27,000 దాటిన సెన్సెక్స్
మార్కెట్ అప్‌డేట్
* 217 పాయింట్లు ఫ్లస్
* ఐదు వారాల గరిష్టం
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహం, డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ మరోసారి మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరుసి సెన్సెక్స్ 217 పాయింట్లు ఎగసి 27,098 వద్ద ముగిసింది. తద్వారా ఐదు వారాల తరువాత మళ్లీ 27,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా, నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుంది. 8,090 వద్ద నిలిచింది. ఒక దశలో 8,098ను తాకింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడింది. ప్రధానంగా రియల్టీ, మెటల్స్, ఆటో, ఐటీ రంగాలు 2.5-1.5% మధ్య పుంజుకున్నాయి.
ఇతర విశేషాలివీ...
* మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, సెయిల్ 6-2% మధ్య ఎగశాయి.
* మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, బజాజ్‌ఆటో, రిలయన్స్, ఎంఅండ్‌ఎం, మారుతీ, సిప్లా 3.5-1.5% మధ్య బలపడ్డాయి.
* రియల్టీ షేర్లు డీఎల్ ఎఫ్, శోభా, డీబీ, ఇండియాబుల్స్, యూనిటెక్ 6-3% మధ్య జంప్ చేశాయి.
* హెల్త్‌కేర్ బ్లూచిప్స్ డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 1%పైగా నష్టపోయాయి.
* మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,610 లాభపడగా, 1,355 క్షీణించాయి.
* ఎఫ్‌ఐఐలు రూ. 786 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్ రూ. 507 కోట్ల అమ్మకాలు నిర్వహించాయి.
* బీఎస్‌ఈ-500లో ఎస్‌ఆర్‌ఎఫ్ 20% దూసుకెళ్లాయి.