
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు : పన్ను ఎగవేత కేసులో కర్నాటకకు వ్యాపారవేత్తకు ఊహించని షాక్ తగిలింది. రూ .7.35 కోట్లను ఆదాయపు పన్ను బకాయిల ఎగవేత కేసులో ఆదాయపన్ను శాఖ అధికారులు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించింది.
ఆదాయ పన్ను బకాయిలపై ఎన్ని రిమైండర్లు పంపించినా స్పందించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు వ్యాపారవేత్తను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఆరునెలల జైలు విధించి, సిటీ సెంట్రల్ జైలుకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తూమకూరుకు చెందిన వ్యాపారి అన్న సమాచారం మినహా, అతని పేరును, వ్యాపార వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.