దేశీయ స్టాక్‌మార్కెట్‌లో సరికొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. సోమవారం స్టాక్‌మార్కెట్‌లు ముగిసే సమయానికి నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్‌టైం హైకి చేరుకుని లాభాలతో ముగించాయి.
అంతర్జాతీయ సానుకూల అంశాలు, ఐటీ, ఆటోమొబైల్ షేర్ల కొనుగోలు, రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు కొనసాగింపుగా పెట్టుబడి దారులు మళ్లీ ఆశాజనకంగా మారడంతో బ్యాంక్ నిఫ్టీ తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 494 పాయింట్లు లాభంతో 74,742 వద్ద ముగియగా, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 22,666 వద్ద ముగిసింది.
ఎథేర్ మోటార్స్,మారుతి సుజికీ, ఎం అండ్ ఎం,ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్,నెస్లే, అపోలో హాస్పిటల్,విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment