
ముంబై: రిటైల్ రంగంలోని ఉద్యోగ సిబ్బందిలో దాదాపు 20– 25 శాతం మందికి వచ్చే ఐదేళ్లలో కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయి. ఫిక్కీ–నాస్కామ్, ఈవై సంయుక్త నివేదిక ప్రకారం.. గరిష్ఠంగా వినియోగించుకునేలా ఏర్పాటవుతున్న సరఫరా చైన్లు వచ్చే ఐదేళ్లలో రిటైల్ రంగంలో వృద్ధికి దోహదపడనున్నాయి. ఇది 95 శాతం మంది పరిశ్రమ నిపుణుల అభిప్రాయం కాగా... మధ్యతరగతి వర్గం పెరగటం, వ్యాపార ఆవిష్కరణలు వృద్ధికి కారణంగా నిలుస్తాయని 76 శాతం మంది నిపుణులు చెప్పారు.
‘ఈ–కామర్స్, మొబైల్ ఆధారిత ఈ–టెయిలింగ్ వంటి కొత్త బిజినెస్ మోడళ్లు టైర్–1, టైర్–2, టైర్–3 పట్టణాల్లో పాపులర్ అయ్యాయి. ఈ వృద్ధి ప్రభావం ఇప్పటికే జాబ్ మార్కెట్‌పై కనిపిస్తోంది’ అని ఈవైకు చెందిన అనురాగ్ మాలిక్ తెలిపారు. ఈ–కామర్స్ సంస్థలు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, వెబ్ అండ్ యాప్ డిజైన్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, కస్టమర్ సర్వీస్, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్ వంటి వాటిల్లో కొత్త ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment