ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తన జెరోధా కైట్‌లో ట్రేడర్ల కోసం నోట్స్ అనే ఫీచర్‌ను డెవలప్ చేసింది.
జెరోధా కైట్‌లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్విరామంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదే సమయంలో ట్రేడర్లు ఆయా స్టాక్స్‌పై ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేస్తున్నామో తెలుసుకునేందుకు ఈ నోట్స్ ఫీచర్స్‌తో ట్రాక్ చేసుకోవచ్చని జెరోధా ప్రతినిధులు చెబుతున్నారు.
Introducing notes on Kite web.
At any given point in time, you may be tracking multiple stocks for different reasons. Even if you add the stocks on your marketwatch, it's hard to remember all the reasons why you added them. Now, you can easily add a quick note about why you are… pic.twitter.com/Su7AKm34Ip— Zerodha (@zerodhaonline) May 14, 2024
ప్రస్తుతం ఈ ఫీచర్ కౌట్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోయాపల్‌లో సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జెరోధా ట్వీట్ చేసింది. ‘ఏ సమయంలోనైనా, మీరు వివిధ కారణాల వల్ల పలు స్టాక్స్‌ను ట్రాక్ చేయొచ్చు. కొన్ని సార్లు మీరు ఆయా స్టాక్స్ ఎందుకు ఎంచుకున్నారో గుర్తించుకోవడం కష్టం. ఆ సమస్యను అధిగమించేలా నోట్ అనే టూల్‌ను అందిస్తున్నట్లు జెరోధా తన ట్వీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment