శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు మరో వెయ్యి ఎకరాలు కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సవరించిన మాస్టర్‌ప్లాన్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు మరో వెయ్యి ఎకరాలు కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కేపీసీఎల్) సమర్పించిన మాస్టర్‌ప్లాన్‌కు సర్కారు ఆమోదముద్ర వేసింది. గతంలో కేపీసీఎల్ 5,800 ఎకరాల్లో పోర్టు అభివృద్ధి పనులకు సమర్పించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించింది. అయితే కేపీసీఎల్ తాజాగా 6,800 ఎకరాల్లో అభివృద్ధికి సవరించిన మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించింది.
ఇందులో వెయ్యి ఎకరాల నీటి వనరులు ఉన్నాయని పేర్కొంది. లైట్ హౌస్‌ను మరోచోటకు మార్పు చేయడం, జెట్టీ విస్తరణ తదితరాలు సవరించిన మాస్టర్‌ప్లాన్‌లో ఉన్నాయి. దీన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.