దేశంలో 24 శాతం మంది మాత్రమే ఈ ఏడాది తమ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు
48 శాతం గతేడాది కన్నా తగ్గుతుందని ఆందోళన
చెందుతున్నారు... లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
దేశంలో 24 శాతం మంది మాత్రమే 2025లో తమ కుటుంబ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అదే విధంగా 48 శాతం మంది తమ సంపాదన ఈ ఏడాది 25 శాతం వరకూ లేదా అంతకన్నా ఎక్కువ తగ్గొచ్చని ఆందోళన చెందుతున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు తేలింది. ఈ సర్వేలో 16,111 మంది పాల్గొన్నారు.
సేవింగ్స్ గురించి ప్రశ్నించగా.. 27 శాతం మంది మాత్రమే ఈ ఏడాది తమ సేవింగ్స్ పెరుగుతాయని చెబితే.. 45 శాతం మంది 25 శాతం మేర తగ్గుతాయని చెప్పారు. ‘దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొనిఉన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఆయా వర్గాల వారికి ఉపశమనం కలిగించేలా తగు చర్యలు తీసుకోవాలి’ అని లోకల్ సర్కిల్స్ నివేదిక పేర్కొంది.
ప్రజల ఆదాయంలో వృద్ధి లేకపోవడం.. అలాగే ధరల పెరుగుదల వల్ల 2024లో నిత్యావసరాలుకాని వస్తువుల కొనుగోలు తగ్గిందని.. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లలో తాము ఆశించినంత వృద్ధి కనపడలేదని రిటైలర్లు పేర్కొన్నట్లు తెలిపింది. ఈ ఏడాది కూడా ధరలు మరింత పెరుగుతాయని ప్రజలు నమ్ముతున్నట్లు తన నివేదికలో తెలిపింది.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment