Market update
-
Stock Market Today: స్టాక్ మార్కెట్ లాభాల బాట
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో మొదలైంది. గురువారం ఉదయం మొదలైన స్టాక్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు (0.56 శాతం) లాభంతో 58, 113 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు(0.55 శాతం) లాభంతో 17, 315 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఫోకస్లో ఉన్నాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ 1 శాతం పెరుగుదల కనిపిస్తోంది. బ్యాంక్, మెటల్, ఆయిల్ గ్యాస్, పవర్, రియల్టీ సెక్టార్స్‌లో కొనుగోలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ గెయినర్‌గా, మారుతీ సుజుకీ బిగ్గెస్ట్ లాసర్గా నిలిచాయి. చదవండి: చరిత్రాత్మక కనిష్ట పతన దిశగా రూపాయి విలువ! కారణాలివే.. -
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్
Stock Market Live Updates: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ఆరంభం.. భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ కారణంతో.. నిన్న(సోమవారం) నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతోనే మొదలైంది. మంగళవారం ఉదయం 9.23గంటలకు 363 పాయింట్లు నష్టపోయి.. 57,919 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 17, 266 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ►సిప్లా బిగ్గెస్ట్ గెయినర్‌గా ఉండగా, బజాజ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లాజర్గా ఉంది. నిఫ్టీ ఫార్మా బెస్ట్సెక్టార్గా, నిఫ్టీ ఐటీ వరస్ట్సెక్టార్ కేటగిరీలో కొనసాగుతున్నాయి. ►ఎర్లీ ట్రేడ్‌లో పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హిందూలివర్, టైటాలన్లు లాభపడ్డాయి. మారుతి, యాక్సిస్, భారతీఎయిర్‌టెల్, నెస్లే ఇండియా నష్టపోయాయి. చదవండి: టెన్షన్.. టెన్షన్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్ -
తొలుత 37,000- చివర్లో 36,694కు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఓమాదిరి లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 99 పాయింట్లు బలపడి 36,694 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు పుంజుకుని 10,803 వద్ద నిలిచింది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది. మిడ్‌సెషన్‌కల్లా కొనుగోళ్ల స్థానే అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకుని నష్టాలలోకి ప్రవేశించింది. 36,534 దిగువకు చేరింది. చివర్లో తిరిగి కోలుకుంది. ఈ బాటలో నిఫ్టీ 10,894 వద్ద గరిష్టాన్ని తాకి, తదుపరి 10,756 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు 1.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బ్యాంకింగ్, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, విప్రో, ఎయిర్టెల్, జీ, బ్రిటానియా, వేదాంతా 5.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, గెయిల్, కొటక్ మహీంద్రా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ 2.2-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్‌అండ్‌వో ఇలా డెరివేటివ్ కౌంటర్లలో బాష్, భారత్ ఫోర్జ్, రామ్‌కో సిమెంట్, బీహెచ్ఈఎల్, కాల్గేట్ పామోలివ్ 4.3-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. డీఎల్ఎఫ్, గ్లెన్‌మార్క్, సెయిల్, ఈక్విటాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్సీసీ, బీవోబీ, యూబీఎల్ 3.3-2.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.15 శాతం వెనకడుగు వేసింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1567 నష్టపోగా.. 1127 లాభపడ్డాయి. అమ్మకాల జోరు నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1031 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 431 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 803 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
మార్కెట్ల హైజంప్- 3 నెలల గరిష్టం
లాక్‌డవున్‌ల ఎత్తివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల రికవరీపై ఆశలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు బలపడుతున్నాయి. వెరసి వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్ 519 పాయింట్లు జంప్‌చేసి 35,430 వద్ద నిలవగా.. 160 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 10,471 వద్ద స్థిరపడింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సమయం గడిచేకొద్దీ మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. ఫలితంగా ఇంట్రాడే గరిష్టాలకు చేరువలోనే ముగిశాయి. తొలుత 34,844 దిగువన కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివర్లో 35,482ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 10,485- 10,302 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ పుంజుకోగా.. రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా 3-1.5 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, హిందాల్కో, యూపీఎల్, పవర్‌గ్రిడ్, శ్రీ సిమెంట్, యాక్సిస్, ఇన్ఫ్రాటెల్ 9.3-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఆర్ఐఎల్ 1.4 శాతం, ఎయిర్టెల్ 0.6 శాతం మాత్రమే నీరసించాయి. బంధన్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో బంధన్ బ్యాంక్ 15 శాతం దూసుకెళ్లగా.. జస్ట్ డయల్, నౌకరీ, డీఎల్ఎఫ్, పిరమల్ 7-5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. గ్లెన్‌మార్క్, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం, సెంచురీ టెక్స్, మెక్‌డోవెల్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, పేజ్ 7-1 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.7 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1964 లాభపడగా.. 761 మాత్రమే డీలాపడ్డాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,237 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 881 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఈ చిన్న షేర్లు మార్కెట్లకంటే స్పీడ్
ఉన్నట్టుండి మెరుగుపడిన సెంటిమెంటు ప్రభావంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు(1 శాతం) పెరిగి 35,251కు చేరగా.. నిఫ్టీ 109 పాయింట్లు(1 శాతం) ఎగసి 10,421 వద్ద ట్రేడవుతోంది. అయితే కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో మార్కెట్లకు మించిన వేగంతో ఈ షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా జంప్‌చేయడం గమనార్హం. జాబితాలో మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్, లైఫ్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్, ఇండో నేషనల్, నితిన్ స్పిన్నర్స్, ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. మహీంద్రా హాలిడేస్ రిసార్ట్స్ ఆతిధ్య రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 179 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 18 శాతం దూసుకెళ్లి రూ. 199ను అధిగమించింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3750 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7400 షేర్లు చేతులు మారాయి. నిప్పన్ లైఫ్ ఇండియా ఏఎంసీ ప్రయివేట్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 313 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 322 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 93500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.57 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇండో నేషనల్ నిప్పో బ్రాండ్ బ్యాటరీల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 633 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 450 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4000 షేర్లు చేతులు మారాయి. నితిన్ స్పిన్నర్స్ కాటన్ యార్న్ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 53 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 11,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.54 లక్షల షేర్లు చేతులు మారాయి. ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్ నావల్టీ ఫ్యాబ్రిక్స్ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 16 శాతం జంప్‌చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 75 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1300 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,000 షేర్లు చేతులు మారాయి. -
మార్కెట్.. రోలర్ కోస్టర్ రైడ్
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మధ్యలో అమ్మకాల ఒత్తిడితో దెబ్బతిన్నాయి. తిరిగి మిడ్‌సెషన్ నుంచీ ఊపందుకుని చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 33,605 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం లాభాల సెంచరీ చేసి 9,914 వద్ద స్థిరపడింది. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలు ద్వారా కంపెనీలకు మరింత ఆర్థిక చేయూత నిచ్చేందుకు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్ వచ్చింది. దీంతో ఆసియా మార్కెట్లు 4-1 శాతం మధ్య జంప్ చేశాయి. ఈ బాటలో తొలుత సెన్సెక్స్ 800 పాయింట్ల వరకూ ఎగసింది. 34,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 34,022ను తాకింది. తదుపరి అమ్మకాల ఒత్తిడిలోపడి 33,000 పాయింట్ల దిగువన 32,953కు జారింది. ఇది 250 పాయింట్ల నష్టంకాగా.. ఇంట్రాడేలో 1,000 పాయింట్ల పరిధిలో ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ తొలుత 10,046 వద్ద గరిష్టాన్ని తాకగా.. మిడ్‌సెషన్‌లో 9729 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ప్రయివేట్ బ్యాంక్స్ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, మీడియా 2-1.25 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, యూపీఎల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, హీరో మోటో, వేదాంతా 4-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే టాటా మోటార్స్ 6 శాతం పతనంకాగా.. ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యాక్సిస్, గెయిల్, ఐవోసీ, ఐటీసీ, ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. బాలకృష్ణ జోరు డెరివేటివ్స్‌లో బాలకృష్ణ, ఎల్ఐసీ హౌసింగ్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ సీపీ, ఎస్బీఐ లైఫ్, అమరరాజా 5.2-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా, టాటా పవర్, శ్రీరామ్ ట్రాన్స్, అపోలో హాస్పిటల్స్, బీవోబీ, కేడిలా హెల్త్‌కేర్, ఎన్సీసీ 4.4-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1380 లాభపడగా.. 1193 నష్టపోయాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2960 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1076 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. ఇక శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1311 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1945 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
సెన్సెక్స్‌కు 297పాయింట్లు నష్టం
-
10 వారాల కనిష్ట స్థాయి
ఆరో రోజూ నష్టాలే 50 పాయింట్ల నష్టంతో 28,112కు సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో 8,531కు నిఫ్టీ మార్కెట్ అప్డేట్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు మరో ఒక్క రోజు ఉన్న నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, లోహ షేర్లకు నష్టాలు విస్తరించడంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ సూచీలు క్షీణపధంలోనే సాగాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. మొత్తం మీద బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టపోయి 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది పదివారాల కనిష్ట స్థాయి. తీవ్రమైన ఒడిదుడుకులు రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తుండటంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. మార్చి కాంట్రాక్టులు గురువారంతో ముగుస్తుండటంతో ట్రేడర్లు త పొజిషన్లను ఏప్రిల్ సిరీస్‌కు క్యారీ ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మందకొడిగా సాగిందని నిపుణులంటున్నారు. లాభాల్లోనే ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 28,250-28,031 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 50 పాయింట్ల నష్టంతో 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 625 పాయింట్లు(2.17 శాతం) నష్టపోయింది. ఇక నిఫ్టీ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 12 పాయింట్లు నష్టపోయి 8,531 పాయింట్ల వద్ద ముగిసింది. 12.5 శాతం తగ్గిన ఇప్కా ల్యాబ్స్ విలీన ప్రక్రియ పూర్తికావడంతో సన్ ఫార్మా 1.3 శాతం, ర్యాన్‌బాక్సీ 1.6 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రతి 10 ర్యాన్‌బాక్సీ షేర్లకు 8 సన్ ఫార్మా షేర్లు లభిస్తాయి. త్వరలో ర్యాన్‌బాక్సీని స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయనున్నారు. పీతంపూర్, సిల్వెసా ప్లాంట్లకు అమెరికా ఎఫ్‌డీఏ ఇంపోర్ట్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్కా ల్యాబ్స్ షేర్ 12.5 శాతం తగ్గింది. మౌలిక, లోహ, మైనింగ్, ఆయిల్, గ్యాస్ రంగాల్లోని భారత కంపెనీలు భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయాయని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ సర్వీసెస్ వెల్లడించడంతో ఈ రంగాల్లోని షేర్లు డీలా పడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,406 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.16,401 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,57,911 కోట్లుగా నమోదైంది. మోసాల వివరాలు వెల్లడించాలి: సెబీ లిస్టెడ్ కంపెనీల్లో మోసాలు, ఆర్థిక అవకతవకలు, వాటి వెల్లడి గురించిన నియమని బంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. డిస్క్లోజర్ నిబంధనలను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా సెబీ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఏదైనా కంపెనీలో మోసం జరిగిందని వెల్లడైనప్పుడు, ఏదైనా ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పుడు, కీలకమైన వ్యక్తులు అరెస్టయినప్పుడు. ఆ వివరాలను, వాటికి గల కారణాలను, వాటి ప్రభావాన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలపాల్సి ఉంటుంది. -
నెల కనిష్టానికి మార్కెట్
- అమెరికా ఫెడ్ పాలసీ నేపథ్యం - 66 పాయింట్ల నష్టంతో 28,438కు సెన్సెక్స్ - 15 పాయింట్ల మైనస్‌తో 8,633కు నిఫ్టీ - మార్కెట్ అప్డేట్ ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ -30, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ -50 సోమవారం నెల కనిష్ట స్థాయికి పడ్డాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంలో 28,438 వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,633 వద్దకు దిగింది. మార్కెట్ ట్రేడింగ్ మొత్తం భారీ ఒడిదుకుల మధ్య సాగి, చివరకు నష్టాల్లో ముగిసింది. ఊగిసలాట..: ప్రారంభ ట్రేడింగ్‌లో 28,582 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్, బ్లూచిప్స్‌లో భారీ అమ్మకాల ఒత్తిడితో 28,384 కనిష్టానికి పడింది. చివరికి కొంత కోలుకుంది. ఇక నిఫ్టీ 8,664 గరిష్ట-8,612 కనిష్ట శ్రేణిలో కదలాడింది. లాభ నష్టాల్లో..: 30 సెన్సెక్స్ షేర్లలో 19 నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీ సూచీలను చూస్తే, మెటల్ (1.49%), ఎఫ్ఎంసీజీ (0.96%), కేపిటల్ గూడ్స్ (0.63%) నష్టపోయాయి. ఐటీ (1.1%), రియల్టీ (1.15%), టెక్ (0.52 %) పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 0.87%, 0.34% చొప్పున పడ్డాయి. మొత్తం 1,859 స్టాక్స్ నష్టపోగా, 1,024 లాభపడ్డాయి. 126 స్థిరంగా ఉన్నాయి. టర్నోవర్..: బీఎస్ఈలో మొత్తం టర్నోవర్ రూ.3,866 కోట్ల నుంచి రూ.3,233 కోట్లకు పడింది. ఎన్ఎస్ఈలో క్యాష్ టర్నోవర్ రూ. 16,726 కోట్లు. డెరివేటివ్స్‌లో ఈ విలువ రూ. 1,91,059 కోట్లు. కారణం...! బుధవారం అమెరికా ఫెడరల్ బ్యాంక్ సమావేశం, వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఊహాగానాల నేపథ్యంలో మార్కెట్ నష్టంలో ముగిసింది. అమెరికా వడ్డీరేట్లు పెంచితే, భారత్ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కు మళ్లవచ్చన్న ఆందోళన మార్కెట్లో నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుక్రవారం కూడా సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయిన సంగతి విదితమే. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషణలు వినిపించాయి. సోమవారం విడుదలైన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ‘మైనస్’గా ఉన్నా... ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలోనే ఉండడం, దీనితో భారత్‌లో కీలక పాలసీ రేటు రెపో మరింత తగ్గబోదన్న ఊహాగానాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని కొందరి విశ్లేషణ. -
సెన్సెక్స్‌కు 427 పాయింట్లు నష్టం
⇒ రేట్ల కోత ఉండదేమోనన్న అంచనాలు ⇒ బీమా, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ ⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు ⇒ ఈ వారంలో 3 శాతం నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీలు ⇒ ఈ ఏడాది అత్యధిక నష్టపోయిన వారం ఇదే ⇒ మార్కెట్ అప్డేట్ రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో పెరిగిన కారణంగా రేట్ల కోత ఆశలు ఆవిరి కావడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా పతనమైంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. గురువారం బాగా పెరిగిన బీమా, బ్యాంకింగ్ షేర్లలో కూడా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 427 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయాయి. అత్యధిక నష్టవారం’ గురువారం నాటి ముగింపు(28,930 పాయింట్లు)తో పోల్చితే బీఎస్ఈ సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో (29,135 పాయింట్ల వద్ద) ప్రారంభమైంది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలకు, దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న బీమా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలను మించడం కూడా తోడవడంతో సెన్సెక్స్ 29,000 పాయింట్లను దాటేసింది. ఇంట్రాడేలో 29,184 పాయింట్ల గరిష్ట స్థాయి (253 పాయింట్లు లాభం)ను తాకింది. అయితే ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరడం ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. రూపాయి పతనం, లాభాల స్వీకరణ కారణంగా దీంతో ప్రారంభ ఉత్సాహం ఆవిరైంది. ఈ నెలలో కూడా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని, దీంతో వచ్చే నెల ద్రవ్యపరపతి విధానంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించకపోవచ్చన్న ఆందోళన స్టాక్ మార్కెట్‌ను పడేసింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 28,448 పాయింట్ల కనిష్ట స్థాయికి (482 పాయింట్ల నష్టం) పడిపోయింది. చివరకు 427 పాయింట్ల నష్టంతో(1.48 శాతం) 28,503 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ మొత్తం 946 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 8,850-8,632 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 128 పాయింట్లు నష్టపోయి 8,648 పాయింట్లు వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 3.2 శాతం చొప్పున తగ్గాయి. ఈ ఏడాది భారీగా నష్టపోయిన వారం ఇదే. -
స్టాక్ మార్కెట్‌కు బీమా జోష్
- ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల పెంపు ప్రభావం - మూడు రోజుల నష్టాలకు కళ్లెం - మార్కెట్ అప్డేట్ ముంబై: ఈ వారంలో మొదటిసారిగా స్టాక్ మార్కెట్ లాభాలను కళ్లజూసింది. ఐటీసీ, బీమా రంగ సంబంధిత కంపెనీల షేర్లు పెరగడంతో మూడు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. బీమా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందన్న ఆశాభావం, భారత వృద్ధి అవకాశాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్‌గ్రేడ్ చేయడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 76 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీ 8,700 మార్క్‌ను దాటింది. బీమా బిల్లు ఆమోదం పొందితే సంస్కరణల జోరు పెరుగుతుందన్న ఆశాభావం మార్కెట్లో కనిపించిందని నిపుణులంటున్నారు. చివరి వరకూ లాభాల్లోనే: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ చివరి వరకూ అదే జోరును కొనసాగింది. బుధవారం నాటి ముగింపు(28,659 పాయింట్లు)తో పోల్చితే 140 పాయింట్ల లాభంతో 28,799 పాయింట్ల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. 312 పాయింట్ల లాభాన్ని(28,971 పాయింట్లు-ఇంట్రాడే గరిష్టం) చేరి చివరకు 271 పాయింట్ల లాభంతో (0.95%) 28,930 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు(0.87%) లాభపడి 8,776 వద్ద ముగిసింది. విద్యుత్తు, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, రంగాల షేర్లు లాభాల బాట పట్టాయి. సిగరెట్ల ధరలను 15% వరకూ పెంచడంతో ఐటీసీ ధర 2.5% వృద్ధి చెంది రూ.347కు చేరింది. ఒక్కో షేరుకు రూ.12.5 చొప్పున ఇచ్చే బోనస్ డిబెంచర్లకు రికార్డ్ డేట్‌ను (ఈ నెల 23) ప్రకటించడంతో ఎన్టీపీసీ షేర్ 3.5% పెరిగి రూ.159.7 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 24 షేర్లు లాభపడ్డాయి. సెసా స్టెరిలైట్ 3. 6% లాభపడింది. అత్యధికంగా లాభపడ్డ సెన్సెక్స్ షేర్ ఇదే. 1,643 షేర్లు లాభాల్లో, 1,229 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,727 కోట్లు. ఎన్ఎస్ఈలో రూ.18,526 కోట్లు. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,61,857 కోట్లు. బీమా షేర్ల జోరు గురువారం రాజ్యసభ ఆమోదానికి బీమా బిల్లు రావడంతో సంబంధిత షేర్లు1-11% రేంజ్లో పెరిగాయి. రాజ్యసభ ఆమోదం కూడా పొందుతుందనే అంచనాలతో బీమా అనుబంధ సంస్థలున్న ఆర్థిక సేవల కంపెనీల షేర్లు పెరిగాయి. రిలయన్స్ క్యాపిటల్ (11%), మ్యాక్స్ ఇండియా(5.3%), ఎక్సైడ్ ఇండస్ట్రీస్(4.8%), ఆదిత్య బిర్లా నువో(3.8%), రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ (2.69%), ఐసీఐసీఐ బ్యాంక్(1.6%), బజాజ్ ఫిన్సర్వ్(1.4%), హెచ్డీఎఫ్సీ (0.7%), ఎస్బీఐ (0.6%) పెరిగాయి. -
మూడో రోజూ నష్టాల్లోనే
- ఆచి, తూచి వ్యవహరిస్తున్న ఇన్వెస్టర్లు - 51 పాయింట్ల నష్టంతో 28,649కు సెన్సెక్స్ - 8,700 పాయింట్లకు నిఫ్టీ - మార్కెట్ అప్డేట్ స్టాక్ మార్కెట్ క్షీణత వరుసగా మూడో రోజూ కొనసాగింది. ఆసియా సంకేతాలు మందకొడిగా ఉండడం, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణ గణాంకాలు గురువారం వెలువడుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. కీలక షేర్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 51పాయింట్లు క్షీణించి 28,649 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 8,700 పాయింట్లకు దిగజారింది. లోహ, ఆయిల్, గ్యాస్, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు సెన్సెక్స్ మొత్తం 790 పాయింట్లు నష్టపోయింది. ఆసియా మార్కెట్ల ప్రభావం మంగళవారం నాటి ముగింపుతో (28, 710 పాయింట్లతో) పోలిస్తే సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కరంట్ అకౌంట్ లోటు అంచనాల కంటే తక్కువగా ఉందనే శుభవార్తతో కొనుగోళ్ల జోరు పెరిగింది. అయితే ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయని కోటక్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. సెన్సెక్స్ 51 పాయింట్ల(0.18 శాతం) నష్టంతో 28,659 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 12 పాయింట్లు(0.14 శాతం) నష్టపోయి 8,700 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చే వారం జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులుండడం వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని నిపుణులంటున్నారు. 5.5 శాతం క్షీణించిన హిందాల్కో బొగ్గు కుంభకోణంలో హిందాల్కో గ్రూప్‌నకు చెందిన కుమార మంగళం బిర్లాకు స్పెషల్ కోర్ట్ సమన్లు జారీ చేయడంతో హిందాల్కో కంపెనీ షేర్ 6 శాతం వరకూ పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీషేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,568 కోట్లు ఆవిరైంది. సోమవారం నాటి ముగింపు(రూ.138)తో పోలిస్తే ఈ షేర్ బీఎస్ఈలో ఇంట్రాడేలో 8 శాతం వరకూ క్షీణించి రూ.127.3ను తాకింది. చివరకు 5.5 శాతం నష్టంతో రూ.130.45 వద్ద ముగిసింది. -
స్వల్ప లాభాల్లో మార్కెట్ ముగింపు
- కొనసాగుతున్న లాభాల స్వీకరణ - 68 పాయింట్ల లాభంతో 29,449కు సెన్సెక్స్ - 15 పాయింట్ల లాభంతో 8,938కు నిఫ్టీ మార్కెట్ అప్డేట్ రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో గురువారం నాడు స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ చివరిలో రక్షణాత్మక షేర్లలో రికవరీ, హెచ్డీఎఫ్సీ ద్వయం పెరగడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ కోలుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 68 పాయింట్లు (0.23 శాతం)లాభపడి 29,449 పాయింట్ల వద్ద, నిప్టీ 15 పాయింట్లు లాభపడి 8,938 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరోగ్య సంరక్షణ, బ్యాంక్, వాహన, ఎఫ్ఎంసీజీ, విద్యుత్ షేర్లలో రికవరీ కనిపించింది. లోహ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్‌లో లాభాల స్వీకరణ కొనసాగింది. రోజంతా నష్టాల్లోనే... బుధవారం నాటి ముగింపు(29,381 పాయింట్లు)తో పోల్చితే బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. 29,437 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 29,518-29,162 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 68 పాయింట్లు (0.23 శాతం)లాభంతో 29,449కు చేరింది. రోజంతా స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. హోలీ సెలవుతో పాటు వీకెండ్‌కావడంతో వరుసగా మూడు రోజులు సెలవు అయినందున ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక దిశ, దశ లేకుండా సూచీలు కదలాడాయి. అయితే దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న బీమా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడం, కోల్ బిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ఊపడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపడంతో చివరకు సూచీలు లాభాలతో ముగియగలిగాయి. లాభనష్టాల్లో... 30 సెన్సెక్స్ షేర్లలో 13 లాభాల్లో, 17 నష్టాలో ముగిశాయి. సన్ ఫార్మా, సన్‌ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్, ర్యాన్‌బాక్సీల జోరు నేడు కూడా కొనసాగింది. సన్ ఫార్మా 3.2 శాతం పెరిగింది. 1,461 షేర్లు నష్టాల్లో, 1,401 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,648 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.19,542 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,36,434 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 80 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.194 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.చైనా తన జీడీపీ లక్ష్యాన్ని 7 శాతానికి తగ్గించడంతో(11 ఏళ్లలో ఇదే కనిష్ట స్థాయి) జపాన్ నికాయ్ మినహా మిగిలిన అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. -
సెన్సెక్స్ 30,000..చివరికి నష్టాల్లోకి
రికార్డ్ స్థాయిలకు సెన్సెక్స్, నిఫ్టీలు - 30,025 రికార్డు తర్వాత 213 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ - 9,100 తాకిన అనంతరం నిఫ్టీకి 74 పాయింట్ల నష్టం - గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణం - మార్కెట్ అప్ డేట్ నాలుగు రోజుల స్టాక్ మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. ఎవరూ ఊహించని రీతిలో మరోసారి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ తొలిసారిగా 30,000 శిఖరాన్ని చేరింది. నిఫ్టీ 9,100 పాయింట్లను దాటాయి. ఆశ్చర్యకరంగా రెపోరేటును ఆర్బీఐ కోత కోయడంతో సెన్సెక్స్ ఆల్‌టైమ్ హై-30,025ను, నిఫ్టీ రికార్డ్ గరిష్ట స్థాయి 9,119లను తాకాయి. అయితే ఈ ఉత్సాహం కొద్దిసేపే ఉంది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా లాభపడడంలో విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో చివరకు సెన్సెక్స్ 213 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 74 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. కాగా ఆర్బీఐ రెపోరేటును తగ్గించడం రెండు నెలల్లో ఇది రెండోసారి. మొత్తం నష్టం 644 పాయింట్లు: మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో గ్యాపప్‌తో స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభయ్యాయి. కొన్ని నిమిషాల్లోనే బీఎస్ఈ సెన్సెక్స్ 30,025 పాయింట్లను తాకింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 29,289 కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరకు 213 పాయింట్ల (0.72 శాతం)నష్టంతో 29,381 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డే గరిష్ట స్థాయి నుంచి చూస్తే 644 పాయింట్లు నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ(0.82 %) నష్టపోయి 8,923 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్, లోహ, ఆయిల్, గ్యాస్, విద్యుత్, వాహన, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ షేర్లు పెరిగాయి. ఆందోళన అనవసరం: గత నాలుగు రోజులగా స్టాక్ మార్కెట్ దూసుకుపోతూనే ఉందని, బుధవారం స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డ్ స్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని నిపుణులంటున్నారు. అయితే ఈ క్షీణత సాధారణమైనదేనని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డ్ స్థాయిలకు చేరడంతో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగిందని, ఆందోళన చెందాల్సినదేమీ లేదని వారంటున్నారు. ఏప్రిల్‌లో జరిగే ద్రవ్య పరపతి సమీక్షకు ముందే రెపో రేటును తగ్గించడం-మధ్యకాలానికి ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వ కృతనిశ్చయాన్ని వెల్లడిస్తోందని, దీంతో స్టాక్ మార్కెట్ సంతృప్తిపడిందని ప్రభుదాస్ లీలాధర్ హెడ్(ఇన్వెస్ట్మెంట్) అజయ్ బోడ్కే చెప్పారు. వెలుగులో సన్ ఫార్మా, స్పార్క్‌లు: సన్ ఫార్మా అనుబంధ సంస్థ సన్‌ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ(స్పార్క్) రూపొందించిన మూర్ఛ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. దీంతో సన్ ఫార్మా 6.7%లాభంతో రూ.1,006వద్ద, సన్‌ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ 4.4 శాతం లాభంతో రూ. 430 వద్ద ముగిశాయి. సన్‌ఫార్మాలో విలీనం కానున్న ర్యాన్‌బాక్సీ కూడా ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి(రూ.803)ని తాకి 7 శాతం లాభంతో రూ.783 వద్ద ముగిసింది. లాభ నష్టాల్లో....: 30 సెన్సెక్స్ షేర్లలో 24 నష్టాల్లో, 6 లాభాల్లో ముగిశాయి. 1,887 షేర్లు నష్టాల్లో, 1,003 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.6,861 కోట్లు. -
నిఫ్టీ రికార్డ్ ముగింపు
⇒ కొనసాగుతున్న బడ్జెట్ జోష్ ⇒ జోరుగా విదేశీ నిధులు ⇒ 98 పాయింట్ల లాభంతో 29,459కు సెన్సెక్స్ ⇒ 55 పాయింట్ల లాభంతో 8,957కు నిఫ్టీ ⇒ మార్కెట్ అప్డేట్ ముంబై: బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చే ప్రతిపాదనలు ఉన్నాయంటూ ఇన్వెస్టర్లు భావిస్తుండటంతో స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయిలో(8,957 పాయింట్లు) ముగిసి రికార్డ్ సృష్టించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 98 పాయింట్లు. నిఫ్టీ 55 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, విద్యుత్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో విదేశీ ఇన్వెస్టర్ల నిధులు వెల్లువెత్తుతున్నాయని నిపుణులంటున్నారు. గార్ వాయిదా, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, మౌలిక రంగానికి ఊతమిచ్చేలా తీసుకున్న బడ్జెట్ చర్యలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడుతున్నారని వారంటున్నారు. 3 రోజుల్లో సెన్సెక్స్ లాభం 700 పాయింట్లు... శనివారం నాటి ముగింపు(29,361 పాయింట్లు)తో పోల్చితే 172 పాయింట్ల లాభంతో 29,533 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. 29,576(215 పాయింట్ల లాభం)-29,260(101 పాయింట్ల నష్టం) పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 98 పాయింట్ల లాభం(0.33 శాతం)తో 29,459 వద్ద ముగిసింది. మూడు వరుస ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 700 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 8,957 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీకి కొత్త గరిష్ట స్థాయి ముగింపు. ఇంతకు ముందు ఈ రికార్డు జనవరి 29న 8,952 పాయింట్లుగా నమోదైంది. అప్పట్లో 8,996 పాయింట్ల నూతన గరిష్టస్థాయి వరకూ నిఫ్టీ పెరిగింది. క్షీణతలోనే ఐటీసీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్ల జోరు పెరిగింది.ఐటీసీతో సహా కొన్ని ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు కనిపించాయని స్టాక్ బ్రోకర్లు చెప్పారు. ఫిబ్రవరి నెల విక్రయాల వెల్లడి నేపథ్యంలో కొన్ని వాహన కంపెనీలు బలహీనంగా ట్రేడయ్యాయి. ఐటీ, లోహ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫిబ్రవరిలో తయారీ వృద్ధి 5 నెలల కనిష్టానికి పడిపోయిందన్న హెచ్ఎస్బీసీ సర్వే కొంత ప్రతికూల ప్రభావం చూపించింది. లాభ నష్టాల్లో.... 30 సెన్సెక్స్ షేర్లలో 13 షేర్లు నష్టాల్లో, 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,510 షేర్లు లాభాల్లో, 1,328 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మొత్తం టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,648 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.23,942 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,25,409 కోట్లుగా నమోదైంది. 20 శాతం పెరిగిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేర్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేర్ ధర సోమవారం 20 శాతం వృద్ధితో రూ.214కు దూసుకుపోయింది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ డెరైక్టర్ల బోర్డ్‌ను రద్దు చేయాలంటూ కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీ లా బోర్డ్‌కు పిటిషన్ దాఖలు చేయడాన్ని ఫైనాన్షియల్ టెక్నాలజీ బోర్డ్ ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. దీంతో ఈ షేర్ ధర 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.214 వద్ద ముగిసింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో 56 లక్షల షేర్లు చేతులు మారాయి. -
ఆర్థిక సర్వే బూస్ట్- మార్కెట్ పరుగు
- 29,000 దాటిన సెన్సెక్స్ - 8,800 పైన ముగిసిన నిఫ్టీ - శనివారమైనా, నేడు ట్రేడింగ్ - మార్కెట్ అప్డేట్ ముంబై : ఆర్థిక సర్వే బడ్జెట్‌పై ఆశలు పెంచడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ దూసుకెళ్లింది. ద్రవ్య పరిస్థితులు మెరుగుపడ్డాయని, వేగవంతమైన వృద్ధి ఉండొచ్చనే అంచనాలను అందించిన ఆర్థిక సర్వే భారీ సంస్కరణలు ఉంటాయనే ఆశలను రేకెత్తించింది. ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, లోహ, మైనింగ్, విద్యుదుత్పత్తి, వాహన రంగ షేర్లు పెరిగాయి. గత ట్రేడింగ్ సెషన్లలో ఆచి, తూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు ఆర్థిక సర్వే జోష్‌తో భారీగా కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ 29,000 పాయింట్లను, నిఫ్టీ 8,800 పాయింట్లను దాటాయి. సెన్సెక్స్ 473 పాయింట్లు (1.65 శాతం)లాభపడి 29,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 161 పాయంట్లు(1.85 శాతం) లాభపడి 8,845 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒకే రోజున ఇంత భారీ ర్యాలీ జరగడం ఆరువారాల్లో ఇదే ప్రధమం. కాగా నేడు (శనివారమైనా) స్టాక్ ఎక్స్ఛేంజ్లు మామూలుగానే ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్నాహ్నం 3.30గం. వరకూ పనిచేస్తాయి. వెలుగులో రక్షణ రంగ షేర్లు : రక్షణ మంత్రిత్వ శాఖ బ్యాటిల్‌ఫీల్డ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన కారణంగా టాటా పవర్ 5.5 శాతం వృద్ధితో రూ.87కు, ఎల్అండ్టీ 4.8 శాతం వృద్ధితో రూ. 1,759కు పెరిగాయి. 50 వేల కోట్ల భారీ ఆర్డర్ రక్షణ శాఖ నుంచి రావడంతో రోల్టా ఇండియా 19 శాతం, బీఈఎల్ 3 శాతం చొప్పున పెరిగాయి. బడ్జెట్లో గృహ, మౌలిక రంగానికి రాయితీలు ఉండొచ్చన్న అంచనాలతో రియల్టీ, ఇన్ఫ్రా షేర్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్)కు సంబంధించిన పన్ను అంశాల్లో స్పష్టత వస్తుందన్న అంచనాలు కూడా రియల్టీ షేర్ల పెరుగుదలకు తోడ్పడింది. మూడు రోజులుగా పతమవుతూ వచ్చిన రైల్ షేర్లు ఈ జోరులో 10 శాతం వరకూ పెరిగాయి. పుత్తడిపై ఆంక్షలు తొలగించవచ్చన్న ఆర్థిక సర్వే వెల్లడించడంతో టైటన్, టీబీజడ్ వంటి జ్యూయలరీ షేర్లు పెరిగాయి. కాగా సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెరుగుతుందన్న అంచనాలతో ఐటీసీ రూ.394కు తగ్గింది. 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు నష్టపోగా, 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ షేర్లు... అంచనాలు! మోదీ ప్రభుత్వ పూర్తి స్థాయి బడ్జెట్‌ను నేడు(శనివారం) పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నారు. శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవైనా, బడ్జెట్ సందర్భంగా ట్రేడింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభావిత షేర్లపై ఒక అంచనా... ప్రతిపాదన: రక్షణ రంగానికి పెరగనున్న కేటాయింపులు షేర్లు: గుజరాత్ పిపవావ్లకు సానుకూలం ప్రతిపాదన: అందరికీ ఇళ్లు కార్యక్రమం, వ్యక్తిగత ఆదాయపు పన్ను పెంపు షేర్లు: హెచ్‌డీఐఎల్, యూనిటెక్, పురవంకరలకు ఓకే! ప్రతిపాదన: రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు సంబంధించి పన్నులపై స్పష్టత- రీట్స్‌ను డీడీటీ/మ్యాట్, దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయించవచ్చు షేర్లు: డీఎల్ఎఫ్, ప్రెస్టీజ్, అదాని పోర్ట్స్లకు సానుకూలం ప్రతిపాదన: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిధులు, ప్రభుత్వ బ్యాంకులకు హోల్డింగ్ కంపెనీ విధి విధానాలపై స్పష్టత షేర్లు: ఎస్బీఐ, పీఎన్బీ, తదితర బ్యాంకులు ప్రతిపాదన: ముడిచమురుపై కస్టమ్స్ సుంకం 2.5-5 శాతం వరకూ పెంపు షేర్లు: ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు సానుకూలం బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ పెట్రో మార్కెటింగ్ కంపెనీలకు ప్రతికూలం ప్రతిపాదన: పెట్రో ఇంధనాలపై సబ్సిడీ భారం తగ్గింపు లేదా మినహాయింపు షేర్లు: ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు సానుకూలం ప్రతిపాదన: సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెంపు షేర్లు: ఐటీసీకు ప్రతికూలం ప్రతిపాదన: పుత్తడిపై దిగుమతి సుంకం తగ్గింపు షేర్లు: టైటాన్, టీబీజడ్, తదితర షేర్లకు సానుకూలం -
పట్టాలు తప్పిన స్టాక్ మార్కెట్
⇒ నిరాశ పరిచిన రైల్వే బడ్జెట్ ⇒ డెరివేటివ్‌ల కాంట్రాక్ట్ ముగింపు ప్రభావం ⇒ 261 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ⇒ 8,700 దిగువకు నిఫ్టీ ⇒ సిమెంట్, లోహ, ఎరువుల షేర్లు పతనం ⇒ రవాణా వ్యయం పెంపు ఫలితం ⇒ మార్కెట్ అప్డేట్ ముంబై:మోదీ ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను నిరాశపరిచింది. దీనికి ఫిబ్రవరి నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టు ముగింపు కూడా తోడైంది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 261 పాయింట్లు నష్టపోయి 28,747 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 8,684 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్‌కు 2వారాల్లో అధ్వాన ముగింపు ఇదే. బడ్జెట్ నిరాశ: అసలే డిమాండ్ అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో రైల్వే రవాణా వ్యయం పెరగడంతో వీటిని వినియోగదారుడికి సిమెంట్, ఉక్కు కంపెనీలు పూర్తిగా బదిలీ చేయలేవని ఇన్వెస్టర్లు సందేహాపడుతున్నారు. ఆల్ట్రాటెక్ సిమెంట్, హెడెల్‌బెర్గ్ సిమెంట్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ 0.5 శాతం నుంచి 2.1 శాతం రేంజ్లో క్షీణించాయి. ఇక ఉక్కు కంపెనీలు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సెయిల్ షేర్లు 0.8 శాతం నుంచి 3.2 శాతం రేంజ్లో పడిపోయాయి. నేషనల్ ఫెర్టిలైజర్, టాటా కెమికల్స్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ 1.8 శాతం నుంచి 0.3 శాతం రేంజ్లో తగ్గాయి. ఆరు సెన్సెక్స్ షేర్లకే లాభాలు : 30 షేర్ల సెన్సెక్స్‌లో 24 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆరు మాత్రమే లాభాల్లో ముగిశాయి. 1,749 షేర్లు నష్టాల్లో,1,078 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,868 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.23,260 కోట్లుగా, డెరివేటివ్ సెగ్మెంట్లో రూ.5,81,564కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,312 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.341 కోట్ల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు. -
చివర్లో అమ్మకాలు
⇒ కొనసాగిన ముందు జాగ్రత్త ⇒ ప్రారంభ లాభాలు ఆవిరి ⇒ స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు ⇒ మార్కెట్ అప్డేట్ ముంబై: ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభ లాభాలను ముగింపు సమయంలో కోల్పోయాయి. బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లుగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులంటున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ 29,115 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 29,270 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరి గంటన్నరలో అమ్మకాల ఒత్తిడికి లాభాలన్నీ హరించుకుపోయాయి. చివరకు 3 పాయింట్ల లాభంతో 28,968 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 8,767 పాయింట్ల వద్ద ముగిసింది. మిశ్రమంగా రైల్ షేర్లు : మహీంద్రా గ్రూప్ మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఏబీజీ షిప్‌యార్డ్ షేర్ 15 శాతం వరకూ పెరిగిందిజ గురువారం రైల్వే బడ్జెట్ సందర్భంగా రైల్వే షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఐదు ఐపీఓలకు సెబీ ఆమోదం: కాగా ఐదు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం లభించింది. యూనిపార్ట్స్ ఇండియా, వీఆర్ఎల్ లాజిస్టిక్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఏసీబీ (ఇండియా), శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్లు వీటిలో ఉన్నాయి. ఈ కంపెనీలు ఐపీఓకు సంబంధించిన పత్రాలను గత ఏడాది సెబీకి సమర్పించాయి. గతంలో మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోవడంతో పలు కంపెనీలు తమ ఐపీఓ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. మార్చి 10న యాడ్‌ల్యాబ్స్ ఐపీఓ న్యూఢిల్లీ: యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) వచ్చే నెల 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. ఈ సంస్థ ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో యాడ్‌ల్యాబ్స్ ఇమాజిక పేరుతో ఒక ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను నిర్విహ స్తోంది. ఈ పార్క్‌ను ప్రముఖ చిత్ర నిర్మాత, దర్శకుడు మన్మోహన్ శెట్టి నిర్మించారు. -
ఎస్అండ్పీ వార్నింగ్-మార్కెట్లో అమ్మకాలు
- సెన్సెక్స్ 256 పాయింట్లు డౌన్ - 78 పాయింట్లు తగ్గిన నిఫ్టీ - క్షీణించిన బ్యాంకింగ్, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు - మార్కెట్ అప్డేట్ ముంబై: కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు మరో ఐదు రోజుల్లో వెల్లడికానున్న నేపథ్యంలో భారత్ రేటింగ్ పట్ల ప్రసిద్ధ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) హెచ్చరికలు జారీచేయడంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ఫలితంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 29,362 పాయింట్ల స్థాయికి పెరిగినప్పటికీ, అటుతర్వాత కొన్ని బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు వె ల్లువెత్తడంతో 29,913 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. చివరకు క్రితం ముగింపుకంటే 256 పాయింట్ల క్షీణతతో 29,975 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్ల తగ్గుదలతో 8,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ద్రవ్య పరిస్థితి బలహీనంగా వుండటం, ఆదాయస్థాయిలు కనిష్టంగా కొనసాగడం వల్ల భారత్ సార్వభౌమ రేటింగ్‌కు విఘాతం ఏర్పడుతున్నదంటూ ఎస్ అండ్ పీ హెచ్చరించింది. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ప్రధాన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్‌లు 2-2.5 శాతం మేర తగ్గాయి. విలీనానికి అనుమతి కాంపిటీషన్ కమిషన్ అనుమతి లభించడంతో కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా బ్యాంకుల షేర్లు పెరిగాయి.బొగ్గు గనుల వేలంలో గరిష్టంగా 3 బొగ్గు బ్లాకులను దక్కించుకున్నందున, హిందాల్కో ఇండస్ట్రీస్ షేరు ట్రేడింగ్ తొలిదశలో 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 161.8 స్థాయికి చేరినప్పటికీ, ముగింపులో లాభాల స్వీకరణతో రూ. 154.8 స్థాయికి తగ్గి ముగిసింది. సెన్సెక్స్‌లోని 24 షేర్లు క్షీణించగా, 6 షేర్లు మాత్రం పెరిగాయి. ఎక్సేంజీల్లో వ్యాపార లావాదేవీలు గత శుక్రవారంతో పోలిస్తే తగ్గాయి. బీఎస్ఈ నగదు విభాగంలో టర్నోవర్ రూ. 3,570 కోట్లకు తగ్గగా, ఎన్ఎస్ఈ నగదు విభాగం టర్నోవర్ రూ. 17,304 కోట్లకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.602 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ164 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
ఏడు రోజుల లాభాలకు బ్రేక్
- బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ - సెన్సెక్స్ నష్టం 231 పాయింట్లు - 62 పాయింట్ల నష్టంతో 8,834కు నిఫ్టీ - మార్కెట్ అప్డేట్ బ్లూచిప్ షేర్లలో అమ్మకాలతో ఏడు రోజుల స్టాక్ మార్కెట్ల లాభాలకు శుక్రవారం కళ్లెం పడింది. దీనికి తోడు వచ్చే వారం రానున్న బడ్జెట్ కారణంగా ట్రేడర్ల ముందు జాగ్రత్త కూడా ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ, కొన్ని ఆయిల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఆర్ఐఎల్ 3 శాతం డౌన్ సెన్సెక్స్ గురువారం నాటి ముగింపుతో పోల్చితే శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైంది. 29,446 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ 29,462, 29,178 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు 231 పాయింట్లు నష్టపోయి 29,231 పాయంట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 8,834 పాయింట్ల వద్ద ముగిసింది. చమురు శాఖలో కీలక పత్రాలను చోరీ చేశారంటూ ఢిల్లీ పోలీసులు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగిని అదపులోకి తీసుకున్న కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం పతనమైంది. హెచ్‌డీఐఎల్ జోరు.... హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌డీఐఎల్) షేర్ ధర శుక్రవారం 7% పెరిగి 123 వద్ద ముగిసింది. 2013 జనవరి తర్వాత ఇదే అధిక స్థాయి. ఒక నెల కాలంలో ఈ షేర్ 58% పెరిగింది. ఈ కాలానికి సెన్సెక్స్ 1.3 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. విదేశీ ఇన్వెస్టర్లు బాగా ఆసక్తి చూపడం, క్యూ3లో కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం హెచ్‌డీఐఎల్ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. స్పైస్‌జెట్ జూమ్.. స్పైస్‌జెట్‌లో కళానిధి మారన్ వాటాను మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదించడంతో స్పైస్‌జెట్ షేర్ 20 శాతం వృద్ధి చెంది రూ.23.9 వద్ద ముగిసింది. -
స్వల్ప లాభాలతో సరి
- గ్రీసు సంక్షోభం కారణంగా చివర్లో అమ్మకాలు - 230 పాయింట్ల నుంచి 41 పాయింట్ల లాభానికి దిగిన సెన్సెక్స్ - మార్కెట్ అప్డేట్ స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 41 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల లాభాలతో గట్టెక్కాయి. ఒక దశలో 230 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 41 పాయింట్ల లాభంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. గ్రీస్ రుణ సంక్షోభ సంప్రదింపుల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. కాగా స్టాక్ మార్కెట్ లాభపడడం ఇది వరుసగా ఐదో రోజు. బడ్జెట్‌పైనే దృష్టి టోకు ధరల సూచీ జనవరిలో ప్రతికూలంగా నమోదు కావడంతో వడ్డీరేట్లు తగ్గుతాయని, వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్ రానున్నదనే అంచనాలు ఒకదశలో స్టాక్ సూచీలు పెరగడానికి దోహదపడ్డాయి. సెన్సెక్స్ 29,171 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రమేపీ 29,325 పాయింట్లకు ఎగసింది. చివరకు 41 పాయింట్ల లాభంతో 29,136 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌కు రెండు వారాల గరిష్ట స్థాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 908 పాయింట్లు లాభపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్ధిక ఫలితాలు దాదాపు ముగియడంతో ఇక అందరి దృష్టి బడ్జెట్‌పైననే ఉందని నిపుణులంటున్నారు. 30 షేర్ల సెన్సెక్స్‌లో 16 షేర్లు లాభాల బాట పట్టగా, 14 షేర్లు నష్టపోయాయి. మొత్తం 1,595 షేర్లు నష్టాల పాలవ్వగా, 1,315 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,550 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,229 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,18,483 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.183 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.281 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఆసియా మార్కెట్లన్నీ దాదాపు లాభాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. నేడు మార్కెట్‌కు సెలవు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు. -
సెన్సెక్స్ 271 పాయింట్ల ర్యాలీ
⇒ రష్యా,ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ⇒ 8,700 పాయింట్లు దాటేసిన నిఫ్టీ మార్కెట్ అప్డేట్ రష్యా, ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల జోరు కారణంగా స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లోనే ముగిశాయి. ఢిల్లీలో ఓడిపోవడం వల్ల సంస్కరణల వేగాన్ని తగ్గించబోమని ఆరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం, స్వీడన్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం కూడా ప్రభావం చూపాయి. మొత్తం మీద బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడి 28,805 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 8,712 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ రంగం మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్తు, ఐటీ, రంగాల షేర్ల నేతృత్వంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. 400 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ 28,650 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 400 పాయింట్ల రేంజ్లో కదలాడింది. 29,839-28,406 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య ట్రేడైన సెన్సెక్స్ చివరకు 271 పాయింట్ల లాభంతో 28,805 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 578పాయింట్లు లాభపడింది. మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడనున్న పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ద్రవ్యోల్బణం గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో కొనుగోళ్ల జోరు పెరిగిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. 30 షేర్ల సెన్సెక్స్‌లో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 5.4%, భెల్ 4.9%, సిప్లా 4%, గెయిల్ ఇండియా 3.2%, మారుతీ సుజుకీ 2.5%, సెసా స్టెరిలైట్ 2%, ఎల్ అండ్ టీ 2%, టాటా పవర్ 1.9%, హీరో మోటొకార్ప్ 1.9%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.8%, యాక్సిస్ బ్యాంక్ 1.6%, ఎన్టీపీసీ 1.6%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.3%, ఇన్ఫోసిస్ 1.2%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1%, విప్రో 1% చొప్పున పెరిగాయి. -
బడ్జెట్ ఆశలతో పెరిగిన మార్కెట్
సెన్సెక్స్ లాభం 178 పాయింట్లు 8,600 దాటిన నిఫ్టీ మార్కెట్ అప్డేట్ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తుందన్న అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్లు మరింత పుంజుకున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై, చివరి వరకూ లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ 8,600 పాయింట్లను దాటేసింది. 28,450 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 28,619-28,424 గరిష్ట-కనిష్ట పాయింట్ల మధ్య కదలాడి చివరకు 178 పాయింట్లు లాభపడి 28,534 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 8,627 పాయింట్ల వద్ద ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, లోహ, విద్యుత్తు, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు లాభాల బాటలోనే కొనసాగాయి. గురువారం పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు ఆచి తూచి వ్యవహరించారని, అందుచేత పెరుగుదల స్వల్పంగానే ఉందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. బడ్జెట్ ర్యాలీ! కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌పైననే ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణల జోరును ఈ బడ్జెట్ సూచిస్తుందని వారు భావిస్తున్నారు. 1990 ఆర్థిక సంస్కరణల అనంతరం స్టాక్ మార్కెట్‌కు ఈ బడ్జెట్ కీలకం కానున్నదని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో వెల్లడించింది. బడ్జెట్లో సంస్కరణలు తప్పనిసరిగా చోటు కల్పించాలనే సంకేతం ఆప్ విజయం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వానికి అందిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్ జిగ్నేశ్ చౌధురి చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ గత కొన్ని సెషన్లలో 1,500 పాయింట్ల వరకూ నష్టపోయిందని, బడ్జెట్ ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని డైమన్షన్స్ కన్సల్టింగ్‌కు చెందిన అజయ్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. -
ఏడు రోజుల నష్టాలకు బ్రేక్
- సెన్సెక్స్ 600 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులు - చివరకు లాభం 128 పాయింట్లు - 8,550 దాటిన నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఏడు ట్రేడింగ్ సెషన్ల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఢిల్లీలో బీజేపీ పరాజయాన్ని ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ చేసుకోవడంతో మార్కెట్లు పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. మంగళవారం ఆద్యంతం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కదలాడాయి. బ్యాంక్, లోహ షేర్ల కారణంగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లపైనే ఎగసింది. 28,122 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ 28,634- 28,044 పాయింట్ల గరిష్ట- కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 128 పాయింట్ల లాభంతో 28,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 8,565 పాయింట్ల వద్ద ముగిసింది. గ్రీక్ రుణ సంప్రదింపులు, ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ప్రభావం చూపాయని ట్రేడర్లంటున్నారు. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,454 పాయింట్లు (4.9 శాతం) నష్టపోయింది. ఇక బడ్జెట్‌పై దృష్టి : జీడీపీ గణాంకాలతో మార్కెట్లు ముందుక దూసుకుపోయాయని, కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం కారణం గా కుదేలయ్యాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మా ంగ్లిక్ చెప్పారు. స్టాక్ మార్కెట్ల తదుపరి దృష్టి బడ్జెట్‌పైననే అని అంబిట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సీఈఓ హొలండ్ పేర్కొన్నారు. బ్యాంక్ షేర్ల జోరు : కొత్త గణాంకాల కారణంగా జీడీపీ 7 శాతానికి పైగా వృద్ధి చెందడం బ్యాంక్ షేర్లు పెరగడానికి కారణమైంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్యాంక్ షేర్ ధరలు పెరిగాయి. -
ఆరో సెషన్లోనూ అధోముఖంగానే
* 8,700 దిగువకు నిఫ్టీ * సెన్సెక్స్ నష్టం 133 పాయింట్లు * ప్రభావం చూపిన ముడి చమురు పెరుగుదల మార్కెట్ అప్డేట్ బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాల పాలయ్యాయి. విదేశీ నిధులు వస్తున్నప్పటికీ, అంతర్జాతీయ సంకేతాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నదని, ఢిల్లీ ఎన్నికల అంశం కూడా ప్రభావం చూపిందని ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగాల నివేదిక వెలువడనున్న నేపధ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, జర్మనీ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండడం, యూరోజోన్‌లో గ్రీస్ భవితవ్యంపై ఆందోళనల కారణంగా యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం ప్రభావం చూపాయి. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన లిబియాలో మరింత అశాంతి ప్రజ్వరిల్లనున్నదనే నివేదికలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ పెరగడం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమైంది. శుక్రవారం కూడా లాభాల స్వీకరణ కొనసాగింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు పెరగ్గా, వాహన,బ్యాంక్, చమురు, గ్యాస్, విద్యుత్తు, ఆరోగ్య సంరక్షణ, కన్సూమర్ డ్యూరబుల్స్, కొన్ని లోహ షేర్లు స్టాక్‌మార్కెట్‌ను పడగొట్టాయి. శుక్రవారం సెన్సెక్స్ 133 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల చొప్పున క్షీణించాయి. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువన 8,661 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లకు ఇది రెండు నెలల్లో అధ్వాన్న వారం. ఢిల్లీ ఎన్నికల ప్రభావం ! బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలకు తోడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఊహాగానాలు స్టాక్ మార్కెట్లను పడగొట్టాయని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. జీడీపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు వచ్చేవారం వెలువడనున్నందున ఇన్వెస్టర్లు ఆచి, తూచి అడుగులేస్తున్నారని నిపుణులంటున్నారు. శనివారం పోలింగ్ జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, ఆ ప్రభావం సంస్కరణలపై ఉంటుందనే ఆందోళన ట్రేడర్లలో నెలకొన్నదని నిపుణులంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం మార్కెట్లపై స్వల్పకాలమే ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నివేదిక పేర్కొంది. ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అంచనాలను ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ చేశాయని భారత్ భూషణ్ ఈక్విటీస్‌కు చెందిన విజయ్ భూషణ్ వ్యాఖ్యానించారు. 28, 892 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ప్రారంభ కొనుగోళ్ల కారణంగా 28,923 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత 28,647 కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 133 పాయింట్లు నష్టపోయి 28,718 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 465 పాయింట్లు నష్టపోయింది. గత ఏడాది డిసెంబర్ 12తో ముగిసిన వారానికి సెన్సెక్స్ 1,107 పాయింట్లు నష్టపోయింది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అతి పెద్ద వారాంత క్షీణత. ఇక వరుసగా ఆరు సెషన్లలో సెన్సెక్స్ 964 పాయింట్లు నష్టపోయింది. 5 శాతం క్షీణించిన టాటా మోటార్స్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు బాగా లేకపోవడంతో టాటా మోటార్స్ షేర్ 5 శాతం వరకూ క్షీణించింది. సెన్సెక్స్‌లో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే.