'సచిన్లో దేవుడిని చూసుకున్నాం' | "We saw god in Sachin" | Sakshi
Sakshi News home page

'సచిన్లో దేవుడిని చూసుకున్నాం'

Published Sun, Nov 16 2014 8:17 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

సచిన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న పుట్టంరాజుగారి కండ్రిగ మహిళ

సచిన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న పుట్టంరాజుగారి కండ్రిగ మహిళ

నెల్లూరు: సచిన్ టెండూల్కర్లో తాము దేవుడిని చూసుకుంటున్నట్లు  నెల్లూరు జిల్లా పుట్టంరాజుగారి కండ్రిగ గ్రామస్తులు చెప్పారు. సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి గతంలో గ్రామం వదిలి వెళ్లిన వారందరూ తిరిగి గ్రామానికి వస్తున్నారు. నవంబరు 16వ తేదీని తాము సచిన్ డేగా జరుపుకుంటామని తెలిపారు. సచిన్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఆయన గ్రామానికి రావడం, ఆయనను దగ్గరగా చూడటం, ఆయన వారితో గడపడంతో గ్రామంలోని మహిళలు, యువకులు చాలా ఆనందం వ్యక్తం చేశారు.

సచిన్ చెప్పిన శుభ్రతలు పాటిస్తామని గ్రామస్తులు చెప్పారు. సచిన్ తమ గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉందని యువకులు చెప్పారు. అయితే ఆయనతో క్రికెట్ ఆడాలన్న కోరిక తీరలేదని చెప్పారు. ఈసారి వచ్చినప్పుడు ఆయనతో క్రికెట్ ఆడతామని చెప్పారు. ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని సచిన్ చెప్పారు. వచ్చే ఏడాది ఇదే రోజున మళ్లీ వస్తానని ఆయన చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement