అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమాలోని బన్నీ నటన, పాటలు, డైలాగులకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఇక సమంత తొలిసారి ఆడిపాటిన ఐటమ్ సాంగ్ టాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మార్పోగిపోతుంది. సోషల్ మీడియా, ఇన్‌స్టా రీల్స్ అన్నీంటిలోనూ ‘ఊ అంటావా మావా ఊహు అంటావా మావా’ అనే పాటనే ఊపేస్తోంది. తాజాగా ఓ పెళ్లిలో వధూవరులిద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో రోనక్ షిండే, ప్రాచీ మోర్ అనే నూతన దంపతులు తమ పెళ్లి వేడుకలో ‘ఊ అంటావా మావా ఊహు అంటావా’ అంటూ డ్యాన్స్ చేశారు. సంప్రదాయ మరాఠీ పెళ్లి దుస్తులు ధరించి ఎంతో అందంగా ఎనర్జిటిక్‌గా స్టెప్పులేశారు. వీరిద్దరితోపాటు చుట్టూ బంధువులు కూడా డ్యాన్స్ చేసినప్పటికీ అందరిలోనూ వధువు డ్యాన్స్ స్టెప్స్ నెటిజన్లను బాగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఇప్పటి వరకు రెండు మిలియన్లకు పైగా వ్యూవ్స్ సంపాదించింది. వధువు డ్యాన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో మంచెత్తుతున్నారు. క్యూట్ కపూల్, క్రేజీ, లవ్లీ స్టెప్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి..
చదవండి: ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా
Comments
Please login to add a commentAdd a comment