కరోనా పోరు: శభాష్‌ చిన్నారులు | Corona Virus: Mizoram Little Girls Donate Their Savings | Sakshi
Sakshi News home page

చిన్నారుల పెద్ద మనసు!

Published Thu, Apr 2 2020 9:01 PM | Last Updated on Thu, Apr 2 2020 9:07 PM

Corona Virus: Mizoram Little Girls Donate Their Savings - Sakshi

కరోనాపై పోరాటంలో తమ వంతు సాయం అందించి ఇద్దరు చిన్నారులు పెద్ద మనసు చాటుకున్నారు.

ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు అక్కాచెల్లెళ్లు. కరోనా విజృంభణ నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశానికి తమ వంతు సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. మిజోరం రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారుల పేర్లు మాన్‌పుయ్‌ రొకుమ్‌(10), లార్లూట్‌ఫెలీ రొకుమ్‌(5). కొలాసిప్‌ జిల్లా బిల్కావత్తిలిర్‌లోని దావర్‌ వెంగ్‌ ప్రాంతానికి చెందిన చిన్నారులిద్దరూ డిబ్బీల్లో తాము దాచుకున్న  డబ్బులను కరోనా మహమ్మారిపై పోరాడుతున్న సంస్థకు విరాళం ఇచ్చేశారు.

వీరు డిబ్బీలో దాచుకున్న డబ్బులను లెక్కిస్తే రూ. 609, రూ. 580 వచ్చాయి. చిన్న వయసులో పెద్ద మనసు దాటిన అక్కాచెల్లెళ్లపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎంతో మంది చిన్నారులు కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు రావడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. (కరోనా: పెరుగుతున్న ‘తబ్లిగి’ కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement