Corporation employees
-
బెడిసికొట్టిన టీడీపీ కుట్ర
వరుస సెలవుల కారణంగా కార్పొరేషన్ ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయి. దీనికి తోడు గత ప్రభుత్వం 010 పద్దు పరిధిలోకి జీవీఎంసీని తీసుకొచ్చే ముందు చేయాల్సిన పని పూర్తి చేయకపోవడంతోనే ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చి వైఎస్సార్ సీపీ సర్కారుపై తప్పును నెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ట్రెజరీకి బిల్లులు పంపిన విషయం తెలిసి కూడా ధర్నా చేసి ప్రభుత్వాన్ని నిందించాలని టీడీపీ ఎమ్మెల్యేలు విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే జీతాలు ఉద్యోగుల ఖాతాలో జమ కావడంతో ధర్నాకు ఒక్కరూ హాజరు కాలేదు. చేసేది లేక ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. సాక్షి, విశాఖపట్నం : సుమారు దశాబ్ద కాలం పోరాటం తర్వాత మహా విశాఖ నగర పాలక సంస్థలో 010 పద్దు అమలుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకూ ఉద్యోగుల జీతాల్ని జీవీఎంసీ చెల్లించేది. 010 పద్దు అమలుతో ట్రెజరీ నుంచి ప్రతి ఉద్యోగికీ జీతం జమవ్వాలి. గత ఏప్రిల్‌కు సంబంధించిన జీతాలు ఈ పద్దు పరిధిలోకి వచ్చి.. ట్రెజరీ నుంచి పడతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి 010 అమలు చేసే రెండు నెలల ముందే జీవీఎంసీకి ప్రభుత్వం సూచనలివ్వాల్సిన అవసరం ఉంది. అలా సమాచారం అందిస్తే పద్దు పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగికి సంబంధించిన అన్ని దస్త్రాలు సిద్ధం చేసి అమలైన వెంటనే ట్రెజరీకి అప్పగించే అవకాశముండేది. ఫలితంగా నిర్ణీత సమయానికి జీతాలు చెల్లింపులు జరిగేవి. కానీ అవేమీ చేయకుండా కేవలం ఎన్నికలు వస్తున్నాయన్న నెపంతో ఆదరాబాదరాగా జీవో జారీ చేసేశారు అప్పటి టీడీపీ పెద్దలు. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు నాలుగు నెలలుగా జీతాలు, పింఛన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వంపై నెపం నెట్టే యత్నం జీతాలు చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని యూనియన్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం జీతాల చెల్లింపు విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ట్రెజరీ, జీవీఎంసీ అధికారుల్ని ఆదేశించింది. దీంతో ఫైళ్లు చకచకా కదిలాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 2,677 మంది 010 పద్దు పరిధిలోకి వచ్చారు. వీరితో పాటు 1,675 మంది రిటైర్డు ఉద్యోగులు కూడా ఈ పద్దు పరిధిలోకి వచ్చారు. వీరికి సంబంధించిన ఉద్యోగ దస్త్రాల్ని ప్రభుత్వ ఖజానాకు జీవీఎంసీ అధికారులు గత నెల 28న అందించేశారు. అయితే వరుస సెలవులు రావడంతో జీతాలు చెల్లింపులో ఆలస్యమైంది. ఈ విషయం తెలుసుకున్న నగర టీడీపీ ఎమ్మెల్యేలు.. తమ హయాంలో జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు పన్నాగం పన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవీఎంసీ ఉద్యోగుల్ని పట్టించుకోవడం లేదంటూ ధర్నా చేయాలని నిర్ణయించారు. ముందే జమైన జీతాలు జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ప్రజలు, ఉద్యోగుల్ని మభ్యపెట్టేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో సీఐటీయూ, ఉద్యోగులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం 11 గంటలకు ధర్నా చేస్తున్నట్లు నోటీసులిచ్చారు. పది రోజుల క్రితమే దస్త్రాలు పంపించామని అధికారులు వివరించినా వినకుండా ధర్నా చేయాలని భావించారు. అయితే సోమవారం ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరవగానే ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. దీంతో ఉద్యోగులెవ్వరూ ధర్నాకు హాజరు కాలేదు. ఫలితంగా ధర్నా చేపట్టేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిందించాలనుకున్న తమ వ్యూహం బెడిసికొట్టిందని తెలుసుకుని తోకముడిచి వెనుదిరిగారు. మంత్రికి ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు వేతనాల చెల్లింపు విషయంలో వేగవంతంగా ప్రభుత్వం చొరవ చూపడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు నెలల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను గుర్తింపు యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం.ఆనందరావు ఉద్యోగులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి 010 పద్దు కారణంగా జీవీఎంసీ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపుల్లో తలెత్తిన జాప్యానికి శుభంకార్డు పడింది. ఇకపై ప్రతి నెలా ఠంచనుగా ఉద్యోగులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందనున్నాయని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. రూ.34 కోట్లు జమ గత నెల 28న ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లుల్ని జీవీఎంసీ అధికారులు బ్యాంకుకు పంపించారు. దస్త్రాలు పరిశీలించిన తర్వాత జీతాలు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ నెల 1, 2 తేదీలు సెలవు దినాలు కావడం, ఆదివారం కూడా రావడంతో వేల మంది ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల బిల్లుల్ని పరిశీలించేందుకు సమయం పట్టింది. ఈ కారణంగానే జీతాలు ఆలస్యమయ్యాయి. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగాలనుకోవడంపై కొందరు ఉద్యోగుల ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం జీపీఎఫ్ పరిధిలో ఉన్న 1,782 మంది ఉద్యోగులకు జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలు, సీపీఎస్ పరిధిలో ఉన్న 895 మంది ఉద్యోగులకు మే, జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలు చెల్లించారు. మొత్తం 2,677 మంది ఉద్యోగులకు రూ.34 కోట్లు వేతనాలు సోమవారం జమ అయ్యాయి. అదే విధంగా 1,675 మంది రిటైర్డు ఉద్యోగులకు రూ.4.50 కోట్లు పింఛన్ సొమ్ము జమైంది. -
‘కార్పొరేషన్’ ఉద్యోగులకు ట్రెజరీ కష్టాలు
సాక్షి, అమరావతి: ‘‘పేరు గొప్ప–ఊరు దిబ్బ’’ అనే రీతిలో ఉంది గ్రేటర్ విశాఖ, విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగుల పరిస్ధితి. రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్ల ఉద్యోగులు, పెన్షనర్లు ట్రెజరీ ద్వారా ప్రతీ నెలా 1 వ తేదీన జీతాలు పొందుతుంటే, ఈ కార్పొరేషన్ల ఉద్యోగులు సకాలంలో జీతాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చి చేతులు దులుపుకుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటోతేదీ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పది సంవత్సరాల పోరాటం ఫలించిందని ఉద్యోగుల సంబరపడ్డారు. ట్రెజరీ శాఖ కొర్రీతో రెండు కార్పొరేషన్లలోని 8 వేల మంది ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పెన్షన్లు మే 1న పొందలేకపోయారు. జీతాలు ఆలస్యం... గ్రేటర్ విశాఖలో మినిస్ట్రీరియల్ ఉద్యోగులు 2852, పెన్షనర్లు 2 వేల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.17.50 కోట్లు జీతాలుగా చెల్లించాలి. విజయవాడలో మినిస్ట్రీరియల్ ఉద్యోగులు 1700 మంది, పెన్షనర్లు 1650 మంది ఉంటే వీరికి రూ.16.50 కోట్లను చెల్లిస్తోంది. ఈ రెండు కార్పొరేషన్లు సాలీనా రూ.400 కోట్లను ఉద్యోగుల జీతాలకు చెల్లిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్లు పన్నులు ద్వారా లభించిన ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే కార్పొరేషన్లకు పన్నులు రూపంలో వచ్చే ఆదాయం నిలకడగా ఉండకపోవడంతో తమకు జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. ట్రెజరీ శాఖ కొర్రీలు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు 010 పద్దు ద్వారా అంటే..ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల వివరాలను ట్రెజరీలకు అందచేయాలని అధికారులను ఆదేశించింది. అదే ఉత్తర్వులను ట్రెజరీశాఖకు ప్రభుత్వం పంపడటంతో ఉద్యోగులు, పదోన్నతుల వివరాలను తమకు అందించాలని ట్రెజరీ శాఖ కార్పొరేషన్లను కోరింది. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ, ప్రభుత్వం కేటగిరీల వారీగా నియమించిన ఉద్యోగుల వివరాలు, పదోన్నతుల వివరాలను పంపాలని కోరింది. విజయవాడ కార్పొరేషన్ 1981లో ఏర్పాటైంది. మున్సిపాల్టీగా ఉన్న సమయంలో ఉన్న రికార్డులు, కార్పొరేషన్‌లోని రికార్డులను వేర్వేరుగా భద్రపరచడంతో వాటిని ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమ నియామకాలతో సమస్య... కౌన్సిల్, స్టాండింగ్ కమిటీలు చేసిన నియామకాల్లో అక్రమాలు ఉండటంతో వారి విద్యార్హతలు, అనుభవాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ట్రెజరీశాఖకు వివరాలను అందించలేకపోయారు. పూర్తి వివరాలు లేకున్నా ఆడిట్ ఆఫీసర్లు ఆ ఉద్యోగుల వివరాలను ధ్రువీకరించి నివేదిక పంపినా సరిపోతుందని ట్రెజరీ శాఖ వివరించింది. అయితే ఆడిట్ ఆఫీసర్లు సర్టిఫికెట్లు లేనిదే వారి సర్వీసులు, ఉద్యోగ నియామకాలను ధ్రువీకరించలేమని స్పష్టం చేయడంతో కథ మొదటికి వచ్చింది. వీటిని ఇచ్చే వరకు ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాదని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తికావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. దాంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు జీతాలు సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆడిట్ కొర్రీలు పరిష్కారమయ్యే వరకు నగర పాలక సంస్ధలు జీతాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన తరువాత తాము నేరుగా జీతాలు చెల్లించలేమని గ్రేటర్ విశాఖ అధికారులు స్పష్టం చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ నుంచి ఇక్కడి ఉద్యోగులు వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. ట్రెజరీ శాఖ అభ్యంతరాలకు సంబంధించిన పనులను అధికారులు వెంటనే పూర్తిచేసి తమకు ప్రతీ నెలా 1 వ తేదీన జీతాలు వచ్చేలా చూడాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
మా సొమ్ముకు శఠగోపం పెడితే ఎలా?
కృష్ణా(విజయవాడ) : తప్పు మీరు చేసి మా పొదుపు నుంచి కట్ చేస్తే ఎలా? ఉద్యోగుల సొమ్ము అప్పనంగా వాడేసిన కమిషనర్లపై కేసు పెట్టండి. లేదంటే మీరే బాధ్యత వహించండి.. అంటూ కార్పొరేషన్ ఉద్యోగులు విజయవాడ మునిసిపల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పాలక వర్గంపై తిరుగుబాటు చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సొసైటీ వార్షిక బడ్జెట్ సమావేశం హనుమాన్ పేటలోని జంధ్యాల దక్షిణామూర్తి నగరపాలక సంస్థ పాఠశాలలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది. వివరాలు.. 2012వ సంవత్సరంలో 650 మంది ఉద్యోగులు సొసైటీ నుంచి తీసుకున్న రుణ మినహాయింపు కోసం వారి జీతాల నుంచి కొంత సొమ్ము కట్ చేశారు. అయితే, కట్ చేసిన సొమ్ము రూ.2.68 కోట్లను బ్యాంక్‌కు మినహాయించలేదు. ఆ మొత్తాన్ని ఇతర పనుల కోసం వినియోగించారు. ప్రస్తుతం ఆ రూ.2.68 కోట్లకు రూ.80లక్షలు వడ్డీ అయ్యింది. ఈ నష్టాన్ని తిరిగి ఉద్యోగుల జీతం నుంచి భర్తీ చేస్తున్నారు. ఈ అంశాన్ని సొసైటీ డెరైక్టర్ బ్రహ్మారెడ్డి బడ్జెట్ సమావేశంలో లేవనెత్తారు. వడ్డీ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. దీనిని పూడ్చుకునేందుకు ఉద్యోగుల పొదుపు సొమ్ము నుంచి మినహాయించడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ఉద్యోగుల సొమ్ము వాడుకునే అధికారం నాటి కమిషనర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రావిడెంట్ ఫండ్ మొత్తం ఎంత ఉందో తేల్చిచెప్పాలన్నారు. ఆడిట్ వ్యవహారంలోనూ మతలబు జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని మరో డెరైక్టర్ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఖర్చవుతోందని ప్రశ్నించారు. అయితే, ఇవి అంచనాలు మాత్రమేనని ఈశ్వర్ సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఉద్యోగికి రూ.3.50 లక్షలు వ్యక్తిగత రుణాన్ని అందించనున్నట్లు ఈశ్వర్ స్పష్టంచేశారు. గతంతో పోలిస్తే లక్ష రూపాయల మేర రుణ పరపతి పెరుగుతోందన్నారు. పొదుపు మొత్తాన్ని నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు పెంచాలన్న పాలకపక్షం ప్రతిపాదనను కొందరు సభ్యులు వ్యతిరేకించారు. బడ్జెట్ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇద్దరు డెరైక్టర్లతో పాటు పలువురు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాలకవర్గం కంగుతింది. -
నారీ గర్జన
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : అనంతపురం నగరంలో మహిళా ఉద్యోగుల ‘నారీ గర్జన ’కు వేలాది మంది కదలివచ్చారు. స్థానిక తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి.. సప్తగిరి సర్కిల్ మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహిళా జేఏసీ నేతలు... సోనియా, సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా దుమ్మెత్తిపోశారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తున్న వీరి రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా... ఈ నెల 29 వరకు మూకుమ్మడిగా కోర్టు విధులు బహిష్కరించాలని సీమాంధ్ర జిల్లాల న్యాయవాదులు తీర్మానించారు. స్థానిక కమ్మభవన్‌లో నిర్వహించిన న్యాయవాదుల సదస్సులో 13 జిల్లాలకు చెందిన జేఏసీ నేతలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ఉచిత న్యాయ సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 28న హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదుల బహిరంగసభ, అక్టోబర్ 5,6 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. జాక్టో, పంచాయతీరాజ్, ఎన్జీవో, హంద్రీ-నీవా, వాణిజ్యపన్నులశాఖ, కార్పొరేషన్ ఉద్యోగులు, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తూనే... మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. విభజిస్తే ఉరే శరణ్యమంటూ పలువురు సమైక్యవాదులు.. ఉరితాళ్లు మెడకు తగిలించుకుని నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరంలో మహిళా గర్జనకు జనం పోటెత్తారు. ఉద్యోగ జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. పట్టణంలో ప్రధాన రహదారులను దిగ్బంధించారు. ఓ సమైక్యవాది ఒంటికి పేపర్లు చుట్టుకుని నిరసన తెలిపారు. ముదిగుబ్బలో మహిళా గర్జనలో సమైక్య నినాదాలు మార్మోగాయి. గుంతకల్లులో వివిధ జేఏసీలు, వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు రిలే దీక్షలను కొనసాగించారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో మహిళలు, గుత్తిలో ఆర్ఎంపీ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. గుత్తిలో సమైక్యవాదులు కేంద్ర కార్యాలయాలను బంద్ చేయించారు. హిందూపురంలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు కొనసాగాయి. చిలమత్తూరులో ఐసీడీఎస్ ఉద్యోగులు, జేఏసీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో హిందీ పండిట్లు రిలే దీక్షకు దిగారు. హిందీ దివస్ సందర్భంగా రోడ్డుపైనే పిల్లలకు ‘సమైక్యాంధ్ర’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. మహిళలు ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు కొనసాగాయి. ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో విద్యుత్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. మహిళలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అమరాపురంలో బంద్ పాటించారు. మడకశిరలో ఈ నెల 19న నిర్వహించే లక్షగళ గర్జనపై గుడిబండలో ఎంఆర్పీఎస్ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. ఓడీసీ, పామిడి, పరిగిలో ఉద్యోగ జేఏసీ నేతలు, అమడగూరులో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమడగూరులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పుట్టపర్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి రిలే దీక్షలు చేశారు. వారికి పుడా ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. పెనుకొండలో చేపట్టిన రిలే దీక్షల్లో మైనార్టీ మహిళలు, అంగన్వాడీలు, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు. గోరంట్లలో మహిళలు, రొద్దంలో విద్యార్థులు, సోమందేపల్లిలో గుడిపల్లి మహిళలు ర్యాలీలు చేపట్టారు. రాయదుర్గంలో మహిళా గర్జనకు వేలాది మంది హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ వర్గాల సమైక్య శిబిరాల్లో ఆర్ఎంపీ వైద్యులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం ప్రకటించారు. కణేకల్లులో బంద్ నిర్వహించగా.. లింగాయత్‌లు ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. గార్లదిన్నె మండలం కల్లూరులో సమైక్యవాదుల ఆమరణ దీక్ష మూడవ రోజూ కొనసాగింది. మహిళా గర్జనతో తాడిపత్రి హోరెత్తింది. వేలాది మంది మహిళలు ర్యాలీ చేపట్టి, మానహారంగా ఏర్పడ్డారు. ఎల్ఐసీ ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. యాడికిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దవడుగూరులో విద్యార్థులు సైకిల్ ర్యాలీ, ఉరవకొండలో ఐకేపీ మహిళలు ర్యాలీ నిర్వహించారు.