్రమే ఉండనున్నారు.