మద్నూర్ : మండలంలోని సలాబత్‌పూర్ శివారులోని వాణిజ్య పన్నుల శాఖ చెకుపోస్టు సమీపంలో శుక్రవారం మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన గుడిమెవార్ ప్రకాశ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యూడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి సరిహద్దులో ఉన్న మహరాష్ట్రలోని దేగ్లూర్ పట్టణానికి చెందిన ప్రకాశ్ అదే పట్టణానికి చెందిన సిద్ధేశ్వర్‌తో కలిసి ఆటోలో సలాబత్‌పూర్‌కు వచ్చారు. ఇద్దరు కలిసి సలాబాత్‌పూర్ మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగింది.
తాగిన మైకంలో ఉన్న ప్రకాశ్‌ను సిద్ధేశ్వర్ ఆటోలో కుర్చోబెట్టి నిప్పంటించాడు. ప్రకాశ్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ప్రకాశ్ తలపై బండరాయి కొట్టి హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆటో కాలిపోతుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని సీఐ సర్ధార్ సింగ్ తెలిపారు.
ఘటనా స్థలం వద్ద పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా నిందితుడు సిద్ధేశ్వర్ మహరాష్ట్రలోని దేగ్లూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.
ఆటోకు నిప్పంటించి.. ఆపై హత్య
Published Sat, May 30 2015 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement