
పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ పర్యటన
నెల్లూరు: భారతరత్న, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదివారం పుట్టంరాజువారి కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. సచిన్కు ఉన్నతాధికారులు, గ్రామస్తులు ఘనస్వాగతం పిలికారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఏర్పాటు చేసిన సచిన్ శిలఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ... గ్రామస్తులను పలకరిస్తున్నారు.అందులోభాగంగా స్థానిక చెరువులో చేపలు వదిలి మీనోత్సవాన్ని సచిన్ ప్రారంభించారు.
గ్రామంలో రూ.2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సచిన్ పర్యవేక్షించనున్నారు. పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకున్న తర్వాత తొలిసారిగా సచిన్ ఆ గ్రామంలో పర్యటిస్తున్నారు. సచిన్ పర్యటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.