కృష్ణా(విజయవాడ) : తప్పు మీరు చేసి మా పొదుపు నుంచి కట్ చేస్తే ఎలా? ఉద్యోగుల సొమ్ము అప్పనంగా వాడేసిన కమిషనర్లపై కేసు పెట్టండి. లేదంటే మీరే బాధ్యత వహించండి.. అంటూ కార్పొరేషన్ ఉద్యోగులు విజయవాడ మునిసిపల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పాలక వర్గంపై తిరుగుబాటు చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సొసైటీ వార్షిక బడ్జెట్ సమావేశం హనుమాన్ పేటలోని జంధ్యాల దక్షిణామూర్తి నగరపాలక సంస్థ పాఠశాలలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది. వివరాలు.. 2012వ సంవత్సరంలో 650 మంది ఉద్యోగులు సొసైటీ నుంచి తీసుకున్న రుణ మినహాయింపు కోసం వారి జీతాల నుంచి కొంత సొమ్ము కట్ చేశారు. అయితే, కట్ చేసిన సొమ్ము రూ.2.68 కోట్లను బ్యాంక్‌కు మినహాయించలేదు. ఆ మొత్తాన్ని ఇతర పనుల కోసం వినియోగించారు. ప్రస్తుతం ఆ రూ.2.68 కోట్లకు రూ.80లక్షలు వడ్డీ అయ్యింది.
ఈ నష్టాన్ని తిరిగి ఉద్యోగుల జీతం నుంచి భర్తీ చేస్తున్నారు. ఈ అంశాన్ని సొసైటీ డెరైక్టర్ బ్రహ్మారెడ్డి బడ్జెట్ సమావేశంలో లేవనెత్తారు. వడ్డీ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. దీనిని పూడ్చుకునేందుకు ఉద్యోగుల పొదుపు సొమ్ము నుంచి మినహాయించడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ఉద్యోగుల సొమ్ము వాడుకునే అధికారం నాటి కమిషనర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రావిడెంట్ ఫండ్ మొత్తం ఎంత ఉందో తేల్చిచెప్పాలన్నారు. ఆడిట్ వ్యవహారంలోనూ మతలబు జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని మరో డెరైక్టర్ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఖర్చవుతోందని ప్రశ్నించారు.
అయితే, ఇవి అంచనాలు మాత్రమేనని ఈశ్వర్ సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఉద్యోగికి రూ.3.50 లక్షలు వ్యక్తిగత రుణాన్ని అందించనున్నట్లు ఈశ్వర్ స్పష్టంచేశారు. గతంతో పోలిస్తే లక్ష రూపాయల మేర రుణ పరపతి పెరుగుతోందన్నారు. పొదుపు మొత్తాన్ని నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు పెంచాలన్న పాలకపక్షం ప్రతిపాదనను కొందరు సభ్యులు వ్యతిరేకించారు. బడ్జెట్ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇద్దరు డెరైక్టర్లతో పాటు పలువురు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాలకవర్గం కంగుతింది.
మా సొమ్ముకు శఠగోపం పెడితే ఎలా?
Published Mon, Mar 16 2015 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement
Advertisement