![Police Constable Harassing Minor At Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/30/constable-pawan.jpg.webp?itok=PJ85r0Xg)
బనశంకరి: ఓ పోలీసు సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాల్సిన పోలీస్.. కామంతో చిన్నారిని కాటేశాడు. బైక్‌పై డ్రాప్ ఇస్తానని చెప్పి మైనర్(17)ను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. గోవిందరాజనగర పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పవన్(24) దారుణానికి ఒడిగట్టాడు. చామరాజనగర ప్రాంతానికి చెందిన అమ్మాయి.. ఓ యువకునితో ప్రేమలో పడి, ఇంటిని వదిలిపెట్టి అతడి కోసం వెళ్లింది. ఈ క్రమంలో బెంగళూరుకు చేరుకుని 27వ తేదీన ఒక పార్కు వద్ద కూర్చుంది. కాగా, అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పవన్.. ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా చామరాజనగరకు వెళ్లాలని చెప్పింది. సరేనంటూ బాధితురాలిని తాను.. తీసుకువెళ్తానని నమ్మించి తన అద్దె ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తరువాత చామరాజనగరకు బస్‌లో ఎక్కించి పంపించాడు.
అనంతరం ఇంటికి వెళ్లిన బాధితురాలు.. తన కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధితులు బెంగళూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: ర్యాగింగ్ పేరుతో అర్ధరాత్రి హాస్టల్ రూమ్‌లో సీనియర్ల అరాచకం.. ఇలా కూడా చేస్తారా?
Comments
Please login to add a commentAdd a comment