సాక్షి, బెంగళూరు: రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నియమాలు సడలించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శనివారం ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. రాష్ట్రంలో 5% శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటున్న 16 జిల్లాల్లో మాల్స్, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, స్పా, సెలూన్లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులను 50% సామర్థ్యంతో సాయంత్రం 5 గంటల వరకు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బస్సులు, మెట్రో రైళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి.ఈ సడలింపులు ఈనెల 21 నుంచి అమలులోనికి రానున్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,783 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అదే సమయంలో 168 మంది మృత్యువాత పడ్డారు. 15,290 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,96,121కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 26,25,447మంది కోలుకున్నారు. 33,602 మంది మరణించారు. ప్రస్తుతం 1,37,050 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment