కృష్ణపట్నం పోర్టులో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/ముత్తుకూరు: విజయవాడ డివిజన్ కృష్ణపట్నం పోర్టుకు మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం చేరుకుంది. రైలు మార్గం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది ఏడోది. ఇది నాలుగు ట్యాంకర్లలో 76 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఒడిశాలోని రూర్కెలాలో బయలుదేరి 22 గంటల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. ఈ ప్రత్యేక రైలు ద్వారా ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు 20 ట్యాంకర్లలో మొత్తం 395 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి దిగుమతి అయ్యింది. డీఆర్‌ఎం పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రీన్ చానల్ ద్వారా ఈ ఆక్సిజన్ రైళ్ల కదలికలను పర్యవేక్షిస్తూ సకాలంలో గమ్యస్థానానికి చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment