Madnur
-
పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు
సాక్షి, కామారెడ్డి: పెళ్లి రిసెప్షన్లో కొందరు యువకుడు వీరంగం సృష్టించారు. తుపాకీలు, కత్తులు చేతపట్టి డ్యాన్స్ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 10వ తేదీ రాత్రి మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కొడుకుతోపాటు మరికొందరు యువకులు తల్వార్, గన్లతో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వీడియోలను కొందరు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వరుడితోపాటు స్నేహితులనుఅదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
వివాహేతర సంబంధం; పక్కా ప్లాన్.. గుంత తవ్వించి, అందులోనే పూడ్చి..
సాక్షి, మద్నూర్(నిజామాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్య చేసి హతుడు తవ్విన గుంతలోనే పూడ్చి పెట్టారు. మండలంలోని పెద్ద ఎక్లారలో ఫిరంగి సాయిలు(35) అనే వ్యక్తిని డిసెంబర్లో అంతమొందించిన విషయం తెలిసిందే. డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఎస్సై శివకుమార్ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన స్థలాన్ని సోమవారం పరిశీలించారు. కూలీలతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చెందిన సాయిలుకు, పెద్ద ఎక్లారకు చెందిన రుక్మిణితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రుక్మిణి తల్లి, తండ్రి మృతి చెందడంతో సాయిలు తన భార్యతో కలిసి అత్తగారి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అయితే రుక్మిణికి అదే గ్రామానికి చెందిన మొగులాజీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సాయిలు హత్య చేయాలని రుక్మిణి, మొగులాజీ భావించారు. గుంత తవ్వాలని కూలీకి పిలిచి.. సాయిలు హత్యకు పథకం వేసిన మొగులాజీ తన పొలంలో గుంత తవ్వాలని డిసెంబర్ 25న కూలీకి పిలిచాడు. పొలానికి వచ్చేటప్పుడు దొడ్డు ఉప్పు సంచులు తేవాలని చెప్పాడు. దీంతో సాయిలు ఉప్పు సంచులు తీసుకొని వెళ్లాడు. పొలంలో కరెంట్ స్తంభం కోసం అని చెప్పి సాయిలు చేత గుంత తవ్వించారు. గుంత తవ్విన అనంతరం సాయిలు మొగులాజీ, అదే గ్రామానికి చెందిన విఠల్ కలిసి అక్కడే మద్యం తాగారు. అనంతరం విఠల్, మొగులాజీ సాయిలును హత్య చేసి ఆ గుంతలో పాతిపెట్టారు. మృతదేహం వాసన రాకుండా సాయిలు తెచ్చిన ఉప్పును శవంపై చల్లి పూడ్చిపెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా ఎవరి ఇంటికి వారు వెళ్లి పోయారు. చదవండి: జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి ఇలా బయట పడింది.. సాయిలు గ్రామంలో ఎవరికి ఎక్కువగా పరిచయం లేకపోవడంతో సాయిలు గురించి ఆరా తీయలేదు. దీంతో ఆయన చనిపోయిన విషయం బయట పడలేదు. అయితే నిందితులు మొగులాజీ, విఠల్ మధ్య నాలుగు రోజుల క్రితం గొడవ జరిగింది. విఠల్ మద్యం తాగడానికి మొగులాజీని డబ్బులు అడగ్గా.. ఇవ్వలేదు. దీంతో ఆవేశంలో విఠల్ హత్య విషయం బయట పెట్టాడు. కాగా నిందితుల్లో ఒకరైన విఠల్ వరుసకు రుక్మిణికి తమ్ముడు అవుతాడు. సాయిలు ను ఎలా చంపారో పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై పేర్కొన్నారు. రుక్మిణి, మొగులాజీ, విఠల్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. -
పత్తి బంగారం.. క్వింటాకు రూ.9,100.. ఏ మార్కెట్లో అంటే?
సాక్షి, ఖమ్మం వ్యవసాయం/మద్నూర్(జుక్కల్): ఖమ్మం, మద్నూరు మార్కెట్లలో గురువారం పత్తికి రికార్డు ధర పలికింది. ఖమ్మం వ్యవ సాయ మార్కెట్లో మంగళ, బుధవారాల్లో క్వింటా రూ.9 వేలుగా పలికిన ధర గురువారం రూ.9,100గా నమోదైంది. మోడల్ ధర రూ.9 వేలు, కనిష్ట ధర రూ.8వేలుగా నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్లో పత్తి క్వింటాకు రూ.9,050 ధర లభించింది. చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు -
చెట్టెక్కింది..పక్షి పిల్లలను మింగేసింది
సాక్షి, మద్నూర్(నిజామాబాద్) : మద్నూర్ మండల కేంద్రంలో ఓ పాము చెట్టెక్కి హంగామా చేసింది.. చెట్టుపై ఉన్న గూట్లోకి వెళ్లి పక్షి పిల్లలను తినేసింది. శనివారం మధ్యాహ్నం మండల కేంద్రంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన మెల్లగా చెట్టు ఎక్కిన పాము పక్షి గూడు వద్దకు చేరుకుని తాపీగా పక్షి పిల్లలను మింగేసింది. అనంతరం మెల్లగా చెట్టు దిగి వెళ్లిపోయింది. దీంతో రోడ్డు పక్కనే చెట్టు ఉండడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు అక్కడే నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది. -
అన్యాయంగా కేసులు పెట్టారు
సాక్షి, మద్నూర్ (కామారెడ్డి): సోమూర్‌కు చెందిన పలువురిపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని ఆ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సోమూర్‌కు చెందిన 30 మంది మహిళలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం ట్రాన్స్‌కో సిబ్బంది గ్రామానికి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. విద్యుత్ మీటర్ల తనిఖీల పేరిట ఇళ్లలోకి విద్యుత్ అధికారులు చొరబడ్డారని ఆరోపించారు. రెండున్నర రోజుల పాటు గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. ట్రాన్స్‌కో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గ్రామస్తులపైనే కేసులు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా, బుధవారం గ్రామానికి చెందిన పలువురి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. దురుసుగా ప్రవర్తించారు బుధవారం 50 మంది ట్రాన్స్‌కో అధికారుల బృందం సోమూర్‌కు చేరుకొని ఇండ్లలో ఉన్న విద్యుత్ మీటర్లను ఇంటి బయట బిగిస్తామని దౌర్జన్యం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలో తోపులాట జరిగిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్సై వెంకట్రావ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని సందర్శించిన డీఎస్పీ బాన్సువాడ డీఎస్పీ యాదగిరి బుధవారం సోమూర్ గ్రామాన్ని సందర్శించారు. ఐదు రోజుల క్రితం గ్రామంలో ట్రాన్స్‌కో అధికారులపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఆటోకు నిప్పంటించి.. ఆపై హత్య
మద్నూర్ : మండలంలోని సలాబత్పూర్ శివారులోని వాణిజ్య పన్నుల శాఖ చెకుపోస్టు సమీపంలో శుక్రవారం మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన గుడిమెవార్ ప్రకాశ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యూడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి సరిహద్దులో ఉన్న మహరాష్ట్రలోని దేగ్లూర్ పట్టణానికి చెందిన ప్రకాశ్ అదే పట్టణానికి చెందిన సిద్ధేశ్వర్‌తో కలిసి ఆటోలో సలాబత్‌పూర్‌కు వచ్చారు. ఇద్దరు కలిసి సలాబాత్పూర్ మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగింది. తాగిన మైకంలో ఉన్న ప్రకాశ్‌ను సిద్ధేశ్వర్ ఆటోలో కుర్చోబెట్టి నిప్పంటించాడు. ప్రకాశ్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ప్రకాశ్ తలపై బండరాయి కొట్టి హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆటో కాలిపోతుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని సీఐ సర్ధార్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలం వద్ద పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా నిందితుడు సిద్ధేశ్వర్ మహరాష్ట్రలోని దేగ్లూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. -
పాటిస్తే మెళకువలు..పత్తిలో లాభాలు
మద్నూర్: జిల్లాలో ఈ ఏడాది యాభై వేల ఎకరాలలో పత్తి సాగైంది. ప్రస్తుతం చేతికందే దశలో ఉంది. ఈ సారి ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎకరాని కి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 3 నుంచి 4 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వ మద్ద తు ధర రూ.4050 ప్రకటించినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడం రైతులను ఆవేదన కలిగిస్తోంది. పత్తిలో తేమశాతం 8 ఉంటే ఈ ధర లభిస్తుంది. ఆపైన వచ్చిన ఒక శాతానికి రూ.40.50 పైసల చొప్పున కోత విధిస్తోంది. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రస్తుతం పత్తి కొనుగోలు చేస్తోంది. 12 శాతంలోపు వచ్చిన పత్తిని మాత్రమే వారు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ గా వచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకు ని రూ. 200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నా రు. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎం డ అధికంగా ఉన్నప్పుడు పత్తి తీయెద్దు. ఆ సమయంలో ఎండుటాకులు, వ్యర్థ పదార్థాలు విరిగి పత్తిలో కలుస్తాయి. పొద్దున, సాయత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడే మాత్రమే తీయా లి. పత్తిని తీసేటప్పుడు అది పొడిగా ఉండాలి. వర్షం పడిన తర్వాత తీయొద్దు. పంటకు దిగుబడి బాగా రావాలంటే పత్తి తీయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు (8886613150) సూచిస్తున్నారు. జాగ్రత్తలు పంట కాలంలో కనీసం మూడు నాలుగు సార్లు పత్తిని తీస్తారు. పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే కాయల నుంచి పత్తిని ఏరాలి. ఏరిన తర్వాత మట్టిలో కుప్పలుగా పోయరాదు. పత్తిలో దుమ్ము ధూళీ, ఎరువులు,పురుగుల మందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం, చీడపీడల వల్ల పాడైన పత్తిని వేరుచేయాలి. దీన్ని మంచి పత్తిలో కలప కూడదు. మొదట మొక్కల కింద భాగం కాయల నుంచి తీయాలి. ఎందుకంటే ముందుగా పైభాగంలోని కాయల నుంచి తీస్తే కింది కాయల పత్తిలో చెత్తపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది.కాబట్టి దాన్ని ప్రత్కేకంగా అమ్ముకోవాలి. పంట చివరికి వచ్చేసరికి మొక్కలో, నేలలోనూ పోషకాలు తగ్గడంతో పత్తి నాణ్యత లోపిస్తుంది. నిల్వ చేయాల్సిన పత్తిలో 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే లోపల వేడి పెరిగి విత్తనంతో పాటు దూదిని కూడా పాడుచేస్తుంది. పత్తి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే పత్తి రంగుమారి నాణ్యత తగ్గుతుంది. పత్తిని వీలైనంత వరకు గదుల్లో గానీ, షెడ్లలో గానీ సిమెంట్ నేలమీద గానీ పరచాలి.పత్తి పూర్తిగా ఆరిన తర్వాతనే బోరాల్లో నింపి పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఆరిన తర్వాతే తీయాలి వర్షానికి తడిసిన, మంచుబిందువులతో చల్లబడిని పత్తిని ఆరిన తర్వాతే సేకరించాలి. గింజ, దూదిపింజల్లో తేమశాతం లేదని నిర్దారణకు వచ్చిన తర్వాత తీయాలి. ఎక్కువ మంది రైతులు మంచులోనే పత్తిని సేకరిస్తారు. వర్షానికి తడిసిన పత్తిని మాత్రం ఎండకాసే సమయంలో, మంచు నీరు లేని సమయంలో తీయాలి. ఎక్కువ రోజులు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. అలాంటి పత్తిని సేకరించిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన పత్తిని మూడు గంటలకోసారి తిరిగేయాలి. తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే బోరే(సంచు)ల్లో నింపాలి. కొద్దిపాటి తడిసిన పత్తిలో ఎటువంటి నాణ్యత లోపాలు ఉండవు. తడిసిన పత్తిని ఆరబెట్టిన తర్వాత టార్పాలిన్ కవర్ కప్పేటప్పుడు పూర్తిగా కాకుండా గాలి తాకే విధంగా ఉండాలి. ఆవిరి వచ్చి తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. -
‘మధ్యాహ్న’ వంట.. అప్పుల మంట
మద్నూర్: మధ్యాహ్నం భోజనం పెట్టినందుకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం విడుదల చేసే సొమ్ము ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో మధ్యాహ్నం భోజనం పెట్టాలంటే తంటాలు పడాల్సి వస్తోందంటున్నారు. రెండులక్షల మందికి ‘భోజనం’ జిల్లాలోని 36 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు సుమారు రెండు వేలకు పైగానే ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో రోజూ దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండనక, వాననక ఏజెన్సీలు మధ్యాహ్నం భోజనం వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. పలు పాఠశాలల్లో కనీసం వంటశాలలు కూడా లేవు. అలాంటి చోట్ల చెట్లు, పాఠశాలల చూర్ల కిందే భోజనం తయారు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.5కు పౌష్టికాహారం సాధ్యమా..! విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం కేటాయించే నిధులు దారుణంగా ఉన్నాయి. బజారుకు వెళ్లి రూ. 5 చెల్లిస్తే చాయ్ కూడా ఇవ్వడం లేదు. ఇదే డబ్బుతో ఒక్కో విద్యార్థికి ఒకపూట పౌష్టికాహారం ఎలా అందించాలని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిందేనని హుకూం జారీచేసే అధికారులు కనీసం ఆలోచించాలని నిర్వాహకులు కోరుతున్నారు. సాధారణ భోజనమైతే ఎలాగోలా పెట్టేవాళ్లమని, మెనూ ప్రకారం గుడ్లు, ఇతర ప్రత్యేక ఆహార పదార్థాలు అందించడం ఎలా సాధ్యమని ఏజెన్సీ మహిళలు ప్రశ్నిస్తున్నారు. నిధులు గుడ్డుకే సరిపోవు..! ప్రస్తుతం పాఠశాలలో ఒకటి నుంచి ఐదోతరగతి విద్యార్థులకు 100గ్రాముల బియ్యం, వంటకు అవసరమైన రూ. 4.35 చెల్లిస్తారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు 150గ్రాముల బియ్యంతో పాటు రూ.6 చొప్పున కేటాయిస్తారు. నిబంధనల ప్రకారం రోజూ అన్నం, సాంబారు లేదా కూరతో భోజనం తప్పనిసరిగా అందించాలి. సోమ, గురువారాల్లో అదనంగా కోడిగుడ్డుతో కూడిన భోజనం పెట్టాలి. పెరిగిన ధరలతో సర్కారు చెల్లించే సొమ్ముతో కోడిగుడ్డే రావడం లేదు. ఇలాగైతే మిగిలిన సరుకులకు సొమ్ము ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులే మిగులుతున్నాయ్ మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు బియ్యం తప్ప మరే సరుకు అందివ్వరు. వంటకు అవసరమైన నూనెలు, పప్పులు, ఉప్పులు, కూరగాయాలు, వంటచెరుకు..ప్రతీది ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేయాలి. రెండు నెలల తర్వాతే నిర్వాహకులకు బిల్లులు అందుతున్నాయి. ముందు పెట్టుబడులు పెడితే ఆ తర్వాత సర్కా రు నిధులు మంజూరు చేస్తోంది. దీంతో అప్పు చేసి మరీ భోజనం పెడుతున్నారు. సకాలంలో బిల్లులు అందక తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరి గిపోతున్నాయి. ‘ఉపాధి హామీ’ నయం ఉపాధిహామీ పథకం ద్వారా రోజుకు రూ.120 వరకు గిట్టుబాటవుతుంది. 25రోజులకు రూ. 3 వేల వరకు లభిస్తుంది. మధ్యాహ్నంభోజనం వండి వడ్డిస్తే రూ. రెండు వేలే ఇస్తున్నారు. అంటే రోజు కూలి రూ.66 మాత్రమే.