ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కేజీఎఫ్(కర్ణాటక): కంప్యూటర్ సెంటర్ యజమాని హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన రాజేంద్ర ప్రసాద్, మేల్విన్‌లు నిందితులు. కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ వద్ద రాజేంద్రప్రసాద్ ప్రియురాలు పనిచేసేది.
ఆమెపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని ముకుందన్ వేధించసాగాడు. దీంతో ఆమె పని వదిలేసినప్పటికీ అతడు ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేయసి సలహాతో మేల్విన్‌తో కలిసి రాజేంద్ర ప్రసాద్ ముకుందన్‌ను ఏప్రిల్ 28న హత్య చేశాడు. అండర్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది.
చదవండి: ఫేస్‌బుక్ పరిచయం.. నగ్నంగా వీడియో కాల్.. కట్ చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment