Tata AIA Life
-
టాటా ఏఐఏ నుంచి కొత్త పెన్షన్ ప్లాన్
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (TATA AIA) స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది కొత్త తరం పదవీ విరమణ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వినూత్న యూనిట్-లింక్డ్ పెన్షన్ ప్లాన్ (ULIP). ద్వితీయ ఆదాయ మార్గాలను సృష్టించడం నుండి పదవీ విరమణ పొదుపులను పొందడం వరకు ఈ ప్లాన్ ఆర్థిక భద్రత, స్వాతంత్య్రాన్ని కోరుకునే డిజిటల్ వినియోగదారులు, ఆధునిక ప్రొఫెషనల్స్ ఆకాంక్షలను తీరుస్తుంది.ప్లాన్ ఫీచర్స్• ముందస్తు పదవీ విరమణ ప్రణాళిక: 45 సంవత్సరాల వయస్సు నుండే పదవీ విరమణ చేయడానికి పూర్తి సౌలభ్యం.• మార్కెట్-లింక్డ్ రిటర్న్స్: ఈక్విటీలో 100% నిధులను కేటాయించే ఎంపికతో వివిధ ఫండ్స్‌లో పెట్టుబడులకు అవకాశం. ఎటువంటి ఖర్చు లేకుండా ఎన్నిసార్లయినా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మారే వెసులుబాటు.• మీ మొత్తం ప్రీమియాన్ని మీకు నచ్చిన ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. ఇది మీ డబ్బు వృద్ధి చెందడానికి, కలల పదవీ విరమణకు మార్గం సుగమం చేస్తుంది.• ఆన్లైన్ కొనుగోలుతో ఫండ్ బూస్టర్లు, లాయల్టీ జోడింపులు ఉంటాయి.• ఫార్మసీ కొనుగోళ్లు, రోగనిర్ధారణ పరీక్షలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించే హెల్త్ బడ్డీ సర్వీస్. కస్టమర్ హెల్త్ సెక్యూర్ రైడర్‌ను ఎంచుకోవడం ద్వారా ఓపీడీ సేవలను కూడా ఎంచుకోవచ్చు.• పన్ను ప్రయోజనాలు: 80సీసీసీ కింద పన్ను ఆదా. మెచ్యూరిటీ సమయంలో లంప్సమ్పై 60% పన్ను రహితం.• అదనపు రక్షణ కవరేజ్: ఆపద సమయంలో కుటుంబ అవసరాలను తీర్చడానికి అంతర్నిర్మిత ప్రీమియం మినహాయింపు ఎంపిక.విభిన్న వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా టాటా ఏఐఏ ప్లాన్లను రూపొందించింది. స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ ప్లాన్‌లో స్మార్ట్ పెన్షన్ సెక్యూర్, స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ ప్లస్ అనే రెండు ఎంపికలు ఉన్నాయి. ప్లాన్ ప్రవేశ వయస్సు 35 నుండి 75 సంవత్సరాలు (చెల్లింపు వ్యవధిని బట్టి మారుతుంది). వెస్టింగ్ వయస్సు 45 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది. పాలసీ వ్యవధి 10 సంవత్సరాల నుండి గరిష్ట వెస్టింగ్ వయస్సు వరకు ఉంటుంది. -
టాటా ఏఐఏ లైఫ్ పాలసీదారులకు కొత్త పథకం
ముంబై: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన యులిప్ పాలసీదారుల కోసం ‘ఎమర్జింగ్ అపార్చునిటీస్ ఫండ్’ అనే నూతన పతకాన్ని (ఎన్ఎఫ్వో) ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మధ్య స్థాయి కంపెనీలు, భవిష్యత్తులో గణనీయమైన వృద్ధిని చూపించే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుందని ప్రకటించింది. యులిప్ హోల్డర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ కోసం ఈ నెల 30వరకు తమ ఆప్షన్ ఇచ్చుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 100 శాఖల ఏర్పాటు
ముంబై: కస్టమర్లకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దీనితో మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు మరింతగా విస్తరించినట్లవుతుందని పేర్కొంది. ఈ 100 డిజిటల్ ఆధారిత శాఖల్లో ఇప్పటికే 60 బ్రాంచీల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగతావి నవంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎండీ నవీన్ తహిలియాని వివరించారు. ఏజెన్సీ పంపిణీ వ్యవస్థ లేని 70 ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటైనట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. -
ఆరోగ్య బీమాలోకి టాటా ఏఐఏ లైఫ్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో ఉన్న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆరోగ్య బీమా పాలసీలను తిరిగి ప్రవేశ పెట్టనుంది. ఐఆర్డీఏ నుంచి ఈ ఏడాదే అనుమతి లభించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అనుమతి రాగానే పలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సౌమ్యజిత్ పట్నాయక్ తెలిపారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరుణవ ఖాన్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి నాటికి ఇతర విభాగాల్లో 7 కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తామన్నారు. ‘2014-15లో కొత్త పాలసీల ద్వారా రూ.312 కోట్ల వ్యాపారం నమోదు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నాటికే ఇది రూ.226 కోట్లను దాటింది. ఆన్లైన్లో విక్రయమవుతున్న పాలసీల వాటా 6.25 శాతముంది’ అని వివరించారు. లైఫ్ ప్లానర్లతో.. నెట్వర్కింగ్, కమ్యూనికేషన్స్ నైపుణ్యం ఆర్థిక విషయాలపట్ల లోతైన అవగాహన కలిగిన ఏజెంట్లను కంపెనీ నియమిస్తోంది. వీరిని లైఫ్ ప్లానర్లుగా అభివర్ణిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కంపెనీకి 1,000కిపైగా లైఫ్ ప్లానర్లతోపాటు 33,600 మంది ఏజెంట్లున్నారు. లైఫ్ ప్లానర్ల సంఖ్యను మరింత పెంచుతున్నామని, నియామకాల్లో ప్రైవేటు బీమా కంపెనీల్లో టాప్-5లో నిలిచామని సౌమ్యజిత్ వెల్లడించారు. పాలసీదారుల అనుభవం ఆధారంగా పరిష్కారాలను అంది స్తున్నట్టు చెప్పారు. కాగా, పాలసీల గురించి తెలుసుకోవడానికి 92% మంది ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్లో పాలసీలు తీసుకునే వారి సంఖ్య 5-6%కే పరిమితమైంది. ఈ సంఖ్య ఇప్పుడు పెరుగుతోందని కంపెనీ చెబుతోంది. -
టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్
ఇటు టర్మ్, అటు ఎండోమెంట్ ప్లాన్ల కలయికతో టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా సెక్యూర్ 7 పేరిట బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకవైపు బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు గ్యారంటీ రాబడులు కూడా అందించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. పాలసీ వ్యవధి 14 ఏళ్లు కాగా ప్రీమియం చెల్లింపు వ్యవధి ఏడేళ్లు ఉంటుందని పేర్కొంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత ఏడేళ్ల పాటు హామీపూర్వక వార్షిక రాబడులు ఇది అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 25 శాతం మొత్తాన్ని పాలసీదారుకు కంపెనీ చెల్లిస్తుంది.