మైసూరు: పెళ్లికి నిరాకరించిన యువతి అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించిన యువకుని ఉదంతమిది. వివరాలు.. మైసూరులో ఓ మాల్‌లో పని చేస్తున్న బాధిత యువతికి కల్యాణగిరి నివాసి మహ్మద్ వసీం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమె తల్లిని కలిసి యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తొలుత అంగీకరించని యవతి.. యువ కుని కుటుంబం ఒత్తిడికి తలొగ్గి అంగీకరించింది. నిశ్చితార్థం జరిగిన తరువాత ఇద్దరూ కలిసి తిరిగారు. ఆ సమయంలో ఆమెతో కొన్ని అశ్లీల ఫొటోలు తీశాడు.
కొన్ని రోజుల తర్వాత మహ్మద్ వసీం ప్రవర్తన నచ్చక అతనితో పెళ్లికి యువతి నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన మహ్మద్ వసీం నాతో పెళ్లికి ఒప్పుకో, లేకుంటే సన్నిహితంగా ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తూ అశ్లీల ఫోటోలను ప్రియురాలి తల్లికి పంపించాడు. వాటిని చూసిన తల్లి దిగ్భ్రాంతికి గురైన యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఎన్‌ఆర్ మొహల్లా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment