నైపుణ్యాల పెంపునకు రూ.1,000 కోట్లు
శివగంగ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది యువజనులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి గాను ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇక్కడకు సమీపంలోని అమరావతిపుత్తూర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ విషయం చెప్పారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మొత్తం విద్యార్ధుల్లో 15 శాతం మంది మాత్రమే తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొని విదేశాల్లో ఉద్యోగాలు పొందగలుగుతున్నారని చిదంబరం పేర్కొన్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.