లోక్‌సభ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలోమాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ కీలక ప్రకటన చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోల తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే తన స్థానంలో హసన్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా తన మనవడు ప్రజ్వాల్ రెవన్నాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దేవెగౌడ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన మనవడు ప్రజ్వల్, కుమారుడు రేవణ్ణ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తమ అభిమాన నాయకున్ని అలా చూసిన జేడిఎస్ నేతలు, కార్యకర్తలు కూడా కంటనీరు పెట్టుకున్నారు.