ఫ్యాన్సీ స్టోర్‌లో చొరబడి.. కత్తులతో పొడిచి మహిళ హత్య | Koluru Woman Stabbed To Death In Fancy Store | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ స్టోర్‌లో చొరబడి.. కత్తులతో పొడిచి మహిళ హత్య

Published Thu, Apr 22 2021 2:04 PM | Last Updated on Thu, Apr 22 2021 4:20 PM

Koluru Woman Stabbed To Death In Fancy Store - Sakshi

కోలారు: ఫ్యాన్సీస్టోర్‌ నిర్వాహకురాలిని దుండగులు పట్టపగలే కత్తులతో పొడిచి హత్య చేసి ఉడాయించారు. ఈఘటన  కోలారు నగరంలోని మహాలక్ష్మీ లేఅవుట్‌లో బుధవారం చోటు చేసుకుంది. కోలారు తాలూకాలోని నాగనాయకనహళ్లి గ్రామానికి చెందిన నీలవేణి (29)  మహిలక్ష్మీ లే అవుట్‌లో నివాసం ఉంటోంది. అక్కడే ఫ్యాన్సీ స్టోర్‌ నిర్వహిస్తోంది. ఆమెకు భర్త,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం ఫ్యాన్సీస్టోర్‌లోకి వచ్చిన నీలవేణి.. సామగ్రిని సర్దుకుంటుండగా దుండగులు ఒక్కసారిగా లోపలకు చొరబడ్డారు.

కత్తులతో మహిళ మెడపైనా ఇతర భాగాల్లో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నగర పోలీసులు వేలిముద్ర నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించగా ముగ్గురు దుండగులు ఫ్యాన్సీస్టోర్‌లోకి చొరబడిన దృశ్యాలు కనిపించాయి. అనంతరం మృతదేహాన్ని కోలారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి హంతకుల కోసం వేట ప్రారంభించారు.  

చదవండి: 26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement