fancy store
-
ఫ్యాన్సీ స్టోర్‌లో చొరబడి.. కత్తులతో పొడిచి మహిళ హత్య
కోలారు: ఫ్యాన్సీస్టోర్ నిర్వాహకురాలిని దుండగులు పట్టపగలే కత్తులతో పొడిచి హత్య చేసి ఉడాయించారు. ఈఘటన కోలారు నగరంలోని మహాలక్ష్మీ లేఅవుట్లో బుధవారం చోటు చేసుకుంది. కోలారు తాలూకాలోని నాగనాయకనహళ్లి గ్రామానికి చెందిన నీలవేణి (29) మహిలక్ష్మీ లే అవుట్లో నివాసం ఉంటోంది. అక్కడే ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం ఫ్యాన్సీస్టోర్‌లోకి వచ్చిన నీలవేణి.. సామగ్రిని సర్దుకుంటుండగా దుండగులు ఒక్కసారిగా లోపలకు చొరబడ్డారు. కత్తులతో మహిళ మెడపైనా ఇతర భాగాల్లో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నగర పోలీసులు వేలిముద్ర నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించగా ముగ్గురు దుండగులు ఫ్యాన్సీస్టోర్‌లోకి చొరబడిన దృశ్యాలు కనిపించాయి. అనంతరం మృతదేహాన్ని కోలారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి హంతకుల కోసం వేట ప్రారంభించారు. చదవండి: 26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’ -
పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు!
చెన్నై: ఫ్యాన్సీ షాపులోకి పుస్తకం కొనేందుకు వచ్చిన విద్యార్థినిని వాటేసుకుని ముద్దిచ్చిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం త్రిచూర్ సమీపానగల సావక్కాడుకు చెందిన మునీర్ (35). ఇతనికి వివాహం కాలేదు. ఇతను కోయంబత్తూరు కారమడైలోగల ఒక ఫ్యాన్సీ స్టోర్‌లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఈ దుకాణానికి అదే ప్రాంతంలోగల ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిని ఆంగ్ల పుస్తకం కొనేందుకు వచ్చింది. ఆ సమయంలో దుకాణంలో ఉన్న మునీర్ విద్యార్థినిని దుకాణం లోపలికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత హఠాత్తుగా ఆమెను వాటేసుకుని ముద్దిచ్చాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని అక్కడ్నుంచి తప్పించుకుంది. తర్వాత ఇంటికి వచ్చి తన తల్లితో చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కారమడై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం మునీర్‌ను అరెస్టు చేశారు. -
గుట్కా స్థావరాలపై విజిలెన్స్ దాడులు
– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ కర్నూలు / కల్లూరు (రూరల్) : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం.. కర్నూలు మార్కెట్ యార్డులోని ఓ ఫ్యాన్సీ స్టోర్‌పై దాడులు చేశారు. అలాగే ఎన్టీఆర్ బిల్డింగ్‌లోని గోడౌన్లపై కూడా దాడులు జరిపారు. గుట్టుచప్పుడు కాకుండా గుట్కా బాక్సులను కిరాణం అంగళ్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5.40 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిరజ్ సరిజి 80 బాక్సులు, ఆర్ఆర్ గుట్కా ప్యాకెట్లు 34, వావి గుట్కా ప్యాకెట్లు 37, హిందుస్థాన్ ఖైనీ 11 బాక్సులు, బ్లూ టొబాకో 10 ప్యాకెట్లు, ఖైనీ టొబాకో 21 ప్యాకెట్లు, హన్స్ టొబాకో 3 ప్యాకెట్లు మొత్తం రూ.5.40 లక్షల విలువ చేసే టొబాకో ఉత్పత్తులను సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారి కె. శంకర్‌కు అప్పగించారు. ప్రధాన సూత్రధారి వెంకటేష్ పరారయ్యాడు. దాడుల్లో ఎస్ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు నాగభూషణ్‌రావు, ఈశ్వర్‌రెడ్డి, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం
అనంతపురం: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. వివరాలు..పట్టణంలో మెయిన్ రోడ్లో ఉన్న ఎస్ఎన్ ఫ్యాన్సీ దుకాణంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సుమారు 80 శాతం వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని దుకాణ యజమాని తెలిపాడు.