న్యూఢిల్లీ: డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్.. విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఆరు పథకాల్లోకి తాజా పెట్టుబడులు స్వీకరించడం లేదని ప్రకటించింది. డీఎస్‌పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, డీఎస్‌పీ గ్లోబల్ అలోకేషన్ ఫండ్, డీఎస్‌పీ వరల్డ్ గోల్డ్ ఫండ్, డీఎస్‌పీ వరల్డ్ మైనింగ్ ఫండ్, డీఎస్‌పీ వరల్డ్ అగ్రికల్చర్ ఫండ్, డీఎస్‌పీ వరల్డ్ ఎనర్జీ ఫండ్ పథకాలకు ఈ నిర్ణయం అమలవుతుంది.
విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలకు తాజా సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవద్దంటూ సెబీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు 7 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు) మించకూడదని సెబీ లోగడే పరిమితి విధించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విలువ ఈ పరిమితి దాటిపోవడంతో తాజా సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవడం నిలిపివేయాలని సెబీ ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి 2 నుంచి అన్ని కొనుగోళ్లు.. స్విచ్ ఇన్, న్యూసిప్/ఎస్‌టీపీ/డీటీపీ రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు ఆమోదించడం లేదని డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ ప్రకటన జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment