సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సహకారంతో కొవిడ్ క్వారంటైన్ సెంటర్ కమ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చొరవతో కృష్ణపట్నం పోర్టు ట్రస్టు యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సామాజిక బాధ్యతను కలెక్టర్ అభినందించారు. పారిశ్రామిక సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పారిశ్రామిక వాడలో కొవిడ్ బాధితులకు చికిత్స అందించనున్నారు. తొలిదశలో 100 ఐసోలేషన్ బెడ్లు, 20 బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి క్లినిక్ లో బెడ్ల సామర్థం పెంచనున్నారు. వైద్యులు, సిబ్బందిని కూడా కృష్ణపట్నం పోర్టు ట్రస్టు నియమించినట్లు వైద్య ఆర్యోగ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment